Iran: టాప్ ఇరాన్ ద‌ర్శ‌కుడు, భార్య దారుణ హ‌త్య‌

చాలా హత్య (Murder)లు కారణాలు లేకుండా మిస్టరీగా మిగిలిపోతున్న ఏదో ఒక రోజు నిజం బయట పడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా వస్తుంది. అయితే ఇటీవల ఇరాన్ (Iran) లో జరిగిన డైరెక్టర్ (Director) దంపతుల హత్య (Murder) మరో మిస్టరీగా మారనుందా అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం సాయంత్రం కూతురు డిన్నర్ కి ఇంటికి వచ్చేసరికి ఇరాన్ (Iran) డైరెక్టర్ (Director) దంపతులు విగత జీవులుగా పడి ఉన్నారు.  ఇరాన్ డైరెక్టర్ […]

Share:

చాలా హత్య (Murder)లు కారణాలు లేకుండా మిస్టరీగా మిగిలిపోతున్న ఏదో ఒక రోజు నిజం బయట పడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా వస్తుంది. అయితే ఇటీవల ఇరాన్ (Iran) లో జరిగిన డైరెక్టర్ (Director) దంపతుల హత్య (Murder) మరో మిస్టరీగా మారనుందా అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం సాయంత్రం కూతురు డిన్నర్ కి ఇంటికి వచ్చేసరికి ఇరాన్ (Iran) డైరెక్టర్ (Director) దంపతులు విగత జీవులుగా పడి ఉన్నారు. 

ఇరాన్ డైరెక్టర్ దంపతులు హత్య: 

సినీ నిర్మాత దంపతులు, దరియుష్ మెహర్జుయ్(Dariush Mehrjui) మరియు అతని భార్య వహిదే మహమ్మదీఫర్ ఇద్దరినీ కూడా గుర్తు తెలియని వాళ్ళు గొంతు కోయడం వల్ల మరణించారని నిర్ధారించారు. అయితే హత్య (Murder) జరగడానికి గంటన్నర ముందు దంపతులిద్దరూ తన కూతురు మోనాని ఇంటికి డిన్నర్ కి ఆహ్వానించారు. సుమారు గంటన్నర తర్వాత కూతురు మోనా తన తల్లితండ్రుల ఉంటున్న ఇంటికి వచ్చేసరికి, తన తల్లిదండ్రులు విగత జీవులుగా కనిపించారు. ఈ హత్య (Murder)కు సంబంధించి మోనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అయితే ఇంట్లోకి బలవంతంగా చొరబడడం వంటివి, తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చిన ఆనవాళ్లు ఏవి కనిపించలేదని, అంతేకాకుండా తమ ఇంట్లో ఎటువంటి వస్తువులు పోయిన కంప్లైంట్స్ కూడా లేవని, కానీ కొన్ని గుర్తులు చూస్తే ఇది కచ్చితంగా హత్య (Murder) అని నిర్ధారించారు పోలీసు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇరాన్ డైరెక్టర్ దంపతులు: 

డిసెంబర్ 8, 1939న టెహ్రాన్‌లో జన్మించిన దరియుష్ మెహర్‌జుయ్(Dariush Mehrjui) ఇరాన్ (Iran)‌కు తిరిగి రాకముందే యునైటెడ్ స్టేట్స్‌(US)లో ఫిలాసఫీ విద్య పూర్తి చేశాడు. అక్కడ అతను ఒక సాహిత్య పత్రికను ప్రారంభించాడు. జేమ్స్ బాండ్ సిరీస్‌కి అతి దగ్గరగా ఉండే చిత్రాన్ని(Cinema) నిర్మించాడు అది “డైమండ్ 33” 1967లో విడుదల చేశాడు. అంతే కాకుండా, మొహమ్మద్-మెహ్దీ ఎస్మాయిలీ, దరియుష్ మెహర్జుయ్‌ను ..ఇరానియన్ సినిమా(Cinema) మార్గదర్శకులలో ఒకరు అని కొనియాడారు ఇరాన్ (Iran) సంస్కృతి మంత్రి.

83 ఏళ్ల దరియుష్ మెహర్‌జుయ్(Dariush Mehrjui) ఎన్నో అద్భుతమైన చిత్రాల(Cinema)ను తెరకెక్కించాడు, అతని 1969 చిత్రం(Cinema)  “ది కౌ” ఉద్యమానికి సంబంధించిన సినిమా(Cinema)లలో ఒకటి. అతను 1979 ఇస్లామిక్ విప్లవం నేపథ్యంలో “మిస్టర్ గుల్లిబుల్” (1970), “ది సైకిల్” (1977) వంటి మంచి గుర్తింపు పొందిన చిత్రాల(Cinema)కు దర్శకత్వం వహించాడు. 1980 మరియు 1985 మధ్య, అతను ఫ్రాన్స్‌లో నివసించాడు, అక్కడ అతను “జర్నీ టు ది ల్యాండ్ ఆఫ్ రింబాడ్” (1983) అనే డాక్యుమెంటరీలో పనిచేశాడు. తన స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, అతను “ది టెనెంట్స్” (1987)తో బాక్సాఫీసు వద్ద విజయం సాధించాడు.
1990లో, అతను సోనీ (Sony), తోషిబా (Toshiba) అనే టెక్నాలజీ కంపెనీలో పని చేస్తూ ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని.. ఆ వ్యక్తి మానసిక ఆందోళనలతో బాధపడుతున్న మేధావి అంటూ.. ఆ వ్యక్తి జీవితంలో 24 గంటలు కనిపించే డార్క్ కామెడీ “హమౌన్”కి దర్శకత్వం వహించాడు. 1990వ దశకంలో, దరియుష్ మెహర్‌జుయ్, “సారా” (1993), “పరి” (1995) మరియు “లీలా” (1997)లో స్త్రీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా మంచి చిత్రాలను నిర్మించాడు. ఇరాన్ (Iran) మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో, స్వీడిష్ చిత్రనిర్మాత ఇంగ్మార్ బెర్గ్‌మాన్ మరియు ఇటాలియన్ మైఖేలాంజెలో ఆంటోనియోని తనను తనను చాలా బాగా ప్రభావితం చేసారని డారియుష్ మెహర్‌జుయ్(Dariush Mehrjui) చెప్పారు. తన సినీ కెరీర్‌తో పాటు, అతను ఫ్రెంచ్ నాటక రచయిత యూజీన్ ఐయోనెస్కో మరియు జర్మన్ మార్క్సిస్ట్ తత్వవేత్త హెర్బర్ట్ మార్క్యూస్ రచనలను పర్షియన్ భాషలోకి అనువాదం కూడా చేసేవాడు.