ఇరాక్‌ పెళ్లి వేడుకలో ఘోర అగ్ని ప్రమాదం..

ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుక జరగుతున్న పంక్షన్ హాల్‌లో ఈ ప్రమాదం జరిగింది. వేడుక జరుగుతున్న సమయంలోనే మంటలు చేలరేగి 100 మందికి పైగా మృతి చెందారు. మరో 150 మందికిపైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో కొత్త జంట కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర ఇరాక్‌ నెనెవెహ్‌ ప్రావిన్స్‌ అల్‌హమ్‌దానియా జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెనెవెహ్‌ డిప్యూటీ గవర్నర్ […]

Share:

ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుక జరగుతున్న పంక్షన్ హాల్‌లో ఈ ప్రమాదం జరిగింది. వేడుక జరుగుతున్న సమయంలోనే మంటలు చేలరేగి 100 మందికి పైగా మృతి చెందారు. మరో 150 మందికిపైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో కొత్త జంట కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఉత్తర ఇరాక్‌ నెనెవెహ్‌ ప్రావిన్స్‌ అల్‌హమ్‌దానియా జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెనెవెహ్‌ డిప్యూటీ గవర్నర్ హసన్ అల్-అల్లాక్ తెలిపిన వివరాల ప్రకారం.. వేడుకలో 1000 మందికి పైగా పాల్గొన్నారు. అయితే మంగళవారం రాత్రి 10.45 (స్థానిక కాలమానం ప్రకారం) గంటల సమయంలో ఫంక్షన్ హాల్‌లో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. వేగంగా మంటలు వ్యాపించి 113 మంది చనిపోయారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.  వారందరినీ స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనతో ఆ ప్రాంతమంతా భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ప్రమాదంలో వధూవరులు తీవ్రంగా గాయపడినా వారి ప్రాణాలకు ప్రమాదం లేదని స్థానిక మీడియా వెల్లడించింది. పెళ్లి వేడుకలు అంబరాన్నంటుతున్న సమయంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న అతిథులు ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో హాహాకారాలు చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పెళ్లి వేడుకలు జరిగే మండపం అంతా ప్లాస్టిక్‌తో డెకరేషన్‌ చేశారు. వధూవరులు డ్యాన్స్‌ చేస్తుండగా హాలులోనే బాణాసంచా కాల్చారు. అవి నేరుగా రూఫ్‌కి తాకాయి. సీలింగ్‌కి మంటలు అంటుకోవడంతో అవి విస్తృతంగా వ్యాపించాయి. ఆ ఫంక్షన్‌ హాలుని శాండ్‌విచ్‌ ప్యానెల్స్, వినిల్‌ షీట్స్, ఫ్యాబ్రిక్‌తో నిర్మించడంతో మంటలు ఎగసి పడ్డాయి. దీంతో పై నుంచి డెకరేషన్‌ సామాగ్రి కింద పడి ఎవరూ కదలడానికి వీల్లేకుండా పోయింది.

అయితే పెళ్లి వేడుకలో బాణసంచా కాల్చటమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బాణసంచా పేల్చటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పంక్షన్ హాల్‌లో సామాగ్రికి వేగంగా మంటలు అంటుకోవటంతో వేడుకలో పాల్గొన్నవారు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం సమాచారం అందగానే వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అక్కడికి అంబులెన్స్‌లు పంపించి క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే వియత్నాం రాజధాని హనోయ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఓ ఫ్లాట్‌లో నుంచి ఓ చిన్నారి అరుపులు గట్టిగా వినిపించాయని స్థానికులు చెప్పారు. వెంటనే ఆ చిన్నారిని ఎవరో పై నుంచి కిందకు తోసేశారని తెలిపారు. పది అంతస్థుల ఈ బిల్డింగ్‌లో పార్కింగ్ ఫ్లోర్‌లో మంటలు మొదలయ్యాయి. అక్కడే పార్క్ చేసి ఉన్న బైక్‌లు, కార్‌లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎంత మంది మృతి చెందారన్నది అధికారికంగా వెల్లడించలేదు. 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆంబులెన్స్‌లు పెద్ద ఎత్తున తరలి వచ్చి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. 70 మందిని రక్షించారు. ఘటన తీవ్రత అనూహ్యంగా పెరిగిందని, అనుకున్న దాని కన్నా మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ టీమ్‌లు వెంటనే అప్రమత్తమై బిల్డింగ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. కానీ…మంటలు తీవ్రతరం కావడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కి ఆటంకం కలిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.