Israel – Gaza War : బందీలను విడుదల చేసిన హమాస్, నిరాకరించిన ఇజ్రాయెల్

Israel – Gaza War  : అక్టోబర్ 7వ తేదీన దక్షిణ ఇజ్రాయెల్ లో జరిగిన దాడిలో పాలస్తీనా 210 మందిని బంధించింది. వారి విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ ఎటువంటి వ్యాఖ్యలను చేయలేదు. కాగా మానవతా దృక్పథంతో ఇద్దరు బందీలను విడుదల చేయడానికి తమ బృందం అంగీకరించింది అని అయితే వారిని స్వీకరించే అందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది అని హమాస్ చేస్తున్న వాదనను ఇజ్రాయెల్ పూర్తిగా వ్యతిరేకించింది. హమాస్ వ్యాఖ్యలను కేవలం ప్రచారం గా […]

Share:

Israel – Gaza War  : అక్టోబర్ 7వ తేదీన దక్షిణ ఇజ్రాయెల్ లో జరిగిన దాడిలో పాలస్తీనా 210 మందిని బంధించింది. వారి విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ ఎటువంటి వ్యాఖ్యలను చేయలేదు. కాగా మానవతా దృక్పథంతో ఇద్దరు బందీలను విడుదల చేయడానికి తమ బృందం అంగీకరించింది అని అయితే వారిని స్వీకరించే అందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది అని హమాస్ చేస్తున్న వాదనను ఇజ్రాయెల్ పూర్తిగా వ్యతిరేకించింది. హమాస్ వ్యాఖ్యలను కేవలం ప్రచారం గా ఇజ్రాయెల్ అభివర్ణించింది. 

గతంలో జుడిత్ మరియు నటాలీ ల విడుదల కోసం ఉపయోగించిన విధానాల ద్వారా మరో ఇద్దరు వ్యక్తులను విడుదల చేయడానికి హమాస్ (Hamas) సిద్దంగా ఉంది అని హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి అబు ఉబైదా వెల్లడించారు. 

గాజా లో ప్రస్తుతం మిలిటెంట్ల దగ్గర 210 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ దళం పేర్కొన్నారు. ఇంకా కనిపించకుండా పోయిన వారి కోసం మిలటరీ దర్యాప్తు జరుగుతున్నది. 

Also Read: Hamas: హమాస్ టెర్రరిస్టులకు మైండ్ బ్లాంక్

హమాస్ దగ్గర కెమికల్ బాంబ్ లు ఉన్నాయి : ఇజ్రాయెల్ 

ఇజ్రాయెల్ సైన్యం దాడిలో చనిపోయిన హమాస్ సాయుదుడు దగ్గర కెమికల్ ఆయుధాలకు సంబందించిన ఆనవాళ్లు దొరికాయి అని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ అన్నారు. ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా నుండి హమాస్ రసాయన ఆయుధాలను తయారుచేసే సమాచారం తీసుకున్నది అని కూడా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఆరోపించారు. హమాస్ చేసిన దాడుల వలన ఇప్పటికే 1400 మంది పౌరులు, సైనికులు చనిపోయారు అని మరో 210 మంది హమాస్ దగ్గర బందీలుగా ఉన్నారు అని ఆయన అన్నారు. 

దాదాపు 15 రోజుల క్రితం ఇజ్రాయెల్ పై హమాస్ ఉన్నట్టుండి దాడి చేయగా ఇజ్రాయెల్ కూడా గాజా మీద వైమానిక దాడులు (Israel – Gaza War)చేసింది. భూతల దాడులు చేయడానికి కూడా ఇజ్రాయెల్ సైన్యాన్ని సిద్ధం చేసింది. గాజా సరిహద్దు లో ఈ సైన్యం వేచి ఉన్నట్లు సమాచారం. 

ఎటు చూసినా రక్తపాతం 

గాజా లోని ఒక ఆసుపత్రిలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో (Israel – Gaza War) దాదాపు 500 మంది చనిపోయారు, అయితే ఈ దాడి ఇజ్రాయెల్ పని కాదు అని ఫ్రాన్స్ సైనిక ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. బహుశా ఇది పాలస్తీనా రాకెట్ పొరపాటున ఆసుపత్రి మీద పడి ఉండవచ్చు అని పేర్కొన్నది. గాజా లో బాధితుల సహాయం కోసం భారత్ వైద్య సామగ్రిని ప్రత్యేక విమానంలో పంపించింది. అయితే ప్రస్తుతం ఉన్న వైద్య సామాగ్రి గాజా లో అసలు సరిపోవడం లేదు. గాయాల పాలు అయిన పౌరులకు శస్త్ర చికిత్స సమయంలో శరీరానికి కుట్లు వేయడానికి దుస్తులు కుట్టే సూదులను ఉపయోగిస్తున్నారు. 

హెజ్బొల్లా యుద్ధం లోకి వస్తె లెబనాన్ విధ్వంసాన్ని చూడల్సి వస్తుంది అని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరించారు. తాము చేసే దాడులను ఊహించలేరు అని కూడా అన్నారు. 

హమాస్ (Hamas) మొదలు పెట్టిన ఈ దుశ్చర్య వలన గాజా అతలాకుతలం అయ్యింది, ఎటు చూసినా ప్రజల శవాలు, గాయాల పాలు అయిన వారి హాహాకారాలు మిన్నంటుతున్నాయి. మరోవైపు గాజాకు వెళ్ళే వైద్య, ఆహార సహయలను కూడా ఇజ్రాయెల్ అడ్డుకుంటుంది. గాజా పైన దాడులు (Israel – Gaza War) ఇంకా తీవ్రం అవుతాయి అని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. గాజా పై చేస్తున్న బాంబు దాడులను నిలిపి వేస్తే బందీలుగా ఉన్న వారిని విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది.