భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ‘భారతీయ డిగ్రీలకు ఆస్ట్రేలియాలో గుర్తింపు ఉంటుంది’ అన్నారు. అంటే ఏమిటి?

భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని భారత విద్యార్హత కలిగిన విద్యార్థులకు ఆస్ట్రేలియాలో గుర్తింపు లభిస్తుందని భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని గుజరాత్‌లో తెలిపారు. దీంతో పాటు ఆస్ట్రేలియాలో చదివిన భారతీయ విద్యార్థుల ఆస్ట్రేలియన్ డిగ్రీకి కూడా భారత్‌లో గుర్తింపు ఉంటుందని తెలిపారు. తమ దేశానికి చెందిన డీకన్ యూనివర్సిటీ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆస్ట్రేలియా పీఎం ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. ఇకపై ఆస్ట్రేలియాలో భారతీయ డిగ్రీలకు […]

Share:

భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని

భారత విద్యార్హత కలిగిన విద్యార్థులకు ఆస్ట్రేలియాలో గుర్తింపు లభిస్తుందని భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని గుజరాత్‌లో తెలిపారు. దీంతో పాటు ఆస్ట్రేలియాలో చదివిన భారతీయ విద్యార్థుల ఆస్ట్రేలియన్ డిగ్రీకి కూడా భారత్‌లో గుర్తింపు ఉంటుందని తెలిపారు.

తమ దేశానికి చెందిన డీకన్ యూనివర్సిటీ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆస్ట్రేలియా పీఎం ఆంథోనీ అల్బనీస్ తెలిపారు.

ఇకపై ఆస్ట్రేలియాలో భారతీయ డిగ్రీలకు గుర్తింపు ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. ఆస్ట్రేలియా, భారతదేశ ప్రభుత్వాలు ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రికగ్నిషన్ మెకానిజమ్‌ను ఖరారు చేశాయని, దీని ద్వారా భారతీయ డిగ్రీలు తమ దేశంలో చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించబడతాయని ఆయన అన్నారు.

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అల్బనీస్ ఇలా అన్నాడు, “కొత్త మెకానిజం ప్రకారం, ఆస్ట్రేలియాలో చదువుతున్న, లేదా చదువు పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు వారు కష్టపడి సంపాదించిన డిగ్రీ గుర్తించబడుతుంది.” ఇది మాత్రమే కాకుండా అల్బనీస్ భారత విద్యార్థులకు కొత్త స్కాలర్‌‌షిప్ కూడా ప్రకటించారు.  

కొత్త స్కాలర్‌షిప్ 

ఇది నిజంగా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్న గొప్ప అవకాశం. ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం కొత్త స్కాలర్‌షిప్‌ను కూడా ప్రధాని ప్రకటించారు. కొత్త స్కాలర్‌షిప్‌ను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులకు నాలుగేళ్ళ వరకు ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి మైత్రి స్కాలర్‌‌షిప్ లభిస్తుందని అల్బనీస్ ప్రకటించారు. దీనితో రెండు దేశాల మధ్య విద్యా, సాంస్కృతిక సంబంధాలు బలోపేతం అవుతాయని ఆయన అన్నారు. స్కాలర్‌షిప్ అనేది ఆస్ట్రేలియా, భారతదేశాల మధ్య సాంస్కృతిక, విద్యా, సామాజిక సంబంధాలను పెంపొందించడానికి ప్రయత్నించే విస్తృత స్నేహ కార్యక్రమంలో భాగం. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కూడా పాల్గొన్నారు.

వాస్తవానికి.. ఆస్ట్రేలియా, భారత విద్యార్హతల గుర్తింపు ఇండియా ఆస్ట్రేలియా, వారి ద్వైపాక్షిక విద్యా సంబంధానికి ఒక పెద్ద ముందడుగు, ఇది లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. డిగ్రీని గుర్తించడంతో పాటు, ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం ప్రధాన మంత్రి అల్బనీస్ కొత్త మైత్రి స్కాలర్‌షిప్‌ను కూడా ప్రకటించడం విద్యార్థులకు తీపికబురే అని చెప్పుకోవాలి ఆస్ట్రేలియాలో నాలుగేళ్ల పాటు చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఫ్రెండ్‌షిప్ స్కాలర్‌షిప్ ఇవ్వబడుతుంది.

1990ల నుండి ఎన్నో ప్రభుత్వాలు భారతదేశంలో విదేశీ వర్సిటీల ప్రవేశం కోసం చాలా విఫలయత్నం చేశాయి. ఇది ఇప్పుడు చివరకు డీకన్ ప్రవేశంతో ఒక విదేశీ యూనివర్సిటీ మన దేశంలోకి ప్రవేశించడానికి నాంది పలికినట్లు అయ్యింది. ఆర్థిక నిర్వహణ, ఫిన్‌టెక్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం వంటి కోర్సులను ఇక్కడ అందిస్తారు. 

2007 నాటికి మొదటగా రూపొందించబడిన గిఫ్ట్ సిటీ గాంధీనగర్‌లో 887 ఎకరాల్లో విస్తరించి ఉంది.

‘మైత్రి’ స్కాలర్‌షిప్ గురించి మొట్ట మొదటగా ఫిబ్రవరి 14, 2022న ఆస్ట్రేలియన్ మంత్రుల సంయుక్త మీడియా ప్రకటన ప్రస్తావించారు. “$11.2 మిలియన్ల మైత్రి స్కాలర్‌షిప్‌ల కార్యక్రమం ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాలలో చదువుకోవడానికి ఇష్టపడే భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తుంది, సపోర్ట్ ఇస్తుంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, హెల్త్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియన్ విద్యా, పరిశోధనా సంస్థలలో ఇది లభిస్తుంది,” అని ఆ ప్రకటన పేర్కొంది.