Idan Amedi: ఇజ్రాయెల్ ఆర్మీకి ఆ దేశ న‌టుడు ఇదాన్ అమేదీ సాయం

ఇజ్రాయెల్(Israel), పాలస్తీనా(Palestine ) మధ్య యుద్ధం తీవ్ర రూపు దాల్చింది. ఇజ్రాయెల్‌పై హమాస్(Hamas) ఉగ్రవాదులు దాడి చేస్తుండగా.. అంతకు రెట్టింపు దాడులు ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై చేస్తోంది. ఇదాన్ అమేదీ(Idan Amedi) అనే ఇజ్రాయెల్ నటుడు, ‘ఫౌదా(Fouda)’ అనే టీవీ సిరీస్‌లో తన పాత్రకు ప్రసిద్ధి చెందాడు, హమాస్‌తో తీవ్రమైన ఘర్షణ సమయంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్‌(Defense Force)లో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఇదాన్ అమేదీ సైన్యంలో చేరడానికి ఎందుకు ఎంచుకున్నాడో వివరిస్తూ  ఒక వీడియో షేర్ చేశాడు. […]

Share:

ఇజ్రాయెల్(Israel), పాలస్తీనా(Palestine ) మధ్య యుద్ధం తీవ్ర రూపు దాల్చింది. ఇజ్రాయెల్‌పై హమాస్(Hamas) ఉగ్రవాదులు దాడి చేస్తుండగా.. అంతకు రెట్టింపు దాడులు ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై చేస్తోంది. ఇదాన్ అమేదీ(Idan Amedi) అనే ఇజ్రాయెల్ నటుడు, ‘ఫౌదా(Fouda)’ అనే టీవీ సిరీస్‌లో తన పాత్రకు ప్రసిద్ధి చెందాడు, హమాస్‌తో తీవ్రమైన ఘర్షణ సమయంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్‌(Defense Force)లో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఇదాన్ అమేదీ సైన్యంలో చేరడానికి ఎందుకు ఎంచుకున్నాడో వివరిస్తూ  ఒక వీడియో షేర్ చేశాడు. దీనికి కొద్ది రోజుల ముందు, ‘ఫౌదా’ నుండి మరొక నటుడు, లియర్ రాజ్ కూడా ముందు వరుసలో సహాయం చేయడానికి ‘బ్రదర్స్ ఇన్ ఆర్మ్స్'(Brothers in Arms) అనే స్వచ్ఛంద సమూహంలో చేరాడు.

ఈ రోజు నేను విభిన్నంగా దుస్తులు, తుపాకీ ధరించడం మీరు గమనించవచ్చు. ఇది ‘ఫౌదా’లోని క్యారెక్టర్ కాదు.. ఇది నిజ జీవితం. దక్షిణ ఇజ్రాయెల్‌(Southern Israel)లో పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు శనివారం ఉదయం మా సైన్యానికి కాల్ వచ్చింది.  నేను మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, మేము భయంకరమైన దాడులను చూసినప్పటికీ, స్నేహితులు, కుటుంబ సభ్యులను కోల్పోయినప్పటికీ, మేము ఇప్పటికీ బలంగా ఉన్నాము, మేము ఇక్కడ ఎందుకు ఉన్నామో మేము సరిగ్గా అర్థం చేసుకున్నాము. మా పిల్లలు, కుటుంబాలు మరియు గృహాలను సురక్షితంగా ఉంచడమే మా లక్ష్యం. విజయం సాధించే వరకు పట్టు వదలబోమని ఇడాన్ అమెడి వాగ్దానం చేశాడు.

ముందు వరుసలో ఉన్న సైనికులకు కేర్ ప్యాకేజీలు(Care packages) మరియు అందమైన లెటర్స్ మరియు డ్రాయింగ్‌లను పంపిన ఇజ్రాయెల్‌లోని ప్రజలందరికీ అమెడి తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ హావభావాలు తమకు బలాన్ని ఇచ్చాయని, “త్వరలో పరిస్థితులు సద్దుమణుగుతాయని ఆశిస్తున్నాను” అని చెప్పి  వీడియోను ముగించారు.

Read More: Operation Ajay: భారతదేశానికి చేరుకున్న మొద‌టి విడ‌త భార‌తీయులు

హమాస్‌ మిలిటెంట్లు(Hamas militants) సృష్టించిన మారణకాండకు ప్రతిగా ఇజ్రాయెల్‌(Israel) సైన్యం గాజాపై విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు కేవలం వైమానిక దాడులు మాత్రమే జరిపిన ఇజ్రాయెల్‌ దళాలు.. ఇకపై గాజాలో అడుగుపెట్టడానికి (గ్రౌండ్‌ ఆపరేషన్‌) సిద్ధమవుతున్నాయి. అయితే, దీనిపై రాజకీయ నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లు సమాచారం. మరోవైపు తమ దళాలు గాజాలో క్షేత్రస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని.. దీనిపై నేతల నుంచి నిర్ణయం వెలువడిన వెంటనే రంగంలోకి దిగుతాయని ఇజ్రాయెల్‌ ఆర్మీ అధికారిక ప్రతినిధి రిచర్డ్‌ హెచ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.

హమాస్‌ గ్రూప్(Hamas group) ఉనికి భూమిపై లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇజ్రాయెల్‌ సైన్యం 3,60,000 రిజర్వు ఆర్మీని రంగంలోకి దింపింది. మరోవైపు హమాస్‌ మిలిటెంట్ల చేతిలో ఇజ్రాయెల్‌ వాసులు బందీలుగా ఉండటంతో గ్రౌండ్ ఆపరేషన్‌ విషయంలో ఇజ్రాయెల్ సైన్యం ఆచితూచి వ్యవహరిస్తోంది.

ఏంటీ గ్రౌండ్ ఆపరేషన్?

గాజాలో జనసాంద్రత అధికం. దీంతో ఇజ్రాయెల్‌ సైన్యానికి ఇక్కడి వీధుల్లో మిలిటెంట్ల వేట కత్తిమీద సాములాంటిది. కానీ, అర్బన్‌ వార్ఫేర్‌లో ఇజ్రాయెల్‌ సైన్యానికి అద్భుతమైన అనుభవం ఉంది. ఇందుకోసం వేల సంఖ్యలో ఇజ్రాయెల్‌ దళాలు గాజా(Gaza) నగరంలోకి ప్రవేశించి హమాస్‌ మిలిటెంట్లను ఏరివేస్తాయని అంచనా. గాజాలోని హమాస్‌కు ఆయుధాలు అందకుండా భూ,జల,వాయు మార్గాలను ఇజ్రాయెల్‌ మూసివేసింది. ఇప్పటికే గాజాకు నీరు, విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది. హమాస్‌ మిలిటెంట్లు ఉపయోగిస్తున్న కమ్యూనికేషన్ వ్యవస్థలను ధ్వంసం చేసింది.

గ్రౌండ్ ఆపరేషన్ మొదలైన తర్వాత ఇజ్రాయెల్‌ దళాలు గాజాలోని ప్రతి ఇంటికి వెళ్లి హమాస్‌ మిలిటెంట్లు( Hamas militants) వెతికి మరీ మట్టుబెడతాయి. అయితే, గాజాలోని సొరంగాల నెట్‌వర్క్‌లో నక్కిన వారిని బయటకు తీసుకొచ్చి అంతం చేయడం ఇజ్రాయెల్‌ ముందున్న అతి పెద్ద సవాల్‌. మరోవైపు ఇజ్రాయెల్‌( Hamas militants)తోపాటు ఇతర దేశాలకు చెందిన పౌరులు హమాస్‌ వద్ద బందీలుగా ఉండటంతో వారి ప్రాణాలకు హాని కలగకుండా.. మిలిటెంట్లను మట్టుబెట్టాల్సి రావడం ఇజ్రాయెల్‌ దళాలుకు ఆపరేషన్‌ను సంక్లిష్టంగా మార్చేశాయి. ఇజ్రాయెల్ అనుకున్న సమయం కంటే ఈ ఆపరేషన్‌ మరింత సుదీర్ఘ సమయం సాగే అవకాశం ఉందని అంతర్జాతీయ భద్రతా నిపుణులు అంచనావేస్తున్నారు.