వీసాల జారీలో అమెరికా రికార్డ్..!

భారతీయ విద్యార్థులకు ఇతర దేశాలకు వెళ్లి చక్కని పైచదువులు చదవాలని మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే పలు దేశాలు తమ వైపు నుంచి భారతీయ విద్యార్థుల కోసం చక్కని అవకాశాలను కల్పిస్తుండడం విశేషం. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో భారత్‌కు చెందిన విద్యార్థులకు అమెరికా రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసినట్లు ప్రకటించింది. US నుండి ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తులను దాఖలు చేసిన భారతదేశం నుండి 90,000 కంటే ఎక్కువ […]

Share:

భారతీయ విద్యార్థులకు ఇతర దేశాలకు వెళ్లి చక్కని పైచదువులు చదవాలని మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే పలు దేశాలు తమ వైపు నుంచి భారతీయ విద్యార్థుల కోసం చక్కని అవకాశాలను కల్పిస్తుండడం విశేషం. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో భారత్‌కు చెందిన విద్యార్థులకు అమెరికా రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసినట్లు ప్రకటించింది. US నుండి ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తులను దాఖలు చేసిన భారతదేశం నుండి 90,000 కంటే ఎక్కువ వీసాలు జారీ చేసినట్లు భారతదేశంలోని US మిషన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. 

రికార్డ్ స్థాయిలో వీసాలు జారీ చేసిన యూఎస్: 

ట్విట్టర్ పోస్ట్ ప్రకారం, US మిషన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రపంచ దేశాలలో, 4 స్టూడెంటు వీసాలలో ఒకటి భారతదేశంలోనే జారీ చేసినట్లు పేర్కొంది. ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్‌ను ఎంచుకున్న విద్యార్థులందరికీ తన వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసింది, యుఎస్ మిషన్. 2022లో, యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులతో ప్రపంచంలోని అగ్ర దేశంగా భారత్ చైనాను అధిగమించింది. 2020లో దాదాపు 2,07,000 మంది అంతర్జాతీయ భారతీయ విద్యార్థులు USలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదికలు పేర్కొన్నాయి. భారతదేశం నుండి విద్యార్థులను ఆకర్షించడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే సులభతరమైన అప్లికేషన్ ఫార్మాలిటీస్, ఆర్థిక సహాయం మరియు స్కాలర్‌షిప్‌ల ఫలితంగా, ఉన్నత విద్య అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు నిజానికి ఇది ఒక చక్కని అవకాశంగా మారింది. 

ఫ్రాన్స్ కూడా భారతదేశం నుండి సుమారు 30,000 మంది విద్యార్థులను స్వాగతించాలని తన  లక్ష్యాన్ని, విద్యార్థులను ప్రోత్సహించాలని కోరికను వ్యక్తం చేసింది. 2030 నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి దేశం ప్రయత్నాలు చేస్తోంది. విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడం, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం మరియు రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంటున్నారు దేశాలు. 

ఫ్రాన్స్ పర్యటనలో శుభవార్త చెప్పిన మోదీ: 

కొద్ది నెలల క్రితమే ప్రధానమంత్రి మోదీ పారిస్ వెళ్లడం జరిగింది.  అంతేకాకుండా అక్కడ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం ఆయనకు లభించింది. స్వయానా ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ బోర్ని ఎయిర్పోర్టులో మోదీ గారిని స్వాగతించారు. 

ఫ్రెంచ్ లో ఉంటున్న ఇండియన్ విద్యార్థులకు శుభవార్త చెప్పడం జరిగింది మోదీ. ఫ్రాన్స్ లో మాస్టర్ డిగ్రీ చదువుతున్న వారి కోసం, వారు చదువు అనంతరం కూడా ఐదు సంవత్సరాలు ఫ్రాన్స్ లోనే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి ఫైవ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ పోస్ట్ స్టడీ వీసా అనేది కల్పిస్తున్నారు. ఇంతకుముందు ఈ వీసా రెండు సంవత్సరాలు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే, పారిస్‌లోని ఎల్‌ఎ సీన్ మ్యూజికేల్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి, ఆ రోజున చేసిన ప్రసంగంలో భాగంగా ప్రధాని మోదీ, ఫ్రాన్స్ విద్యార్థుల కోసం ఈ వీసా శుభవార్తని ప్రకటించారు. అక్కడ ప్రజల నుంచి ఆయనకు ఘనస్వాగతం లభించినందుకు ఆయన మరింత ఉత్సాహంతో సంతోషంగా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా, రెండు సంవత్సరాల అందుబాటులో ఉన్న టూ ఇయర్ లాంగ్ టర్మ్ వీసా ప్రస్తుతం ఫైవ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ వీసాగా మారుస్తున్నట్లు ప్రకటించారు మోదీ. 

ఇలా చాలా దేశాలు కూడా తమ దేశంలోని చదువుకునే విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వీసాల దగ్గర నుంచి స్కాలర్షిప్ల వరకు చాలా సదుపాయాలు కల్పిస్తూ, విదేశీ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి దేశాలు.