ట్రూడో సొంత దేశంలో ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషించుకున్నాడు

ఖలీస్థాన్ మద్దతుదారు, ఎన్ఐఏ జాబితాలోని ఉగ్రవాది హరదీప్ సింగ్ నిజ్జర్‌‌ కెనడాలో ఈ ఏడాది జూన్‌ 18న హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సుల్లో పంజాబీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సర్రే సిటీలో గురు నానక్ సిక్ గురుద్వారా వద్ద హరదీప్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మూడు నెలల కిందట జరిగిన ఈ హత్య వెనుక భారత్ హస్తం ఉందని తాజాగా కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. భారత ప్రభుత్వంపై కెనడా ప్రధానమంత్రి […]

Share:

ఖలీస్థాన్ మద్దతుదారు, ఎన్ఐఏ జాబితాలోని ఉగ్రవాది హరదీప్ సింగ్ నిజ్జర్‌‌ కెనడాలో ఈ ఏడాది జూన్‌ 18న హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సుల్లో పంజాబీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సర్రే సిటీలో గురు నానక్ సిక్ గురుద్వారా వద్ద హరదీప్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మూడు నెలల కిందట జరిగిన ఈ హత్య వెనుక భారత్ హస్తం ఉందని తాజాగా కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.

భారత ప్రభుత్వంపై కెనడా ప్రధానమంత్రి జస్టిన్​ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది, టైగర్​ ఫోర్స్​ చీఫ్​ హర్దీప్​ సింగ్​ నిజ్జార్​ హత్య వెనుక భారత్​ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై.. కెనడాలో భారత్​కు చెందిన సీనియర్​​ దౌత్యవేత్తను అక్కడి ప్రభుత్వం బహిష్కరించింది. ఫలితంగా ఇప్పటికే బలహీనంగా ఉన్న భారత్​- కెనడా బంధం మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.

నిజంగా భారత్​ హస్తం ఉందా..?

పంజాబ్​ జలంధర్​లోని భార్​సింఘ్​పూర్​లో జన్మించాడు నిజ్జార్​. అతడిని ఎన్​ఏఏ (నేషనల్​ ఇన్​వెస్టిగేషన్​ ఏజెన్సీ).. పరారీలో ఉన్న నిందితుడిగా గుర్తించింది. గతేడాది జూలైలో నిజ్జార్​పై రూ. 10లక్షల క్యాష్​ రివార్డ్​ను కూడా ప్రకటించింది.

కాగా.. కెనడా సర్రే ప్రాంతంలోని ఓ గురుద్వారాలో జూన్​ 18న కొందరు దుండగులు.. హర్దీప్​ సింగ్​ నిజ్జార్​ను చంపేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ విషయంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు జస్టిన్​ ట్రూడో… “ఈ విషయంపై కొంత కాలంగా దర్యాప్తు చేస్తున్నాము. హర్దీప్​ సింగ్​ నిజ్జార్​ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందనేందుకు.. కెనడా భద్రతా దళాల వద్ద బలమైన ఆధారాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఇతర దేశాలు మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ విషయంపై మా మిత్రపక్షాలతో చర్చలు జరుపుతున్నాము. ఇది చాలా తీవ్రమైన అంశం. మేము చాలా సీరియస్​గా పరిగణిస్తున్నాము,” అని కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో వెల్లడించారు.

ఈ విషయంపై తమకు సహకరించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ట్రూడో. ఈ పరిస్థితులతో ఇండో- కెనడియన్లు భయపడాల్సి అవసరం లేదని, ఎప్పటిలాగే అందరు కలిసి మెలిసి ఉండొచ్చని హామీనిచ్చారు ట్రూడో.

భారత దౌత్యవేత్త బహిష్కరణ..

భారత ప్రభుత్వంపై జస్టిన్​ ట్రూడో సంచలన ఆరోపణలు చేసిన కొంతసేపటికి.. ఒటావాలోని భారత ఇంటెలిజెన్స్​ చీఫ్​ను బహిష్కరించింది కెనడా. “కెనడాలోని భారతీయ సీనియర్​ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నాము,” అని ఆ దేశ విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన రా (రీసెర్చ్​ అండ్​ ఎనాలసిస్​ వింగ్​) చీఫ్​ అని పేర్కొంది.

ప్రతిఘటించిన భారత్​..

భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. భారత ప్రభుత్వ సీక్రెట్ ఏజెంట్లే కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను మర్డర్ చేశారని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంటులో చేసిన ఆరోపణలను మోడీ సర్కారు ఖండించింది. హర్దీప్ సింగ్ నిజ్జార్‌ హత్యలో భారత్ కు చెందిన ఒక అత్యున్నత దౌత్యవేత్త హస్తం ఉందని ట్రూడో చేసిన అభియోగాలను తోసిపుచ్చింది. ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం భారత సర్కారు కీలక నిర్ణయం తీసకుంది. భారత్ లో ఉన్న కెనడా సీనియర్ దౌత్యవేత్తలలో ఒకరిపై బహిష్కరణ వేటు వేసింది. ఐదు రోజుల్లోగా భారత్ ను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. భారతదేశంలోని కెనడా హై కమిషనర్‌ను పిలిపించి ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు తెలియజేశాయి.

బలహీనపడుతున్న బంధం..!

ఖలిస్థానీ ఉగ్రవాదం అంశంలో భారత్​- కెనడా బంధం రోజురోజుకు బలహీనపడుతూ వస్తోంది. ఖలిస్థానీ ఉగ్రవాద సమస్యను కెనడా పరిష్కరించట్లేదని భారత్​ అంసతృప్తిగా ఉంది. జీ20 సదస్సులో భాగంగా.. భారత ప్రధాని మోదీ- జస్టిన్​ ట్రూడో మధ్య జరిగిన సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంపై మోదీ కాస్త గట్టిగానే మాట్లాడినట్టు తెలుస్తోంది.