ప్ర‌తిప‌క్షాల సాయం కోర‌నున్న ఇజ్రాయెల్

హమాస్‌ టెర్రరిస్టులను దీటుగా ఎదుర్కోనేందుకు ఇజ్రాయెల్‌ చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా నేషనల్‌ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపక్షాలతో నెతన్యాహు చర్చలు జరుపుతున్నారు. పాలస్తీనాలోని హమాస్‌ మిలిటెంట్ల దాడిలో అతలాకుతలం అవుతున్న ఇజ్రాయెల్‌.. అంతే ధీటుగా వారిని ఎదుర్కోంటుంది. హమాస్‌ దాడిలో ఇప్పటికే ఇజ్రాయెల్‌లో 600 మందికి పైగా ప్రజలు మరణించారు. వీరిలో సైనికులు కూడా ఉన్నారు. అలాగే, పాలస్తీనాలో 313 మంది దుర్మరణం చెందారు. ఇరువైపులా వేల సంఖ్యలో గాయపడ్డారు. […]

Share:

హమాస్‌ టెర్రరిస్టులను దీటుగా ఎదుర్కోనేందుకు ఇజ్రాయెల్‌ చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా నేషనల్‌ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపక్షాలతో నెతన్యాహు చర్చలు జరుపుతున్నారు.

పాలస్తీనాలోని హమాస్‌ మిలిటెంట్ల దాడిలో అతలాకుతలం అవుతున్న ఇజ్రాయెల్‌.. అంతే ధీటుగా వారిని ఎదుర్కోంటుంది. హమాస్‌ దాడిలో ఇప్పటికే ఇజ్రాయెల్‌లో 600 మందికి పైగా ప్రజలు మరణించారు. వీరిలో సైనికులు కూడా ఉన్నారు. అలాగే, పాలస్తీనాలో 313 మంది దుర్మరణం చెందారు. ఇరువైపులా వేల సంఖ్యలో గాయపడ్డారు. ఇప్పటికే హమాస్‌ మిలిటెంట్లపై ఇజ్రాయెల్‌ ప్రధాని నేతాన్యాహు యుద్ధం ప్రకటించారు. హమాస్‌ టెర్రరిస్టులను మట్టుపెట్టేదాకా యుద్ధం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం దేశంలో ఐక్యత కోసం ప్రతిపక్షాలతో చర్చిస్తుంది.

అందరం కలిసి పని చేద్దాం..

ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విభేదాలను పక్కనబెట్టి, అందరం కలిసి పనిచేసే విధంగా దేశలో అత్యవసర జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇజ్రాయెల్‌ అగ్ర నాయకులు చర్చించారు. ఈ విషయంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, ప్రతిపక్ష నాయకులు యాయిర్‌‌ లాపిడ్‌, బెన్నీ గాంట్జ్‌ చర్చించారు. గాజా నుంచి శనివారం ఇజ్రాయెల్‌లోని మామాస్‌  టెర్రరిస్టుల చొరబాటు, రాకెట్‌ దాడుల కారణంగా దేశంలో అత్యవసర పరిస్థితుల కారణంగా నెతన్యాహు ప్రభుత్వంలో చేరే అవకాశం గురించి చర్చించినట్లు ఆ దేశ మీడియా సంస్థ నివేదించింది. 

దీంతో ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంలో చేరే విషయంలో సుముఖత వ్యక్తం చేశారు. అయితే, మంత్రులు బెజలెల్‌ స్మోట్రిచ్‌, ఇటమార్‌‌ బెన్‌గ్విర్‌‌లను తొలగించాలని లాపిడ్‌ డిమాండ్‌ చేశారు.  గాంట్జ్‌ తన నాయకులు ఇద్దరితో కలిసి చేరడానికి అంగీకరించినట్లు నివేదిక తెలిపింది. భద్రతా సమావేశం కోసం ఇద్దరు నాయకులు తనను కలిసినప్పుడు విస్తృత అత్యవసర ప్రభుత్వంలో చేరమని నెతన్యాహు చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా 1967లో జరిగిన యుద్ధంలో అప్పటి ప్రధాని లెవి ఎష్కోల్‌ ప్రభుత్వంలో చేరినందుకు గత లికుడ్‌ నాయకుడు మెనాచెమ్‌ బెగిన్‌ను గుర్తుచేశారు. 

ప్రతిపక్ష నాయకుడు లాపిడ్‌ నెతన్యాహులో బ్రీఫింగ్‌ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే విషయాన్ని తానే ప్రతిపాదించినట్లు వచ్చిన వాదనలను ఆయన ఖండించారు. కాగా, గత డిసెంబర్‌‌లో నెతన్యాహు తిరిగి అధికారంలోకి రాకముందు లాపిడ్‌ ప్రధాన మంత్రిగా పనిచేశారు. 

ప్రభుత్వంలో చేరడానికి సానుకూలంగా ఉన్నాం…

మాజీ రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్ మాట్లాడుతూ, దేశంలో భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వంలో చేరడానికి సానుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ ఎమర్జెన్సీ సమయంలో తాము ఎదుర్కొంటున్న కష్టతరమైన, సంక్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రచారాన్ని నిర్వహించడానికి విభేదాలను పక్కనబెట్టి, అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

యుద్ధంలో గెలవడానికి ఏమైనా చేస్తాం..

ఈ అత్యవసర ప్రభుత్వంలో ఐడీఎఫ్‌ వెనకాల అధిక సంఖ్యలో ఇజ్రాయెల్‌ పౌరులు, రక్షణ సంస్థల సపోర్ట్‌ గా ఉంటారని తమ శత్రువులకు స్పష్టం చేస్తుందని లాపిడ్‌ పేర్కొన్నారు. మరోవైపు, అత్యవసర ప్రభుత్వంలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని గాంట్జ్‌ పార్టీ, నేషనల్‌ యూనిటీ చెప్పారు. ఇందులో బెన్‌గ్విర్‌‌, స్మోట్రిచ్‌ వరుసగా జాతీయ భద్రతా, ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో సరైన భద్రతా నిర్ణయాలు తీసుకోవాలని నేషనల్‌ యూనిటీ పార్టీ సూచించింది. 

‘‘మనకు తగినంత శక్తితో పాటు కలిసి ఉంటే హమాస్‌ టెర్రరిస్టులకు మంచి గిఫ్ట్‌  ఇవ్వడానికి ఉంటుంది. ఈ యుద్ధంలో గెలవడానికి మేము ఏదైనా చేస్తాం. అంతవరకు మా ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయం. యుద్ధంలో గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి బయటకు వస్తాం” అని లాపిడ్‌ తెలిపారు. 

కాగా, ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధంలో ఇప్పటివరకు 1,000 మందికిపైగా చనిపోయారు. ఇరు దేశాల మధ్య ఇంకా భీకర యుద్ధం కొనసాగుతుంది. శనివారం హమాస్‌ టెర్రరిస్టులు ప్రయోగించిన 5 వేల రాకెట్లను ఇజ్రాయెల్‌ ధీటుగా ఎదుర్కోంది. చాలా వాటిని గాల్లోనే పేల్చి వేసింది. దీంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే, ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన హమాస్‌ టెర్రరిస్టులు ఇప్పటికే ఆ దేశ ప్రజలను పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కొంత మందిని చంపేశారు. మరోవైపు, ఇంటింటికి తిరుగుతూ వెతికి మరి ప్రజలను హమాస్‌ టెర్రరిస్టులు చంపుతున్నారు. హమాస్‌ టెర్రరిస్టుల దారుణాన్ని ప్రపంచ దేశాలు అన్నీ ఖండిస్తున్నాయి. యుద్ధం ఆపాలని కోరుతున్నాయి.