Israel: ప్రియుడి శవం కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్న యువ‌తి

Israel: యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హ‌మాస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలు (Hostages)గా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హ‌మాస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. హఠాత్తుగా జరిగిన హమాస్ (Hamas) ఎటాక్ […]

Share:

Israel: యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హ‌మాస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలు (Hostages)గా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హ‌మాస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. హఠాత్తుగా జరిగిన హమాస్ (Hamas) ఎటాక్ కారణంగా ఎన్నో జీవితాలు కుప్పకూలాయి. ఇప్పుడు ఇరువైపుల నుంచి యుద్ధం (War) కొన్ని వేల జీవితాలను బలిగొంది. 

స్నేహితుడు శవం కింద దాక్కున్న ఇజ్రాయిల్ మోడల్: 

గత నెలలో ఇజ్రాయిల్‌ (Israel)లోని ఒక మ్యూజిక్ ఫెస్టివల్ జరిగిన ప్రదేశం, హమాస్ (Hamas) చేసిన మొదటి దాడులలో ఒకటి. ఇక్కడ 250 మందికి పైగా మరణించారు. అప్పుడు, మ్యూజిక్ ఫెస్టివల్ హాజరైన ఒక ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model), హమాస్ (Hamas) ఎటాక్ నుంచి తప్పించుకోవడానికి తన బాయ్ ఫ్రెండ్ తో సహా, మృతదేహాల కుప్ప కింద గంటల తరబడి ఎలా దాక్కోవలసి వచ్చిందో వివరించింది. 

తన బాయ్ ఫ్రెండ్ డేవిడ్ నేమాన్‌ను కాల్చి చంపిన తర్వాత రెండు గంటల పాటు మృతదేహాల కుప్ప కిందనే దాక్కోవాల్సి వచ్చిందని, కాలు అదేవిధంగా భుజంపై గాయాలు పాలైన ఇరవై ఏడు సంవత్సరాల మోడల్ (Model) నోమ్ మజల్ బెన్-డేవిడ్ చెప్పింది. చాలా రక్తాన్ని కోల్పోయినప్పటికీ, హమాస్ (Hamas) ఎటాక్ జరిగిన సమయంలో మోడల్ (Model) సజీవంగా తప్పించుకోగలిగిందని చెప్పుకొచ్చింది. అక్టోబర్ 7 ఉదయం 6.30 గంటలకు సూపర్‌నోవా ఉత్సవానికి చేరుకున్నప్పుడు పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయని.. ఆ తర్వాత అంతా అంధకారంగా మారింది అంటూ చెప్పుకొచ్చింది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model). 

విషాద గాధ: 

నిజానికి తాము తప్పించుకోవడానికి కారులో ప్రయాణమవుతున్న సందర్భంలో, చాలామంది సెక్యూరిటీ గార్డులు తమని తమ ప్రాణాల కోసం రక్షించుకోమంటూ తమకి చెప్పారని, అంతేకాకుండా ఎవరిని బడితే వాళ్ళని విచక్షణ రహితంగా తుపాకీలతో కాల్చి చంపుతున్నారని, సెక్యూరిటీ గార్డులు హెచ్చరించినట్లు చెప్పుకొచ్చింది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model). అయితే ఎటాక్ జరుగుతున్న సందర్భంలో తాము నిజానికి ఒక పెద్ద డస్ట్ బిన్ వెనక దాకున్నామని, తనతో పాటు 14 మంది మూడు గంటలు దాకున్నప్పటికీ, చాలామంది వాళ్లని కనిపెట్టి తన బాయ్ ఫ్రెండ్ ను కాల్చి చంపారని బాధాకరమైన విషాద కథను వెల్లడించింది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model). ఆ సమయంలోనే చాలామంది తమని కాపాడమంటూ తమని బందీలుగా చేయొద్దు అంటూ ఆర్తనాదాలు చేసినట్లు ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model) వెల్లడించింది. ఈ ఘోరమైన సంఘటన నుంచి బయటపడేందుకు చాలామందికి ఫోన్లు చేస్తూ, భయానక సందర్భం మరొకసారి గుర్తు చేసుకుంది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model). 

మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు చాలామంది పారాషూట్లు మీద అక్కడికి దిగి, హమాస్ (Hamas) వైపు నుంచి ఎటాక్ చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. చాలామంది విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ ఎంతో మందిని పొట్టను పెట్టుకోగా, చాలా మందిని ఇబ్బందిగా మార్చారు. ఇజ్రాయిల్‌ (Israel) హమాస్ (Hamas) మధ్య యుద్ధం (War) మొదలై సుమారు నెల రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ అక్కడ పరిస్థితులు ఏ మాత్రం సద్దుమనగలేనట్లు తెలుస్తోంది. మరోవైపు చాలా దేశాలు, యుద్ధం (War) జరుగుతున్న ఇరుదేశాల మధ్య శాంతి చేకూర్చాలని తమ వైపు నుంచి కృషి చేస్తున్నారు. అక్టోబర్ 7న జరిగిన దాడి లో, పాలస్తీనా హమాస్ (Hamas) సమూహం, ఇజ్రాయిల్‌ (Israel) సరిహద్దు పట్టణాలలో నివసిస్తున్న  200 మందికి పైగా పౌరులను కిడ్నాప్ చేసి బందీలు (Hostages)గా మార్చింది. వీరిలో పలువురు విదేశీయులు.. రెండు దేశాలకు సంబంధించి పౌరసత్వం కలిగినవారు ఉన్నారు. ఇజ్రాయిల్‌ (Israel) తో తక్షణ ఖైదీ (prisoners)ల మార్పిడి (Exchange)కి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ (Hamas) నాయకుడు యాహ్యా సిన్వార్ ఇటీవల చెప్పారు.