Gaza: ఆసుపత్రిలో పేలుడు.. 500 మంది మృతి

హమాస్(Hamas) ఉగ్రవాదులు చేసిన రాకెట్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్(Israel) సైన్యం భీకర దాడులు చేస్తుంది. ముఖ్యంగా, హమాస్ ఉగ్రవాదులకు మంచి పట్టుున్న గాజా(Gaza)లో రాకెట్‌ దాడులతో విరుచుకుపడుంది. తాజాగా గాజా(Gaza)లోని ఓ ఆస్పత్రిలో జరిగిన పేలుడు ధాటికి 500 మంది వరకు చనిపోయారు. అయితే,.. ఈ దాడులకు ఇజ్రాయెల్ కారణమని హమాస్‌లు ఆరోపిస్తే.. ఇదంతా హమాసీల పనేనని ఇజ్రాయెల్  ఆరోపిస్తోంది. హమాస్‌(Hamas)పై ఇజ్రాయేల్(Israel) ప్రతీకార దాడులతో వణికిపోతున్న గాజా నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఓ ఆసుపత్రిలో […]

Share:

హమాస్(Hamas) ఉగ్రవాదులు చేసిన రాకెట్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్(Israel) సైన్యం భీకర దాడులు చేస్తుంది. ముఖ్యంగా, హమాస్ ఉగ్రవాదులకు మంచి పట్టుున్న గాజా(Gaza)లో రాకెట్‌ దాడులతో విరుచుకుపడుంది. తాజాగా గాజా(Gaza)లోని ఓ ఆస్పత్రిలో జరిగిన పేలుడు ధాటికి 500 మంది వరకు చనిపోయారు. అయితే,.. ఈ దాడులకు ఇజ్రాయెల్ కారణమని హమాస్‌లు ఆరోపిస్తే.. ఇదంతా హమాసీల పనేనని ఇజ్రాయెల్  ఆరోపిస్తోంది.

హమాస్‌(Hamas)పై ఇజ్రాయేల్(Israel) ప్రతీకార దాడులతో వణికిపోతున్న గాజా నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఓ ఆసుపత్రిలో పేలుడు సంభవించి కనీసం 500 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇజ్రాయేల్‌, హమాస్ పరస్పర ఆరోపణలు(Accusations) చేసుకుంటున్నాయి. పేలుడుకు ఇజ్రాయేల్ వైమానిక దాడులే కారణమని హమాస్ ఆరోపించగా… అది ఇస్లామిక్ జిహాదీల చర్యేనని టెల్ అవీవ్ ప్రత్యారోపణలు చేసింది. గాజా(Gaza) నగరంలోని అల్‌ అహ్లి ఆసుపత్రిలో జరిగిన ఈ దుర్ఘటన దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయేల్‌, పాలస్తీనా ఘర్షణల్లో అత్యంత ఘోరమైంది.

‘గాజాలోని ఆసుపత్రిలో పేలుడుకు ఇస్లామిక్ జిహాద్ కారణమని విశ్వసనీయ వర్గాల ద్వారా లభించిన సమాచారం సూచించింది’ అని ఇజ్రాయేల్ సైన్యం(Israel army) తెలిపింది. ఆసుపత్రికి సమీపంలో వైమానిక కార్యకలాపాలు, ఉపయోగించిన రాకెట్లు వాటి దాని పరికరాలతో సరిపోలడం లేదని వ్యాఖ్యానించింది.

Read mORE: Israel-Gaza War: ఇజ్రాయెల్-గాజా యుద్ధం ఇలాగే కొనసాగిందో….

 మరోవైపు, హమాస్ మిత్రపక్షం ఇస్లామిక్ జిహాద్ సైతం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గాజాలోని బాప్టిస్ట్ అరబ్ నేషనల్ హాస్పిటల్‌పై బాంబు దాడి చేసిన శత్రువు.. అబద్ధపు ప్రకటనతో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్‌పై నిందలు వేసి క్రూరమైన మారణకాండకు తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది.’ అని మండిపడింది.

ఆసుపత్రి పేలుడు ప్రపంచ నాయకుల దృష్టిని ఆకర్షించింది. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఈ సంఘటనపై తన ఆగ్రహాన్ని మరియు విచారాన్ని వ్యక్తం చేశారు మరియు ఇజ్రాయెల్ పర్యటనలో దాని గురించి చర్చించాలనుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్(Antonio Guterres) ఈ దాడిని తీవ్రంగా ఖండించారు, ఇది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని భయంకరమైన ఉల్లంఘనగా అభివర్ణించారు.

Read More: Israel: లెబనాన్ లో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి

ఇరాన్‌(Iran)లో, వందలాది మంది నిరసనకారులు యూకే మరియు టెహ్రాన్‌లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయాల వెలుపల బాంబు దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ibrahim Raisi) ప్రజా సంతాప దినంగా ప్రకటించారు. గాజా, యుద్ధం మరియు మరణంతో పోరాడుతుండగా, రమల్లాలోని పాలస్తీనా(Palestine) భద్రతా దళాలు నిరసనకారులతో ఘర్షణకు దిగడంతో వెస్ట్ బ్యాంక్(West Bank) అశాంతిని ఎదుర్కొంది. అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌(Mahmood Abbas)కు వ్యతిరేకంగా నిరసనకారులు రాళ్లు రువ్వి నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలో విస్తృతమైన ఉద్రిక్తత మరియు నిరాశను ఎత్తిచూపుతూ, కోపంతో ఉన్న గుంపులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ మరియు స్టన్ గ్రెనేడ్‌లను ఉపయోగించారు.

1 మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు గాజా యొక్క ఉత్తర భాగాన్ని వదిలి దక్షిణ ప్రాంతాలకు వెళ్లారు. గాజా స్ట్రిప్‌లో నివసించే ప్రజలు ఇప్పుడు చిన్న ప్రదేశాలలో నివసిస్తున్నారు మరియు వారికి తగినంత మందులు మరియు ఆహారం వంటి ప్రాణాలను రక్షించే వస్తువులు లేనందున ఐక్యరాజ్యసమితి (UN) ఆందోళన చెందుతోంది. కాబట్టి, సాయాన్ని తీసుకురావడానికి మరియు ఈ ప్రజలకు సహాయం చేయడానికి పోరాటానికి తాత్కాలిక విరామం ఇవ్వాలని యూఎన్ అడుగుతోంది. 

కాగా, ఉత్తర గాజాలో ఉన్న ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లాలని ఆదేశించిన ఇజ్రాయేల్‌(Israel) అక్కడా బాంబులతో విరుచుకుపడుతోంది. దక్షిణ గాజాపై మంగళవారం చేసిన దాడుల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. వారిలో ఉత్తర గాజా నుంచి వచ్చి శరణార్ధులు ఉన్నారు. రఫా(Rafa), ఖాన్‌ యూనిస్‌( Khan Yunis) పట్టణాల శివార్లలో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల కారణంగా రఫాలో 27 మంది, ఖాన్‌ యూనిస్‌లో 30 మంది మరణించారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

ఇటు లెబనాన్‌ సరిహద్దులోనూ ఇజ్రాయేల్‌, హెజ్‌బొల్లా(Hezbollah) మధ్య ఘర్షణ కొనసాగింది. అత్యంత దుర్భర స్థితిలో ఉన్న గాజాకు సాయం అందించడానికి దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. గాజాకు మానవతా సాయం అందించేందుకు సహకరించాలని కోరుతూ భద్రతా మండలిలో రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. బుధవారం ఇజ్రాయేల్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పర్యటించనున్నారు.

జోర్దాన్‌లోనూ ఆయన పర్యటించి, అరబ్‌ నేతలతో సమావేశమవుతారు. హమాస్‌తో ఇజ్రాయెల్‌ పోరు తీవ్రమవుతున్న నేపథ్యంలో తమ సైనికులను అమెరికా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఇజ్రాయేల్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని 2 వేల మంది సైనికులను పెంటగాన్‌ ఆదేశించినట్లు ఓ సైనికాధికారి తెలిపారు. కాగా, ఇజ్రాయేల్, హమాస్‌ల మధ్య దాడుల్లో ఇప్పటివరకు ఇరువైపులా దాదాపు 4వేల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయపడ్డారు.