US IDFC డిప్యూటీ సీఈఓగా భారత మహిళ

ఇండియా – అమెరికన్ పాలసీ నిపుణురాలు మరియు వ్యాపారవేత్త నిషా దేశాయ్ బిస్వాల్ (Nisha Desai Biswal) ను US ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు డిప్యూటీ CEO గా నియమిస్తున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సెనేట్ శనివారం ధృవీకరించారు. DFC డిప్యూటీ సీఈఓ గా నిషా దేశాయ్ బిస్వల్ ను ప్రతిపాదించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మార్చిలో ప్రకటించారు.  DFC డిప్యూటీ సీఈఓ గా తన నియామకం గురించి థ్రిల్లింగ్ గా, గౌరవంగా మరియు […]

Share:

ఇండియా – అమెరికన్ పాలసీ నిపుణురాలు మరియు వ్యాపారవేత్త నిషా దేశాయ్ బిస్వాల్ (Nisha Desai Biswal) ను US ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు డిప్యూటీ CEO గా నియమిస్తున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సెనేట్ శనివారం ధృవీకరించారు. DFC డిప్యూటీ సీఈఓ గా నిషా దేశాయ్ బిస్వల్ ను ప్రతిపాదించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మార్చిలో ప్రకటించారు. 

DFC డిప్యూటీ సీఈఓ గా తన నియామకం గురించి థ్రిల్లింగ్ గా, గౌరవంగా మరియు వినయంగా ఉంది అని నిషా దేశాయ్ (Nisha Desai Biswal)  ట్వీట్ చేశారు. తనకు మద్దతు ఇచ్చిన స్నేహితులు మరియు కొలీగ్స్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ” మిమ్మల్ని గర్వపడేలా చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను” అని కూడా నిషా దేశాయ్ వారితో అన్నారు. నిషా దేశాయ్ ప్రస్తుతం US ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఇంటర్నేషనల్ స్ట్రాటజీ అండ్ గ్లోబల్ ఇనిషియేటివ్ మరియు సౌత్ ఆసియా కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 

వైట్ హౌస్ ప్రకారంగా, నిషా దేశాయ్ (Nisha Desai Biswal) కు US విదేశాంగ విధానం, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, కాంగ్రెస్ మరియు ప్రైవేట్ రంగాల్లో 30 సంవత్సరాల అనుభవం ఉంది. SVP హోదాలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఆమె US – ఇండియా బిజినెస్ కౌన్సిల్ మరియు US – బంగ్లాదేశ్ బిజినెస్ కౌన్సిల్ ను పర్యవేక్షిస్తున్నారు. 

నిషా దేశాయ్ 2013 నుండి 2017 వరకు US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లో సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ గా పనిచేశారు. US – ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్, US – ఇండియా స్ట్రాటజిక్ అండ్ కమర్షియల్ డైలాగ్ ప్రారంభ వ్యవహారాలను కూడా ఆమె పర్యవేక్షించారు. 

విదేశీ సహాయం పై సలహా కమిటీకి నేషనల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్ మరియు US ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ ఇంటర్నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ రెండింటిలోను చైర్ గా వ్యవహరిస్తున్నారు. 

గతంలో నిషా దేశాయ్(Nisha Desai Biswal) US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) లో ఆసియా కు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ హా కూడా పని చేశారు. సౌత్, సెంట్రల్, సౌత్ ఈస్ట్ ఆసియా అంతటా USAID సంస్థ కార్యకలాపాలను నిర్దేశించే వారు మరియు పర్యవేక్షించే వారు. 

భారత మహిళ కు అమెరికాలో ఈ పదవి దక్కడం పై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్ మరియు అమెరికా దేశాల మధ్య దృఢమైన సంబంధాన్ని పెంపొందించుకునే అందుకు ఈ సంఘటన మరొక మైలురాయి అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిషా దేశాయ్ బిశ్వాల్ కు శుభాకాంక్షలు చెప్తూ పలువురు ప్రముఖులు ట్వీట్ చేశారు. కాగా DFC కు భారతీయ మహిళ డిప్యూటీ CEO గా నియమించబడడం ఇది తొలిసారి.