మ‌తం మార్చుకున్న అంజు.. గిఫ్ట్ ఇచ్చిన పాక్ వ్యాపార‌వేత్త‌

రాజస్థాన్ లో నివాసం ఉంటున్న ఒక గృహిణి, తన భర్తకి జైపూర్ కి వెళ్తున్న అని చెప్పి, ఏకంగా భారతదేశం దాటి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. సోషల్ మీడియా ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన తన ప్రియుడిని కలిసేందుకు వెళ్ళింది అని తర్వాత తెలిసింది. అయితే ప్రస్తుతం, పాకిస్తాన్ వెళ్లిపోయిన అంజు, ఫాతిమాగా ఇస్లాం మతాన్ని స్వీకరించింది. అయితే పాకిస్తాన్ లో ఒక ప్రముఖ వ్యాపారవేత్త, అంజు మతాన్ని మార్చుకున్నందుకు అభినందిస్తూ, ఆమెకు తన ప్రియుడు నసరులకు, పాకిస్తాన్ […]

Share:

రాజస్థాన్ లో నివాసం ఉంటున్న ఒక గృహిణి, తన భర్తకి జైపూర్ కి వెళ్తున్న అని చెప్పి, ఏకంగా భారతదేశం దాటి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. సోషల్ మీడియా ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన తన ప్రియుడిని కలిసేందుకు వెళ్ళింది అని తర్వాత తెలిసింది. అయితే ప్రస్తుతం, పాకిస్తాన్ వెళ్లిపోయిన అంజు, ఫాతిమాగా ఇస్లాం మతాన్ని స్వీకరించింది. అయితే పాకిస్తాన్ లో ఒక ప్రముఖ వ్యాపారవేత్త, అంజు మతాన్ని మార్చుకున్నందుకు అభినందిస్తూ, ఆమెకు తన ప్రియుడు నసరులకు, పాకిస్తాన్ లో కొంత భూమిని గిఫ్ట్ గా ఇచ్చాడు. అంతేకాకుండా 50వేల రూపాయలు నగదు, ఇంకా కొన్ని బహుమతులు అందజేశాడు.

అసలు విషయం: 

34 ఏళ్ల అంజు అనే గృహిణి, జైపూర్ వెళ్తున్న అని తన భర్తకు చెప్పి, 29 సంవత్సరాల నస్రుల్లా అనే వ్యక్తిని కలవడానికి పాకిస్తాన్ బోర్డర్ దాటింది. అయితే ఆమె పాకిస్తాన్లో అడుగుపెట్టిన అనంతరం పాకిస్తాన్ పోలీస్ కస్టడీలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తనకి లీగల్ గా పాస్పోర్ట్ కూడా ఉండడం వల్ల అక్కడ పాకిస్తాన్ పోలీసులు ఆమెను విడిచిపెట్టారు.  అంజు కలవడానికి వెళ్ళిన తన ప్రియుడు నస్రుల్లా వైద్య రంగంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇద్దరూ కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ఫేస్ బుక్ ఫ్లాట్ ఫామ్ ద్వారా పరిచయం అయినట్లు పోలీసులు వెల్లడించారు. 

అంజు వాళ్ళ తండ్రి గయా ప్రసాద్ థామస్, అంజు గురించి మాట్లాడుతూ, తనకి పాకిస్తాన్ వెళ్ళిన విషయం ఆలస్యంగా తెలిసిందని, అంజు వాళ్ళ తమ్ముడు చెప్పిన తర్వాతే, అంజు పాకిస్తాన్ వెళ్లినట్లు తెలిసింది అని పేర్కొన్నాడు. అయితే అంజూని మూడేళ్ల వయసున్నప్పుడు నుంచి, అంజి వాళ్ళ అంకుల్ తనని పెద్ద చేసినట్లు చెప్పాడు. అయితే పెళ్లయిన తర్వాత, ఆమె తన భర్తతో రాజస్థాన్ వెళ్ళిపోయిన తరువాత 20 సంవత్సరాలుగా ఆమెతో మాట్లాడలేదు అని కూడా చెప్పాడు. కాకపోతే, ఆమె కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టు, ఆమె ప్రవర్తన అతనికి కూడా అప్పుడప్పుడు సరిగా లేనట్లు గమనించినట్లు చెప్పాడు. అయితే అంజూని తన భర్త చాలా బాగా చూసుకుంటాడని అంతేకాకుండా అంజు భర్త చాలా నెమ్మదస్తుడు అని చెప్పుకొచ్చాడు. కేవలం తన ప్రవర్తన అప్పుడప్పుడు బాగోకపోవుండొచ్చు కానీ, తాను పెద్ద తప్పు చేసే అమ్మాయి కాదు అని తెగేసి చెప్పాడు. అయితే అంజు ఇంటర్ వరకు చదువుకున్నట్లు ఆ తర్వాత ఒక ఉద్యోగం కూడా చేసినట్లు చెప్పాడు.

తన భర్త, అదే విధంగా అంజు కుటుంబ సభ్యులు కూడా ముందు అంజు గురించి నమ్మకంతో ఉన్నప్పటికీ, అంజు తన ప్రియుడైన నసురాల్లాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన అనంతరం. అంజు ఇంకా తమ కుటుంబంలో సభ్యురాలు కాదని తేల్చి చెప్పారు అంజు కుటుంబ సభ్యులు. అంతేకాకుండా అంజు భర్త అరవింద్ కుమార్ మాట్లాడుతూ, అంజుకి తనకు విడాకులు కాలేదు కాబట్టి, ఎలా వివాహం చేసుకుంటుంది అని ప్రశ్నించాడు. అయితే ఇందులో ప్రభుత్వం కూడా కల్పించుకుని సహాయం చేయాలని, ఇన్వెస్టిగేషన్ జరిపించాలని కోరాడు. 

పాకిస్తాన్ లో పెళ్లి చేసుకోబోతున్న అంజు: 

భారతదేశంలో తమ కుటుంబ సభ్యులు ఎంతగా వాపోతున్నప్పటికీ, అంజు తన రెండో పెళ్లికి సిద్ధం అయిపోయింది. అయితే కొత్తజంటగా మారెందుకు భారతదేశం నుంచి పాకిస్తాన్లోకి అడుగుపెట్టిన అంజు అక్కడ సంతోషంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం, పాకిస్తాన్ వెళ్లిపోయిన అంజు, ఫాతిమాగా ఇస్లాం మతాన్ని స్వీకరించింది. అంతే కాకుండా, పాకిస్తాన్ లో ఒక ప్రముఖ వ్యాపారవేత్త, అంజు మతాన్ని మార్చుకున్నందుకు అభినందిస్తూ, ఆమెకు తన ప్రియుడు నసరుల్లాకు, పాకిస్తాన్ లో కొంత భూమిని గిఫ్ట్ గా ఇచ్చాడు. అంతేకాకుండా 50వేల రూపాయలు నగదు, ఇంకా కొన్ని బహుమతులు అందజేశాడు. అంతేకాకుండా, పాకిస్తాన్ కి వచ్చిన బయట దేశం వాళ్లు, పాకిస్తాన్ ని తమ సొంత దేశంగా భావించాలని, వారు ఎటువంటి కష్ట పడకూడదని అందుకే వారికి తమ ప్రాజెక్టులో భాగంగా ఒక చిన్న స్థలాన్ని గిఫ్ట్ గా అందిస్తున్నట్లు, పాకిస్తాన్ వ్యాపారవేత్త తెలియజేశాడు.