సీనియర్ ISIS నాయకుడు ఖలీద్ అయద్ అహ్మద్ అల్-జబౌరీ హతం చేసిన యూఎస్

2015లో పారిస్ లో జరిగిన దాడితో సహా యూరప్ లో అనేక ఘోరమైన దాడులకు ప్రధాన కారకుడైన ఖలీద్ అయద్ అహ్మద్ అల్-జబౌరీ అమెరికా సైన్యాల చేతిలో హతమయ్యాడని ఆ ప్రభుత్వం ప్రకటించింది. 2015లో పారిస్‌లో జరిగిన దాడితో సహా యూరప్‌లో అనేక ఘోరమైన దాడులను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైన్యం దాడిలో ఐరోపాలో దాడులు చేసేందుకు ప్లాన్ చేసిన.. సీనియర్ ISIS నాయకుడు ఖలీద్ అయద్ అహ్మద్ అల్-జబౌరీ  హతమయ్యాడు. […]

Share:

2015లో పారిస్ లో జరిగిన దాడితో సహా యూరప్ లో అనేక ఘోరమైన దాడులకు ప్రధాన కారకుడైన ఖలీద్ అయద్ అహ్మద్ అల్-జబౌరీ అమెరికా సైన్యాల చేతిలో హతమయ్యాడని ఆ ప్రభుత్వం ప్రకటించింది.

2015లో పారిస్‌లో జరిగిన దాడితో సహా యూరప్‌లో అనేక ఘోరమైన దాడులను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైన్యం దాడిలో ఐరోపాలో దాడులు చేసేందుకు ప్లాన్ చేసిన.. సీనియర్ ISIS నాయకుడు ఖలీద్ అయద్ అహ్మద్ అల్-జబౌరీ  హతమయ్యాడు. అమెరికాలోని సిరియా లో ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్రూప్ సీనియర్ ISIS నాయకుడు ఖలీద్ అయద్ అహ్మద్ అల్-జబౌరీ పట్టుకునేందుకు అమెరికన్‌ పారామిలిటరీ దళాలు యత్నించాయి. ఈ క్రమంలో సైన్యం జరిపిన కాల్పుల్లో ఖలీద్ అయద్ అహ్మద్ అల్-జబౌరీ హతమయ్యారని యూఎస్ సైనికాధికారులు ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో తమ సైనికులెవరూ గాయపడలేదని వెల్లడించారు.. 

 ఖలీద్ అయద్ అహ్మద్ అల్-జబౌరీ హతం.. 

2015లో పారిస్ లో జరిగిన దాడితో సహా యూరప్‌లో అనేక ఘోరమైన దాడులను ఇతను చేసినట్లు ఐఎస్ పేర్కొంది అమెరికా బలగాలు సిరియాలో దాడులు నిర్వహించి సీనియర్ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ నాయకుడు ఖలీద్ అయాద్ అహ్మద్ అల్ జబౌరీని హతమార్చాయి.. ఐరోపాలో దాడులకు ప్రణాళికాబద్ధంగా రూపొందించిన ఇతనిని హతమార్చినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ CENTCOM మంగళవారం ఈ విషయాన్ని తెలిపింది. 

అయితే సిరియాలో ఎక్కడ ఈ దాడులు జరిగాయి అనే వివరాలను మాత్రం తెలుపలేదు. కానీ పౌరులు ఎవరు చనిపోలేదు. అలాగే ఎవరికీ గాయాలు జరగలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని అధికారులు తెలిపారు. 2019లో సిరియాలోని చివరి భూభాగం నుంచి తొలగించబడిన జిహాదీ సమూహం.. మధ్యప్రాచ్యం దాటి సమ్మె చేయాలని కోరికతో ఈ ప్రాంతంలో కార్యకర్తలను నిర్వహిస్తూ వచ్చింది అని CENTCOM చీఫ్ జనరల్ మైకేల్ కురిల్ల తెలిపారు. 

CENTCOM  ప్రకటన..

ఖలీద్ అయద్ అహ్మద్ అల్-జబౌరీ కూడా జిహాది ఐఎస్ కోసం నాయకత్వ నిర్మాణాన్ని అభివృద్ధి చేశాడు. అతని మరణం బాహ్య దాడులను పన్నాగం చేసే సంస్థ సామర్థ్యాన్ని తాత్కాలికంగా దెబ్బతీస్తుందని  CENTCOM ఈ ప్రకటనలో తెలిపింది. ఐఎస్ ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఐరోపాలో అనేక ఘోర దాడులు చేశాయని ప్రకటించింది. వీటికి 2017 నవంబర్‌లో పారిస్‌లో చేసిన దాడులే నిదర్శనమని తెలిపింది.. ఆ ప్రాంతాలలో చేసిన దాడులలో 130 మంది మరణించారని వివరించింది.

2016 జూలైలో ఫ్రెంచ్ నగరంలో నైస్‌లో 86 మంది మరణించారు. సుమారు 900 మంది అమెరికా సైనికులు సిరియాలో ఉన్నారు.  చాలా వరకు కుర్దీష్ పాలనలో ఉన్న ఈశాన్య ప్రాంతంలో అమెరికా నేతృత్వంలోని సిరియాతో పాటు పక్కన ఉన్న పొరుగు రాష్ట్రాలు, ఇరాక్‌తో పాటు మరికొన్ని ఎడారులలో, పర్వత ప్రాంతాలలో రహస్య స్థావరం ఏర్పరచుకొని ఐఎస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని.. వారితో ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందని అనునిత్యం వారితో పోరాడుతూ ఉండాలని CENTCOM ఈ నివేదికలో ప్రకటించారు.  అక్టోబర్ 2019లో వాయువ్య సిరియాలో జరిగిన ఆపరేషన్‌లో ఐఎస్ నాయకుడు ‘అబూబకర్ అల్ బాగా’ ని చంపినట్లు వాషింగ్టన్ ప్రభుత్వం ప్రకటించింది.