పాకిస్తానీని పెళ్లి చేసుకున్న భారతీయురాలు

ఓవైపు పాకిస్తానీ మహిళ సీమ వ్యవహారం వార్తల్లో ఉండగానే..  ఫేస్‌బుక్‌ ప్రియుడి  కోసం సరిహద్దు దాటి పాకిస్తాన్‌ వెళ్లిన రాజస్థానీ వివాహిత అంజు ఎపిసోడ్‌కు విపరీతమైన హైప్‌ వచ్చింది. ఈలోపు ఈ ప్రేమకథా చిత్రమ్‌లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మతం మార్చుకుని ఫాతిమా పేరుతో ఆమె నస్రుల్లాను వివాహం చేసుకుందని.. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు, వివాహ సర్టిఫికెట్‌ కూడా వైరల్‌ అయ్యాయి. మలాకాండ్ డివిజన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ నాసిర్ మెహమూద్ సత్తి మాట్లాడుతూ […]

Share:

ఓవైపు పాకిస్తానీ మహిళ సీమ వ్యవహారం వార్తల్లో ఉండగానే..  ఫేస్‌బుక్‌ ప్రియుడి  కోసం సరిహద్దు దాటి పాకిస్తాన్‌ వెళ్లిన రాజస్థానీ వివాహిత అంజు ఎపిసోడ్‌కు విపరీతమైన హైప్‌ వచ్చింది. ఈలోపు ఈ ప్రేమకథా చిత్రమ్‌లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మతం మార్చుకుని ఫాతిమా పేరుతో ఆమె నస్రుల్లాను వివాహం చేసుకుందని.. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు, వివాహ సర్టిఫికెట్‌ కూడా వైరల్‌ అయ్యాయి.

మలాకాండ్ డివిజన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ నాసిర్ మెహమూద్ సత్తి మాట్లాడుతూ అంజు (35), నస్రుల్లా (29)ల పెళ్లి అయ్యింది అని ధృవీకరించారు, ఆ మహిళ ఇస్లాంలోకి మారిన తర్వాత ఫాతిమా పేరును తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నస్రుల్లా కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది మరియు న్యాయవాదుల సమక్షంలో దంపతులు దిర్ బాలాలోని జిల్లా కోర్టుకు హాజరయ్యారు.

భద్రతా కారణాల దృష్ట్యా, ఆ మహిళను పోలీసు భద్రతతో కోర్టు నుండి ఆమె కొత్త అత్తవారి ఇంటికి తీసుకెళ్లారు.

అంజు ఎం చెప్పింది అంటే…. 

పాక్‌కు వెళ్లాలనుకున్నాను.. వెళ్లాను. నేనేం మతం మార్చుకోలేదు నా  వీసా గడువు  అయ్యాక ఆగష్టు 20 న ఇండియా కి తిరిగి వచ్చేస్తాను.. నేను ఎవరిని వివాహం చేసుకోలేదు. ఇక్కడ ఓ ఫేమస్‌ వ్లోగర్‌ మా ఇద్దరినీ కలిపి షూట్‌ చేశాడు. అంతేగానీ.. అదేం ప్రీ వెడ్‌ షూట్‌ లేదంటే పోస్ట్‌ వెడ్‌ షూట్‌ కాదు. అంతా పుకార్లే. నేను నస్రుల్లా మంచి స్నేహితులం మాత్రమే. నేనింకా భారతీయురాలినే. భారత్‌కు తిరిగొచ్చాక.. నా వ్యక్తిగత జీవితంపై నిర్ణయం తీసుకుంటా అని పేర్కొందామె.

అంజు ఇండియాలో ఉండగానే పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లో ఉన్న అంజు భర్త అరవింద్ తన భార్య త్వరలో తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. వీరికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.

నస్రూల్లా మాట్లాడుతూ …..

 నేను అంజుని పెళ్లి చేసుకోలేదు. మా పేరుతో వైరల్‌ అవుతున్న సర్టిఫికెట్‌ కూడా ఫేక్‌. అన్నీ పుకార్లే. ఆమె కేవలం నాకు మంచి స్నేహితురాలే.   మా ఇద్దరి గురించి మీడియాలో రావడంతో భద్రత కోసమే కోర్టుకు వెళ్లాం. ఇక్కడ బుర్ఖా సంప్రదాయం కాబట్టి ఆమె ధరించింది అంతే.  అంజూ విదేశీయురాలు. పైగా భారతీయురాలు. ఆమెకు ముప్పు పొంచి ఉండడం సహజం.  గనుక.. ప్రభుత్వం కూడా మాకు భద్రత కల్పించేందుకు ముందుకు వచ్చింది అని ఆయన తెలిపారు .

అంజు తండ్రి మాట్లాడుతూ …..

అంజూ తమ కుటుంబానికి ఇక లేదని, ఆమె చనిపోయినట్లేనని ఆమె తండ్రి థామస్ చెప్పారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తును అంజూ నాశనం చేసిందని, ఇలా చేయాలంటే ముందుగా భర్తకు విడాకులు ఇచ్చి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు.అంజు తనతో మాట్లాడటం లేదని, ఆమె తల్లితో మాత్రమే మాట్లాడిందని చెప్పారు. తన కూతురు అంజూ చనిపోవాలని ప్రార్థిస్తున్నానని తండ్రి థామస్ చెప్పారు. ‘‘ఆమెకు పాస్‌పోర్టు ఎలా వచ్చిందో, వీసా ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు’’ అని ఆయన పేర్కొన్నారు.

మానసిక స్థితి సరిగ్గా లేదని, తిరిగొస్తుందన్న నమ్మకం తనకు ఉందంటూ అంతకు ముందు వ్యాఖ్యానించిన ఆయన.. కూతురి నిఖా చేసుకుందనే వార్త తెలిసే సరికి దిగ్భ్రాంతికి లోనయ్యారు. తిరిగి ఆమెను భారత్‌కు రప్పించే ప్రయత్నం చేస్తారా?.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారా? అంటే.. అలాంటి ప్రయత్నమేమీ చేయబోమని తెలిపారాయన. చస్తే అక్కడే చావనివ్వండి.. తన ఇద్దరి పిల్లలను మేం చూసుకుంటామని ఆయన అన్నారు.