బిలియనీర్ భార్య వారానికి $2 మిలియన్లలకు పైగా ఖర్చు చేస్తోందట

శ్రీమంతుడైన భర్తను పొందాలని అమ్మాయిలు అనుకుంటారు. ఎందుకంటే..’ధనం మూలం ఇదం జగత్‌’. అంటారు కదా ప్రపంచమంతా డబ్బుతో నడుస్తుంది. డబ్బులుంటే చాలు ఏదైనా చేయొచ్చు. విలాసవంతమైన సౌకర్యాలతో బతకొచ్చు. ఖరీదైన నగలు వేసుకొవచ్చు. విలువైన బట్టలు.. ఇలా ఇతరులు కొనలేని ఎన్నో వస్తువులను ధనవంతుడైన భర్త ఉంటే తెచ్చిపెడతాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లిండా ఆండ్రేడ్ వార్తల్లో నిలిచింది. దుబాయ్ నివాసి అయిన 24 ఏళ్ల లిండా… బిలియనీర్ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. పెళ్లయిన […]

Share:

శ్రీమంతుడైన భర్తను పొందాలని అమ్మాయిలు అనుకుంటారు. ఎందుకంటే..’ధనం మూలం ఇదం జగత్‌’. అంటారు కదా ప్రపంచమంతా డబ్బుతో నడుస్తుంది. డబ్బులుంటే చాలు ఏదైనా చేయొచ్చు. విలాసవంతమైన సౌకర్యాలతో బతకొచ్చు. ఖరీదైన నగలు వేసుకొవచ్చు. విలువైన బట్టలు.. ఇలా ఇతరులు కొనలేని ఎన్నో వస్తువులను ధనవంతుడైన భర్త ఉంటే తెచ్చిపెడతాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లిండా ఆండ్రేడ్ వార్తల్లో నిలిచింది.

దుబాయ్ నివాసి అయిన 24 ఏళ్ల లిండా… బిలియనీర్ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. పెళ్లయిన నాటి నుంచి భర్త సంపదను నీళ్లలా ఖర్చు చేస్తోంది. ఆమె తన విలాసవంతమైన జీవితాన్ని సోషల్ మీడియాలో ప్రజలతో పంచుకుంటోంది. కేవలం ఒక వారంలో షాపింగ్ కోసం $2 మిలియన్లకు పైగా ఖర్చు చేసినట్లు ఆమె వెల్లడించింది.. లిండా ఆండ్రేడ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. టిక్‌టాక్‌లో 7 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

ఆమె తరచూ తన సంపదనూ, లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను చూపిస్తూ ఉండటం వల్ల ప్రజలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. లిండా ఈ విమర్శలను పట్టించుకోకుండా.. నిరంతరం పోస్టులు చేస్తూనే ఉంది.  తాజా వీడియో పోస్ట్‌లో లిండా, ఒక్కొక్కటి $7000 (రూ.5.8 లక్షలు) విలువైన రెండు చానెల్ బ్యాగ్‌లను కొన్నట్లు చెప్పింది. ఆమె దగ్గర్లోని మాల్‌కు నడిచి వెళ్లడం ఇష్టం లేక, ఒక కారును అద్దెకు తీసుకుని దాని కోసం $16,540 (13.7 లక్షలు) ఖర్చు చేసింది. 

లిండా ఆండ్రేడ్ ఇదివరకు వీడియోలలో తాను రోజూ ఎంత ఖర్చు చేస్తుందో ఎప్పుడూ చెప్పలేదు. బదులుగా ఆమె తాను కొనే వస్తువులను ప్రదర్శించేది. తాజాగా ఆ వివరాలూ చెప్పింది. పెళ్లికి ముందు తన భర్త నుంచి ఏయే బహుమతులు అడిగిందీ ఆమె ఓ వీడియోలో చెప్పింది. ఆ వీడియోలో ప్రతి నెలా ఆస్తి, వజ్రాలు కోరినట్లు చెప్పడంతో దానిపై పెద్ద చర్చే జరిగింది.  నెట్టింట ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. వ్యూయర్స్ విభిన్న స్పందనలతో కామెంట్స్‌ బాక్స్ నిండిపోయింది.

లిండా యావరేజ్‌గా వారానికి $2 మినియన్ల దాకా ఖర్చు చేస్తోంది. ఆమె ఏం చేసినా దాని వెనక భారీగా ఖర్చు ఉంటోంది. భర్త బిలియనీర్ అయినంత మాత్రాన ఇంతలా ఖర్చు చెయ్యాలా అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. లిండా తనకు వచ్చే కామెంట్లను పెద్దగా చదవదు. ప్రజలు కొన్నిసార్లు ద్వేషపూరిత వ్యాఖ్యలను కామెంట్లలో రాస్తుంటారు. వాటిని ఆమె పట్టించుకోవట్లేదు. కానీ ఆమె తరచూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. 

లిండా తన సంపదను చూపిస్తూ, ఇతరుల ఆర్థిక పరిస్థితిని ఎగతాళి చేస్తోందని కొందరు అంటున్నారు. “నా ఇంట్లో లైటింగ్ కోసం నా దగ్గర డబ్బు లేదు, ఈ మహిళ మాత్రం ఏ అవసరమూ లేకపోయినా రెండు చేతులా డబ్బును వృధా చేస్తుంది” అని ఒక యూజర్ ఆమె పోస్ట్‌పై కామెంట్ ఇచ్చారు. మనీని ఇలా వేస్ట్ చేసే బదులు, పేదలకు దానం చెయ్యవచ్చు కదా అని చాలా మంది నెటిజన్లు ఆమెను కోరుతున్నారు. అలాగే మనం మన జీవితాలను రీప్లేస్ చేసుకుందామా?’ అంటూ మరో ఓ వ్యూయర్ కామెంట్ పెట్టాడు. కానీ ఆమె మాత్రం ఎవరికీ దానధర్మాలు చెయ్యట్లేదు. అందుకే ఆమె తీరుపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.   మహిళకు కొందరు వ్యూయర్స్ సపోర్టు కూడా చేశారు. ఆమె వ్యక్తిగత జీవితంపై మనం కామెంట్ చేయకూడదు అని కామెంట్ పెట్టారు.