Israel : గాజాపై దాడులు.. స్వల్ప విరామాలకు ఇజ్రాయెల్‌ యోచన

Israel: గాజా(Gaza)లో సహాయ సామగ్రి ప్రవేశం లేదా బందీల నిష్క్రమణను సులభతరం చేయడానికి వ్యూహాత్మక చిన్న విరామాలను పరిశీలిస్తుందని ఇజ్రాయెల్(Israel) ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) తెలిపారు. అయితే అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ సాధారణ కాల్పుల విరమణ కోసం చేసిన పిలుపులను మళ్లీ తిరస్కరించారు. గాజాలో హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టేవరకు తమ పోరాటం ఆగదని నెతన్యాహు స్పష్టం చేశారు.  కాల్పులు విరమించాలని ప్రపంచదేశాలు కోరుతున్నా.. ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel-Hamas conflict) పరస్పరం దాడులకు దిగుతూనే ఉన్నాయి. […]

Share:

Israel: గాజా(Gaza)లో సహాయ సామగ్రి ప్రవేశం లేదా బందీల నిష్క్రమణను సులభతరం చేయడానికి వ్యూహాత్మక చిన్న విరామాలను పరిశీలిస్తుందని ఇజ్రాయెల్(Israel) ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) తెలిపారు. అయితే అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ సాధారణ కాల్పుల విరమణ కోసం చేసిన పిలుపులను మళ్లీ తిరస్కరించారు. గాజాలో హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టేవరకు తమ పోరాటం ఆగదని నెతన్యాహు స్పష్టం చేశారు. 

కాల్పులు విరమించాలని ప్రపంచదేశాలు కోరుతున్నా.. ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel-Hamas conflict) పరస్పరం దాడులకు దిగుతూనే ఉన్నాయి. హమాస్‌ మిలిటెంట్లతో యుద్ధం మొదలై నెల రోజులయిన సందర్భంగా ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) మీడియాతో మాట్లాడారు. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న తమ పౌరుల్ని విడిచిపెట్టేవరకు కాల్పులు విరమించబోమని మరోసారి స్పష్టం చేశారు. హమాస్‌ మిలిటెంట్లకు కేంద్రంగా మారిన గాజాకు ఇంధనం సరఫరా కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

 హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌(Lebanon)ను స్థావరంగా చేసుకొని ఇజ్రాయెల్‌పై దాడి చేస్తోన్న హెజ్‌బొల్లా గ్రూప్‌(Hezbollah group)ను నెతన్యాహు హెచ్చరించారు. లెబనాన్‌ నుంచి యుద్ధంలో భాగమవ్వాలని చూస్తే హెజ్‌బొల్లా పెద్ద పొరపాటు చేస్తున్నట్లేనని చెప్పారు. దీనికి తీవ్ర పరిణామాలుంటాయన్నారు. అక్టోబర్‌ 7న జరిగిన దాడుల్లో 1400 మంది తమ ప్రజలు మృతి చెందారని, 240కి మందికిపైగా పౌరుల్ని హమాస్‌(Hamas) అపహరించి బందీలుగా చేసుకుందని ఇజ్రాయెల్‌(Israel) తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 11 వేల మందికి పైగా మృతి చెందినట్లు హమాస్‌ ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

Also Read: Iran : గాజా మారణహోమాన్ని ఆపాలని భారత్​కు ఇరాన్ వినతి

స్వల్ప విరామం

హమాస్‌ దాడులకు ప్రతీకారంగా గాజాపై నెల రోజులుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌.. వ్యూహాత్మకంగా స్వల్ప విరామం ప్రకటించేందుకు అంగీకరించింది. ప్రదేశాల వారీగా స్వల్ప సడలింపులు ఇచ్చేందుకు ముందుకువచ్చింది. మానవతా సాయాన్ని సులభతరం చేయడానికి, బందీల నిష్క్రమణకు వీలుగా వ్యూహాత్మకంగా స్వల్ప విరామాలను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు(Netanyahu) తెలిపారు. అయితే, బందీలను హమాస్‌ విడిచిపెట్టేదాకా గాజాలో కాల్పుల విరమణ పాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  

‘యుద్ధం తర్వాత కూడా గాజాను మేమే..’

గాజా(Gaza)పై తమ దేశం చేస్తున్న యుద్ధానికి సాధారణ కాల్పుల విరమణ ఆటంకం కలిగిస్తుందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu) తెలిపారు. పూర్తి స్థాయి కాల్పుల విరమణను హమాస్‌(Hamas) అనుకూలంగా మార్చుకొని.. తిరిగి బలపడే ప్రమాదం ఉందని అమెరికా(America) కూడా భావిస్తోంది. అయితే మానవతా కారణాలతో ప్రదేశాలవారీగా దాడులకు స్వల్ప విరామం ప్రకటించే విషయాన్ని పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రధాని చెప్పారు.

 వ్యూహాత్మక దాడులకు స్వల్ప విరామాలను గంట చొప్పున ఇప్పటికే అమలు చేస్తున్నట్లు తెలిపారు. మానవతాసాయం గాజా లోపలికి రావడానికి లేదా తమ దేశ బందీలు, విదేశీ బందీలు గాజాను వీడటానికి వీలుగా పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా గాజాలో సుదీర్ఘకాలం భద్రతను తామే పర్యవేక్షించాల్సి ఉంటుందన్న నెతన్యాహు.. ఇంతకాలం పట్టించుకోకపోవటమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని అంటున్నారు. ఇప్పటికే నలుగురు బందీలను విడుదల చేసిన హమాస్‌ మిలిటెంట్లు మరో ఐదుగురికి విముక్తి కలిగించారు. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ దాడిచేసిన మిలిటెంట్లు దాదాపు 240 మందిని బందీలుగా గాజాకు తరలించడం తెల్సిందే.  

పెట్రోల్, డీజిల్‌ నిల్వలు ఖాళీ

గాజాలోకి పెట్రోల్, డీజిల్‌ సరఫరాకు ఇజ్రాయెల్‌(Israel) అనుమతి ఇవ్వడం లేదు. గాజాలో ఇంధనం నిల్వలు పూర్తిగా నిండుకున్నట్లు సమాచారం. ఇంధనం లేక పరిస్థితి మరింత దిగజారుతోందని స్థానిక అధికారులు ఆందోళన చెందుతున్నారు. గాజాలో 35 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 15 ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్‌ దాడులతోపాటు ఇంధనం లేకపోవడమే ఇందుకు కారణం. మిగిలిన ఆసుపత్రులు పాక్షికంగానే పని చేస్తున్నాయి.   

సమస్య పరిష్కారంలో భద్రతా మండలి విఫలం  

నెల రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌(Israel – Hamas) యుద్ధానికి పరిష్కారం సాధించడంలో ఐక్యరాజ్యసమితి భదత్రా మండలి మరోసారి విఫలమైంది. తాజాగా మండలిలో రెండు గంటలకుపైగా చర్చ జరిగింది. సభ్యదేశాలు భిన్న వాదనలు వినిపించాయి. ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. మానవతా సాయాన్ని గాజాకు చేరవేయడానికి అవకాశం కల్పించాలని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది.