ఇజ్రాయిల్  హమ్మస్ యుద్ధంలో 1000 మందికి పైగా దుర్మ‌ర‌ణం

ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా యుక్రేన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్- హమ్మస్ మధ్య అనుకోని రీతిగా యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడిని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ షేర్ […]

Share:

ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా యుక్రేన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్- హమ్మస్ మధ్య అనుకోని రీతిగా యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడిని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ షేర్ చేయడం జరిగింది.

ఇజ్రాయిల్- హమ్మస్ యుద్ధభేరి: 

ప్రపంచంలో ఏ మూల చూసిన సరే హింస చాయలు కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఒకపక్క ఇప్పటికే రష్యా యుక్రెన్ దేశాల మధ్య ఎన్నో నెలలుగా హోరాహోరీగా సాగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతున్న వేళ మరొక యుద్ధం మొదలైంది. ఇజ్రాయిల్ దేశం మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డ హమ్మస్, తన బాంబులతో దాడి చేసింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఉంటున్న వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని మరియు స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని కోరింది.

ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు: 

దశాబ్దాలుగా జరుగుతున్న సంఘర్షణ రక్తపాతంగా మారుతుంది.. కారణంగా హమాస్ భారీ రాకెట్లతో దాడిని చేపట్టింది, నివేదికలు అందిస్తున్న సమాచారం ప్రకారం, 600 మంది ఇజ్రాయెల్‌ వాసులు చనిపోగా సుమారు, 1,000 మందికి పైగా గాయపడ్డాయని పేర్కొంది. తీరప్రాంత ఎన్‌క్లేవ్‌పై తీవ్రమైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కారణంగా, పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 413కి పెరిగినట్లు తెలుస్తోంది, వేలాది మంది గాయపడ్డారని గాజా అధికారులు తెలిపారు. 

లెబనాన్, ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో, ఇజ్రాయెల్ స్థానాలపై పెద్ద సంఖ్యలో ఫిరంగిల్లు, గైడెడ్ క్షిపణుల ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. హమాస్ ప్రారంభించిన దాడికి సంఘీభావంగా ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. 

ఇజ్రాయెల్‌కు దాడి జరిగిన రోజు “బ్లాక్ డే” అని చెప్పి, దానికి ప్రతీకారం తీర్చుకుంటానని, బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేశాడు. హమాస్ సామర్థ్యాలను నాశనం చేయడానికి IDF (సైన్యం) తన శక్తినంతా ఉపయోగించబోతోందని.. వారిని తీవ్రంగా తిప్పికొట్టి, వారు ఇజ్రాయెల్ ప్రజలపై తెచ్చిన ఇటువంటి బాధాకరమైన చీకటి రోజుకు ప్రతిగా.. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని అతను చెప్పాడు. ఆకస్మిక దాడి తరువాత దాని రహస్య స్థావరాలను “శిధిలాలు”గా మారుస్తానని ప్రతిజ్ఞ చేసిన అనంతరం.. గాజాలోని హమాస్ సైట్ల సమీపంలో నివసిస్తున్న పాలస్తీనియన్లను విడిచిపెట్టమని, బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించాడు. 

ఉగ్రవాదుల దాడి: 

దాదాపు 100 మంది సైనికులు మరియు పౌరులను హమాస్ కిడ్నాప్ చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు విధ్వంసం చేసి ఇళ్లలోకి చొరబడ్డారని, పౌరులను ఊచకోత కోశారని.. వందలాది మంది దేశంపై దాడి చేశారని, ఇంకా వందల మంది ఇజ్రాయెల్ లోపల సైనికులతో పోరాడుతున్నారు అని ఆర్మీ ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. బందీలుగా ఉన్న అనేక మంది ఇజ్రాయిలీల ఫోటోలను ప్రస్తుతానికి హమాస్ విడుదల చేసింది. గాజా సమీపంలోని ఇజ్రాయెల్ పట్టణం స్డెరోట్ వీధుల్లో మృతదేహాలు చిందరవందరగా పడి ఉన్నాయి.. అంతేకాకుండా కార్ల లోపల, బుల్లెట్ల వడగళ్లతో విండ్‌స్క్రీన్‌లు సైతం పగిలిపోయాయి. 

ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం తన పౌరులను అప్రమత్తంగా ఉండాలని మరియు స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని కోరింది. ముఖ్యంగా అనవసరంగా ఎవరూ కూడా తమ ఉన్న చోటు విడిచి బయటికి వెళ్ళకూడదని.. ప్రతి ఒక్కరు కూడా కార్యాలయంలో ఉంటూ జాగ్రత్త వహించాలని అధికారులు తెలియజేయడం జరిగింది.