Varun Raj: అమెరికాలో తెలంగాణ విద్యార్థికి క‌త్తిపోట్లు..

తెలంగాణకు చెందిన వరుణ్ రాజ్(Varun Raj) అనే విద్యార్థిపై అమెరికా(America)లో మూడు రోజుల క్రితం దాడి జరిగింది. జిమ్ లో ఉన్న అతనిపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తలకు తీవ్రగాయాలయ్యాయి. మెదడుకు గాయాలైనట్లుగా పోలీసులు తెలిపారు. మూడు రోజులు గడుస్తున్నా అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. ఇండియాలో ఉన్న విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం(Khammam) జిల్లా మామిళ్లగూడెం(Mamillagudem)కు చెందిన పుచ్చా వరుణ్‌ రాజ్‌ పై […]

Share:

తెలంగాణకు చెందిన వరుణ్ రాజ్(Varun Raj) అనే విద్యార్థిపై అమెరికా(America)లో మూడు రోజుల క్రితం దాడి జరిగింది. జిమ్ లో ఉన్న అతనిపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తలకు తీవ్రగాయాలయ్యాయి. మెదడుకు గాయాలైనట్లుగా పోలీసులు తెలిపారు. మూడు రోజులు గడుస్తున్నా అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. ఇండియాలో ఉన్న విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం(Khammam) జిల్లా మామిళ్లగూడెం(Mamillagudem)కు చెందిన పుచ్చా వరుణ్‌ రాజ్‌ పై చదువుల కోసం అమెరికా వెళ్లాడు.

ఇండియానా(Indiana) రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి పి వరుణ్ రాజ్‌(Varun Raj) ఎంఎస్‌ చేస్తున్నాడు. వరుణ్‌ ఎంఎస్‌ చేస్తూనే పార్ట్‌టైం జాబ్‌ కూడా చేస్తున్నాడు. మంగళవారం వరుణ్‌ జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఒక్కసారి జోర్డాన్ ఆండ్రేడ్(Jordan Andrade) (24) అనే దుండగుడు కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వరుణ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వరుణ్‌ను ఆసుపత్రికి తరలించారు.  అతని పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు.  “మూడు రోజుల చికిత్స తర్వాత, వరుణ్ లైఫ్ సపోర్టు మీద ఉన్నాడు. అతడికి తీవ్రమైన నరాల బలహీనత(Nervous weakness) ఉంది. బతికినా జీవితాంతం శాశ్వత అంగ వైకల్యంతో ఉంటాడు. కంటిచూపు పాక్షికంగా దెబ్బతినొచ్చు. శరీరం ఎడమ వైపు బలహీనంగా, పనిచేయకుండా అవ్వొచ్చు’’ అని తెలిపాయి.

ఈ సంఘటన తరువాత, దాడి చేసిన, జోర్డాన్ ఆండ్రేడ్(Jordan Andrade) (24)ను అరెస్టు చేశారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో వరుణ్‌ని ఇప్పుడు ఫోర్ట్ వేన్‌లోని లూథరన్ ఆసుపత్రి(Lutheran Hospital)కి తరలించారు. జోర్డాన్ ఆండ్రేడ్ ను పోర్టర్ సుపీరియర్ కోర్ట్ జడ్జి ముందు హాజరుపరిచారు. నిందితుడు నేరం అంగీకరించినట్టుగా సమాచారం.  న్యాయమూర్తి అతనికి 500,000 డాలర్ల నగదు బాండును, మరో 500,000 డాలర్లు ష్యూరిటీగా విధించారు. 

వరుణ్ రాజ్(Varun Raj) చదువుకుంటున్న యూనివర్శిటీ ప్రెసిడెంట్ తమ విద్యార్థిపై జరిగిన పాశవిక దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “వరుణ్ రాజ్‌పై జరిగిన దాడితో మేము దిగ్భ్రాంతి చెందాం. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ త్వరగా కోలుకుని రావాలని ప్రార్తిస్తున్నామని చెప్పడంతప్ప ఏమీ చేయలేం’ అని యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఒక ప్రకటనలో తెలిపారు.

వరుణ్ రాజ్ చికిత్స కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) నిధులు సమీకరిస్తోంది. బుధవారం రాత్రి నాటికి 38,000 డాలర్లకు పైగా సేకరించింది. “ప్రస్తుతం, వరుణ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కోమాలో పోరాడుతున్నాడు. అతని వైద్యానికి అయ్యే ఖర్చులు, అతని తల్లిదండ్రులు అమెరికా రావడం కోసం అయ్యేప్రయాణ ఖర్చులను భరించేందుకు మా మద్దతును కోరుతున్నారు ”అని నాట్స్ తెలిపింది.

మరోవైపు మహబూబాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వరుణ్‌ రాజ్‌ తండ్రి రామ్మూర్తి మంత్రి పువ్వాడ అజయ్‌(Minister Puvvada Ajay)ను కలిసి.. పరిస్థితిని వివరించారు. తన కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. గత ఫిబ్రవరిలో ఓ ఖమ్మం విద్యార్థి చనిపోయాడు. వరుణ్ పై దాడి ఘటనపై మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. వారికి కావాల్సిన సహాయసహకారాలను అందిస్తామని చెప్పారు. అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై స్నేహితుల సహాయంతో వరుణ్‌కు కావాల్సిన సహకారాన్ని అందించడానికి తమ వంతు కృషి చేస్తామని కేటీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు. వరుణ్ కుటుంబ సభ్యులతో తన టీం మాట్లాడుతుందని పేర్కొన్నారు.