జర్మన్ ఫోస్టర్ కేర్‌లో భారతీయ శిశువు

జర్మనీలో చిక్కుకున్న చిన్నారి అరిహా షా కేసు. అరిహా సంరక్షణ బాధ్యతలను జర్మనీకే అప్పగిస్తూ స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో దాదాపు 2 ఏళ్లుగా అరిహాను భారత్‌కు తీసుకురావాలని వేడుకుంటున్న తల్లిదండ్రుల విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు . ఇంతకీ ఈ అరిహా ఎవరు. ఆమె ఎందుకు జర్మనీలో చిక్కుకుపోయింది. అరిహాను భారత్‌కు తీసుకువచ్చేందుకు ఆ తల్లిదండ్రులు.. ఎంత కష్టపడుతున్నారో తెలియాలంటేమీరు అరహా కథను పూర్తిగా తెలుసుకోవాల్సిందే  భారత జంటకు జర్మనీలో పుట్టిన చిన్నారి బాధ్యతలను […]

Share:

జర్మనీలో చిక్కుకున్న చిన్నారి అరిహా షా కేసు. అరిహా సంరక్షణ బాధ్యతలను జర్మనీకే అప్పగిస్తూ స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో దాదాపు 2 ఏళ్లుగా అరిహాను భారత్‌కు తీసుకురావాలని వేడుకుంటున్న తల్లిదండ్రుల విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు . ఇంతకీ ఈ అరిహా ఎవరు. ఆమె ఎందుకు జర్మనీలో చిక్కుకుపోయింది. అరిహాను భారత్‌కు తీసుకువచ్చేందుకు ఆ తల్లిదండ్రులు.. ఎంత కష్టపడుతున్నారో తెలియాలంటేమీరు అరహా కథను పూర్తిగా తెలుసుకోవాల్సిందే 

భారత జంటకు జర్మనీలో పుట్టిన చిన్నారి బాధ్యతలను ఆ దేశానికే అప్పగిస్తూ అక్కడి కోర్టు తీర్పు వెలువరించింది. దాదాపు 2 ఏళ్లుగా ఆమె తల్లిదండ్రులు చేస్తున్న పోరాటం వృథా అయింది. అయితే ఈ తీర్పును అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఎప్పటిలాగే పాపను తల్లిదండ్రులు కలుసుకోవచ్చని వెల్లడించింది. చిన్నారికి అయిన గాయం.. ప్రమాదవశాత్తు జరిగిందన్న తల్లిదండ్రుల వాదనను బెర్లిన్‌లోని కోర్టు తెలిపింది. అయితే చిన్నారిని అరిహా భారత్‌కు తీసుకువచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందని.. తల్లిదండ్రులు విశ్వాసం వ్యక్తం చేశారు.

కేసు సంగతికి వస్తే,,,,

ముంబైకి చెందిన భవేష్‌ షా, ధారా షా అనే దంపతులు 2018లో ఉపాధి కోసం జర్మనీకి వెళ్లారు. వారిద్దరికి అక్కడ అరిహా షా అనే పాప జన్మించింది. ఒకరోజు ఆ చిన్నారి ఆడుకుంటుండగా.. కింద పడింది. దీంతో చిన్నారి ప్రైవేటు పార్ట్ వద్ద దెబ్బ తగిలింది. వెంటనే ఆ చిన్నారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కొన్ని రోజుల తర్వాత భవేష్ షా, ధారా షా దంపతులను ఆస్పత్రి వర్గాలు పిలిపించాయి. చిన్నారికి తగిలిన గాయాన్ని పరిశీలించి ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని అనుమానించారు. దీంతో ఆ చిన్నారి సంరక్షణ బాధ్యతలను జర్మనీ అధికారులు తీసుకున్నారు. 2021 సెప్టెంబరులో ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి 20 నెలలుగా అరిహా.. జర్మనీ అధికారుల సంరక్షణలోనే ఉంటోంది. దీంతో అరిహా తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయ పోరాటం సాగిస్తూనే ఉన్నారు.

జూన్‌లో, సీపీఐ, ఎంపీ జాన్ బ్రిట్టాస్, తో పాటు గా దాదాపు 19 పార్టీలకు చెందిన 59 మంది ఎంపీలు భారత్‌లో ఉన్న జర్మనీ రాయబారికి లేఖ రాశారు. తమ కుమార్తె అరిహాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌లు తిరిగి భారత్‌కు తీసుకొస్తారని నమ్మకంతో ఉన్నామని భవేష్ షా దంపతులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచి అరిహాను 140 కోట్ల మంది భారతీయులకు అప్పగిస్తున్నామని తెలిపారు.

భారత్‌లోని జర్మన్ రాయబారిని ఉద్దేశించి సంయుక్త లేఖపై సంతకాలు చేశారు 59 మంది ఎంపీలు. 

ఈ కేసుకు భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు, బాలల సాంస్కృతిక హక్కులు మరియు భారతీయురాలిగా ఆమె హక్కులు ఆమెను జర్మన్ ఫోస్టర్ కేర్‌లో ఉంచడం ద్వారా ఉల్లంఘించబడుతున్నాయని అని ఆయన ఒక  మీడియా సమావేశంలో అన్నారు.

అంతే కాకుండా ఈ వారం ప్రారంభంలో భారతదేశంలోని జర్మన్ రాయబారిని పిలిపించి  మా ఆందోళనలు అతనికి స్పష్టంగా తెలియజేయబడ్డాయి అని  బిడ్డను త్వరగా భారతదేశానికి తిరిగి తీసుకురావాలని కూడా మేము కోరాము. మేము ఈ విషయంపై జర్మన్ అధికారులను ఒత్తిడి చేస్తూనే ఉంటాము, ”అని అతను తెలిపారు.

బిడ్డ తన భాషా, మతపరమైన, సాంస్కృతిక మరియు సామాజిక వాతావరణంలో ఉండటం చాలా ముఖ్యం అని, బిడ్డ త్వరగా తిరిగి  భారతదేశం కి రావాలని జర్మనీని ఒత్తిడి చేసింది. భారతీయ తల్లిదండ్రులు ఆమెను వేధించారని ఆరోపించడంతో చిన్నారిని ఫోస్టర్ కేర్‌లో ఉంచినట్లు జర్మన్ అధికారులు తెలిపారు.