ఆస్ట్రేలియాలో ఎన్నారై దారుణం

21 సంవత్సరాల జాస్మిన్ కౌర్ అనే యువతిని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బ్రతికుండగానే ఆస్ట్రేలియాలోని ఫీల్డ్ రేంజర్స్ లో పాతిపెట్టాడు. తనను చంపిన యువకుడి పేరు తరిక్జోట్ సింగ్.  తన మీద పగతోనే ఆ యువకుడు ఇదంతా చేశాడు. 2021 మార్చిలో యువతిని చంపాడని సింగ్ మీద ఆరోపణలు వచ్చాయి. సింగ్ తనని షాలో గ్రేవ్ లో పాతిపెట్టాడు. పోలీసులకు తన బాడీ అక్కడే దొరికింది.  సింగ్ ఎందుకు ఇలా చేశాడు?  సింగ్ కి కౌర్ […]

Share:

21 సంవత్సరాల జాస్మిన్ కౌర్ అనే యువతిని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బ్రతికుండగానే ఆస్ట్రేలియాలోని ఫీల్డ్ రేంజర్స్ లో పాతిపెట్టాడు. తనను చంపిన యువకుడి పేరు తరిక్జోట్ సింగ్.  తన మీద పగతోనే ఆ యువకుడు ఇదంతా చేశాడు. 2021 మార్చిలో యువతిని చంపాడని సింగ్ మీద ఆరోపణలు వచ్చాయి. సింగ్ తనని షాలో గ్రేవ్ లో పాతిపెట్టాడు. పోలీసులకు తన బాడీ అక్కడే దొరికింది. 

సింగ్ ఎందుకు ఇలా చేశాడు? 

సింగ్ కి కౌర్ అంటే చాలా ఇష్టం. తనని పెళ్లి చేసుకోమని చాలా సార్లు వేడుకున్నాడు. 

తనని వదిలేసినందుకే సింగ్ ఇలా చేశాడని తన వైపు లాయర్స్ వాదిస్తున్నారు. జాస్మిన్ కౌర్ వాళ్ళ అమ్మ రాష్పాల్ సింగ్ తన కూతురిని ఊరికే వేధించవాడని చెప్పింది. నా కూతురు వందసార్లు సింగ్ ని తిరస్కరించింది అని చెప్పింది. 

సింగ్ తాను కౌర్ ని కిడ్నాప్ చేసి కార్లో అడిలైడ్ తీసుకెళ్లాలని చెప్పాడు. తనని కేబుల్స్ తో కట్టేసి పాతిపెట్టానని చెప్పాడు. ఇది చాలా ఘోరమైన విషయమని ప్రాసిక్యూటర్ కార్మెన్ మెట్టో అనింది. కౌర్ చాలా నరకాన్ని అనుభవించి ఉంటుందని కార్మెన్ మెట్టో అనింది.  కౌర్ ఫ్యామిలీ ఇంతకుముందే సింగ్ ఏదో చేసి ఉంటాడని ఆరోపణలు చేసింది. తన కూతురు ఎంత నరకం అనుభవించిందో అని వాళ్లు బాధపడుతూ ఉండడం చూసి అందరికీ బాధ కలిగింది. సింగ్ చేసింది చాలా ఘోరమైన పని. 

ప్రేమ పేరుతో ఎందుకిలా చేస్తున్నారు? 

ఒకప్పుడు ప్రేమ అంటే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు . యువతలో స్వేచ్ఛ పెరిగింది ప్రేమ కి, ఆకర్షణకి తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఇలా తెలుసుకోలేక చాలామంది సఫర్ అవుతున్నారు. 

తీరా తెలుసుకునేసరికి వాళ్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. సింగ్ విషయానికొస్తే తనకు నచ్చింది తనకే కావాలి అనే మనస్తత్వం అని అనిపిస్తుంది. తను కావాలనుకున్నది తనకు దక్కదు అని ఇలా చేశాడు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువ అయ్యాయి. ఇలా జరగకూడదు అంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

అవేంటంటే పిల్లలు ఎప్పుడూ పేరెంట్స్ ని గమనిస్తూ ఉండాలి. తర్వాత వాళ్లు ఏం ఏం చేస్తున్నారు తెలుసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వాళ్లతో ఫ్రీగా మాట్లాడాలి. అలా మాట్లాడితే వాళ్ళ ఆలోచనలు ఏంటో అర్థం అవుతాయి. అలా అర్థమవ్వడం వల్ల ముందుగానే ఏం చేయబోతున్నాడు తెలుస్తుంది. ఇలా అందరూ ఫాలో అయితే చాలా వరకు ఇలాంటి ఘటనలు తగ్గిపోతాయి. సింగ్ చేసిన దానికి కౌర్ వాళ్ళ అమ్మకి కూతురు లేకుండా పోయింది. తను ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఇలాంటిది జరిగి ఉండేది కాదు. అయినా ఈ కాలంలో చాలావరకు యువత ఇలాగే ఉన్నారు. అందుకే ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. మితిమీరిన హింసాత్మక ఘటనలు మనకు కనిపిస్తున్నాయి. 

సింగ్ ఇంత క్రూరంగా కౌర్ ని చంపాడంటే తను ఎంత క్రూరంగా ఆలోచించి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షిస్తే అయినా చాలావరకు మన సొసైటీ మారుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుందాం.