Iran : గాజా మారణహోమాన్ని ఆపాలని భారత్​కు ఇరాన్ వినతి

Iran : గాజాలోని హమాస్(Hamas) స్థావరాలే లక్ష్యంగా చేస్తోన్న దాడులను ఇజ్రాయెల్(Israel) సైన్యం మరింత తీవ్రతరం చేసింది. సోమవారం ఉదయం గాజా సిటీ(Gaza City)ని ముట్టడించాయి. ఉత్తర గాజాతో మిగిలిన ప్రాంతానికి సంబంధాలను తెంచేశాయి. హమాస్‌ మిలిటెంట్లు అధికంగా ఉండే ఈ ప్రాంతంపై పూర్తి స్థాయి భూతల దాడికి ఇజ్రాయేల్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరింత రక్తపాతం జరుగుతుందని అంతర్జాతీయ సమాాజం కలవరానికి గురవుతోంది. ఇదే సమయంలో ఇరాన్(Iran) అధ్యక్షుడు  ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi ) […]

Share:

Iran : గాజాలోని హమాస్(Hamas) స్థావరాలే లక్ష్యంగా చేస్తోన్న దాడులను ఇజ్రాయెల్(Israel) సైన్యం మరింత తీవ్రతరం చేసింది. సోమవారం ఉదయం గాజా సిటీ(Gaza City)ని ముట్టడించాయి. ఉత్తర గాజాతో మిగిలిన ప్రాంతానికి సంబంధాలను తెంచేశాయి. హమాస్‌ మిలిటెంట్లు అధికంగా ఉండే ఈ ప్రాంతంపై పూర్తి స్థాయి భూతల దాడికి ఇజ్రాయేల్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరింత రక్తపాతం జరుగుతుందని అంతర్జాతీయ సమాాజం కలవరానికి గురవుతోంది. ఇదే సమయంలో ఇరాన్(Iran) అధ్యక్షుడు  ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi ) మోదీ(PM Modi)కి ఫోన్ చేశారు.

భారత్(India) తన పలుకుబడిని ఉయోగించి గాజాలో ఇజ్రాయెల్(Israel) రక్తపాతాన్ని నివారించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi ) కోరారు. సోమవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన రైసీ.. పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ చర్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ప్రధాని మోదీ, రౌసీ సంభాషణల వివరాలను ఇరాన్(Iran) అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్ రీడౌట్ ప్రకారం.. పాశ్చాత్య వలసవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసిన పోరాటాలను, ప్రపంచంలోని అలీనోద్యమ వ్యవస్థాపక దేశంగా చేసిన ప్రయత్నాలను మోదీతో సంభాషణల్లో రైసీ గుర్తుచేసుకున్నారు.

‘ఈ రోజు గాజాలోని అణగారిన ప్రజలపై జియోనిస్ట్ నేరాలను అంతం చేయడానికి భారత్ తన అన్ని సామర్థ్యాలను ఉపయోగిస్తుందని భావిస్తున్నాం’ అని చెప్పినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. తక్షణ కాల్పుల విరమణ, దిగ్బంధనం ముగించి గాజా(Gaza)లోని అణగారిన ప్రజలకు సహాయాన్ని అందించడానికి ప్రపంచం చేసే ఏ ఉమ్మడి ప్రయత్నానికైనా తమ మద్దతు ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

‘పాలస్తీనా ప్రజలపై జరుగుతోన్న మారణకాండ ప్రపంచంలోని అన్ని స్వేచ్ఛా దేశాలకు కోపం తెప్పించింది.. ఈ హత్యలు అదనపు ప్రాంతీయ పరిణామాలకు దారితీస్తాయి’ అని రౌసీ అన్నారు. అణగారిన, అమాయక మహిళలు, పిల్లలను చంపడం, ఆస్పత్రులు, పాఠశాలలు, మసీదులు, చర్చిలు, నివాసన సముదాయాలపై దాడులను ఖండించదగినవి, ఆమోదయోగ్యం కానివి అని ఆయన అన్నారు.

Also Read: Israel: ప్రియుడి శవం కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్న యువ‌తి

ఇదిలా ఉండగా.. భారతదేశంతో ఇరాన్(Iran) సంబంధాలను ‘వ్యూహాత్మక’ దృక్పథంగా రైసీ అభివర్ణించారు. సహకార అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా జాప్యాన్ని నివారించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఉత్తర-దక్షిణ కారిడార్ ప్రాముఖ్యతను, ఈ ప్రాంతంలోని అన్ని దేశాలకు దాని ప్రయోజనాలను వివరించిన ఇరాన్ అధ్యక్షుడు.. చాబహార్ పోర్ట్‌(Chabahar Port)తో సహా స్థిరమైన ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్ మరింత దృష్టి సారిస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇజ్రాయెల్(Israel) హమాస్(Hamas) యుద్ధం తీవ్రతరం కాకుండా నిరోధించడం, మానవతా సహాయాన్ని నిరంతరం అందించడం, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించే ప్రాముఖ్యతను ఈ సందర్భంగా రైసీకి ప్రధాని నొక్కి చెప్పారు. చాబహర్ పోర్ట్ సహా ఇరాన్-భారత్ ద్వైపాక్షిక సహకార పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు.

గాజాపై దాడుల వెనుక అమెరికా: ఇరాన్‌

పాలస్తీనా (Palestine)లోని గాజా ప్రాంతంలో ప్రజలపై దాడులకు ఇజ్రాయెల్‌(Israel)ను అమెరికా ప్రోత్సహిస్తోందని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ఆరోపించారు. గాజాపై బాంబు దాడులను తక్షణమే ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరాక్‌ ప్రధాని మహ్మద్‌ షియా అల్‌ సుదానీ(Mohammed Shia Al Sudani)తో భేటీ అనంతరం ఇరువురు నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా అమెరికా(America), ఇజ్రాయెల్‌(Israel)పై ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) తీవ్ర విమర్శలు చేశారు.

‘‘పాలస్తీనా ప్రజలపై క్రూరమైన దాడులను ప్రోత్సహిస్తూ ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం చేస్తోంది. వీలైనంత త్వరగా గాజాలో బాంబు దాడులు ఆగుతాయని మేం నమ్ముతున్నాం. వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి, గాజా(Gaza)లోని ప్రజలకు తక్షణ సాయం అందజేయాలి. అమెరికా, యూరోపియన్‌ దేశాల మద్దతుతో మానవత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన నేరాలకు పాల్పడుతూ.. ఇజ్రాయెల్‌ మారణహోమం సృష్టిస్తోంది’’ అని ఇబ్రహీం రైసీ ఆరోపించారు.

కొద్దిరోజుల క్రితం గాజాలో దాడులు చేస్తోన్న ఇజ్రాయెల్‌ను ఒంటరి చేయాలని ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్ (OIC) దేశాలను ఇరాన్‌ కోరింది. అంతకుముందు పశ్చిమాసియా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌(Antony Blinken), ఇరాక్‌ ప్రధానితో బాగ్దాద్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరాక్‌, సిరియాలోని అమెరికా దళాలపై జరిగినవి ఇరాక్‌ ప్రేరేపిత దాడులని బ్లింకెన్‌ ఆరోపించారు. బ్లింకెన్‌తో భేటీ అనంతరం ఇరాక్‌ ప్రధాని, ఇరాన్‌ అధ్యక్షుడితో సమావేశమై గాజాలోని పరిస్థితిపై చర్చించారు.