Russia: రష్యా సొంత సైనికుల‌ను చంపేస్తోందా?

రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine War) యుద్ధం అనేక రోజుల నుంచి కొనసాగుతోంది. యుద్ధానికి ఇరు దేశాలు ముగింపు పలకాలని అనేక దేశాలు కోరుకుంటున్నా కానీ అది జరగడం లేదు. యుద్ధం నేపథ్యంలో రష్యా (Russia) మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయినా కానీ రష్యా (Russia)  ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎలాగైనా సరే ఉక్రెయిన్ (Ukraine) మీద పై చేయి సాధించాలని రష్యా (Russia)  భావిస్తోంది. కానీ ఉక్రెయిన్ (Ukraine) మాత్రం రష్యాకు (Russia)  ధీటుగా […]

Share:

రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine War) యుద్ధం అనేక రోజుల నుంచి కొనసాగుతోంది. యుద్ధానికి ఇరు దేశాలు ముగింపు పలకాలని అనేక దేశాలు కోరుకుంటున్నా కానీ అది జరగడం లేదు. యుద్ధం నేపథ్యంలో రష్యా (Russia) మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయినా కానీ రష్యా (Russia)  ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎలాగైనా సరే ఉక్రెయిన్ (Ukraine) మీద పై చేయి సాధించాలని రష్యా (Russia)  భావిస్తోంది. కానీ ఉక్రెయిన్ (Ukraine) మాత్రం రష్యాకు (Russia)  ధీటుగా సమాధానం చెబుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది సైనికులు చనిపోతున్నారు. కేవలం రష్యా (Russia)  వారు కేవలం ఉక్రెయిన్ కు చెందిన వారు అని కాకుండా ఇరు దేశాల సైనికులు మరణిస్తున్నారు. అయినా కానీ ఈ రెండు దేశాలు మాత్రం యుద్ధాన్ని ఆపడం లేదు. ఎంత వరకైనా వెళ్తామనే విధంగా ఈ రెండు దేశాల ధోరణి కనబడుతోంది. 

అనేక దేశాలు ఆంక్షలు విధించినా కానీ.. 

ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యా (Russia)  మీద అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ఆ దేశంతో సంబంధాలను తెగ దెంపులు చేసుకున్నాయి. అయినా కానీ రష్యా (Russia)  ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. అలాగే యుద్ధాన్ని కంటిన్యూ చేస్తోంది. ఇక ఉక్రెయిన్ (Ukraine) కూడా ఏ మాత్రం తగ్గకుండా దాడులు చేస్తోంది. ఈ దాడులతో రెండు దేశాల్లో ఉన్న అనేక మంది ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. అయినా కానీ ఈ యుద్ధం గురించి ఎటువంటి ప్రకటనా రాలేదు. యుద్ధాన్ని ఆపుతామని ఏ దేశం కూడా ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు. 

రష్యా మీద సంచలన ఆరోపణలు చేసిన అమెరికా

ఈ నేపథ్యంలోనే అమెరికా (America) రష్యా (Russia)  మీద సంచలన ఆరోపణలు చేసింది. ఆదేశాలను పాటించడంలో విఫలమైన తన సొంత సైనికులను రష్యా (Russia)  ఉరితీస్తోందని వైట్ హౌస్ గురువారం పేర్కొంది. ఉక్రెయిన్ ఫిరంగి కాల్పుల నుంచి వెనక్కి తగ్గితే మొత్తం యూనిట్లను చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు వైట్ హౌస్ (WhiteHouse) జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. అమెరికా (America) జాతీయ భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గత 20 రోజుల నుంచి ఈ చర్యలు జరుగుతున్నాయని ఆరోపించింది.  ఈ పరిణామాలు రష్యా సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని వెల్లడింది. ఇలా సొంత దేశానికి చెందిన సైనికులను ఉరితీయడం అనాగరికమైన చర్య అని వైట్ హౌస్ (WhiteHouse) అభివర్ణించింది. ఈ చర్యలు రష్యా సైనిక నాయకుల పేలవమైన పనితీరును మరియు సైనిక దృక్పథం నుంచి పరిస్థితిని తప్పుగా నిర్వహించడాన్ని సూచిస్తాయని వైట్ హౌస్ ఆరోపించింది. ఇలా ఉక్రెయిన్ సైనికులను చంపడంలో లేదా తమ ఆదేశాలను పాటించని వారిని ఎంత మందిని ఉరి తీశారనే విషయం గురించి వైట్ హౌస్ లెక్క చెప్పలేదు. రష్యా (Russia)  ముఖ్యంగా డాన్‌బాస్ మరియు డొనెట్స్క్ ప్రాంతాలలో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని భావిస్తుంది. కానీ ఆ ప్రాంతాల్లో పట్టు సాధించడం రష్యాకు తలకు మించిన భారంగా పరిణమించింది. 

ఉక్రెయిన్ కు సాయం చేస్తున్న అమెరికా

అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే అనేక విడతలుగా ఉక్రెయిన్ (Ukraine) కు సాయం అందించింది. అటు సైనిక సాయంతో పాటు ఆర్థిక సాయం కూడా చేస్తూ వస్తోంది. ఇలా అమెరికా అండతోనే ఉక్రెయిన్ (Ukraine) రెచ్చిపోతుందని రష్యా (Russia)  ఆరోపిస్తుంది. అయినా కానీ అమెరికా మాత్రం ఉక్రెయిన్ కు సాయం చేయడం ఆపడం లేదు. తనకు తోచిన విధంగా సాయం చేస్తూనే ఉంది. ఈ సాయంతోనే ఉక్రెయిన్ రష్యా మీద సమర్థవంతంగా పోరాడుతోంది. ఇలా అమెరికా రష్యా మీద ఆరోపణలు చేసిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా స్పందించారు. అవును రష్యా ఇలానే చేస్తుందని వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఆక్రమణదారులు అవడివ్కాను చుట్టుముట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారని, కానీ ప్రతిసారీ మా సైనికులు వారిని ఆపివేసి, వారిని వెనక్కి పంపారని  ఆయన వెల్లడించారు. వైట్ ఇంత ఆరోపణలు చేసినా కానీ రష్యా మాత్రం ఈ ఆరోపణల మీద స్పందించలేదు. సొంత సైనికులనే చంపుతున్నారన్న అభియోగాలు నమోదయినా కానీ రష్యా (Russia)  ఎందుకు స్పందించడం లేదని పలువురు ఆశ్చర్యపోతున్నారు.