India: ఇజ్రాయెల్ కు షాక్ ఇచ్చిన ఇండియా

వ్యతిరేఖంగా ఓటు వేసిన భారత్

Courtesy: Twitter

Share:

India: హమాస్ (Hamas) వారు అనవసరంగా ఇజ్రాయెల్ (Israel) ను కవ్వించడంతో ప్రతి చర్యగా ఇజ్రాయెల్ కూడా భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో అమాయక పాలస్తీనియన్లు (Palestine) అవస్థలు పడుతున్నారని అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. అయినా కానీ ఇజ్రాయెల్ మాత్రం దాడులను ఆపడం లేదు. ఎంతలా అంటే దాడులను ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Prime minister Netanyahu) కూడా మీడియా ముఖంగా నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఇజ్రాయెల్ (Israel) ఇంత యుద్ధం చేస్తున్నా కానీ ఇండియా (India) మాత్రం ఇది వరకు ఇజ్రాయెల్ ను ఖండించలేదు. ఇండియా(India)  ఇజ్రాయెల్ ను వారించాలని అనేక మంది చెప్పినా కానీ ఇండియా పెద్దగా పట్టించుకోలేదు. కానీ మొట్టమొదటి సారి ఇండియా (India)  ఇజ్రాయెల్ కు షాక్ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. 

ఐక్యరాజ్యసమితిలో వ్యతిరేఖంగా ఓటు.. 

ఇండియా (India)  ఇజ్రాయెల్ కు వ్యతిరేఖంగా ఐక్యరాజ్య సమితిలో (UN) ఓటు వేసింది. పాలస్తీనాలో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను (Settlement) ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. తూర్పు జెరూసలేంతో సహా ఆక్రమిత పాలస్తీనా (Palestine) భూభాగంలో మరియు ఆక్రమిత సిరియన్ గోలన్‌ లో సెటిల్మెంట్ కార్యకలాపాలను ఖండిస్తూ తీర్మానం ఆమోదం పొందింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టగా భారత్ (India)  తో పాటు 145 దేశాలు తీర్మానానికి  అనుకూలంగా ఓటు వేశాయి. అంతే కాకుండా 18 దేశాలు తటస్థంగా ఉన్నాయి. అమెరికా (America), కెనడా వంటి 7 దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేఖించాయి. తటస్థంగా ఉన్న దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. 

గతంలో అలా ఇప్పుడిలా.. 

వారం రోజుల వ్యవధిలో ఇండియా (India)  తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. వారం కింద ఇదే ఐక్యరాజ్య సమితిలో గాజా (Gaza) స్ట్రిప్‌ లో ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య తక్షణ, మన్నికైన మరియు స్థిరమైన మానవతావాద సంధి  కోసం పిలుపునిచ్చే తీర్మానంపై ఓటింగ్‌ (Voting) కు ఇండియా దూరంగా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఇండియా (India) ఇజ్రాయెల్ కు వ్యతిరేఖంగా ఓటు వేసింది. 

చనిపోతున్న అమాయకులు 

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌ పై జరిగిన దాడులతో ఇజ్రాయెల్ మరియు హమాస్ (Hamas) మధ్య యుద్ధం ప్రారంభం అయింది. ఈ యుద్ధంలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలో 11,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో పక్క. హమాస్ దాడుల్లో దాదాపు 1,200 మంది ఇజ్రాయిలీలు మరణించినట్లు సమాచారం. అంతే కాకుండా 200 మందికి పైగా ఇజ్రాయిలీలు (Israels) హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు.

మారిన వైఖరి.. 

ఇజ్రాయెల్  - హమాస్ యుద్ధం విషయంలో ఇండియా(India)  వైఖరి మారిపోయింది. అంతకుముందు జరిగిన ఓటింగ్‌ కు దూరంగా ఉన్న ఇండియా(India)  ఈ సారి మాత్రం ఇజ్రాయెల్ కు వ్యతిరేఖంగా ఓటు వేసింది. గాజాలో (Gaza) విస్తరిస్తున్న మానవతా సంక్షోభంపై భారతదేశం ఆందోళన చెందుతోందని, అయితే ఉగ్రవాదంపై ఎలాంటి సందేహం ఉండదని కూడా విశ్వసిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తీర్మానంపై న్యూ ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఈ అంశంపై దాని స్థిరమైన వైఖరి ద్వారా మార్గనిర్దేశం చేయబడిందని మరియు ఓటుకు సంబంధించిన దాని వివరణ (Explanation) దీనిని సమగ్రంగా మరియు సంపూర్ణంగా పునరుద్ఘాటించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌ పై హమాస్ చేసిన దాడులను ప్రస్తావిస్తూ ఉగ్రవాదంపై ఎలాంటి సందేహం ఉండదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

అక్కడే మా ఆలోచనలన్నీ.. 

ఇండియా (India)  ఇజ్రాయెల్ కు వ్యతిరేఖంగా ఓటు వేసింది. ఇలా చేసిన తర్వాత ఐక్యరాజ్యసమితిలో భారతదేశ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజ్నా పటేల్ (Yenna Patel) మాట్లాడారు. మా ఆలోచనలు కూడా బందీలుగా ఉన్న వారిపైనే ఉన్నాయని, వారిని వెంటనే మరియు షరతులు లేకుండా విడుదల చేయాలని మేము కోరుతున్నామని తెలిపారు. ఈ మానవతా సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని, అంతర్జాతీయ సమాజం యొక్క తీవ్రతను తగ్గించే ప్రయత్నాలను మరియు గాజా ప్రజలకు మానవతా సహాయం అందించడాన్ని మేము స్వాగతిస్తున్నామని వెల్లడించారు. భారతదేశం ఎల్లప్పుడూ ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు చర్చల ద్వారా రెండు-రాష్ట్రాల పరిష్కారానికి మద్దతు ఇస్తుందని, ఇది సురక్షితమైన మరియు గుర్తింపు పొందిన సరిహద్దులలో, ఇజ్రాయెల్‌ తో శాంతితో ప్రక్క ప్రక్క ప్రక్కనే నివసిస్తున్న పాలస్తీనా యొక్క సార్వభౌమ, స్వతంత్ర మరియు ఆచరణీయ రాజ్య స్థాపనకు దారితీస్తుందని ఆమె తెలిపారు. అక్టోబరు 7 దాడులు జరిగిన వెంటనే, ప్రధాని నరేంద్ర మోదీ హమాస్ సమ్మెను "ఉగ్రవాద" చర్యగా అభివర్ణించారని తెలిపారు.ఈ సమస్యపై తదుపరి ప్రకటనలలో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాలస్తీనా (Palestine) యొక్క సార్వభౌమ, స్వతంత్ర మరియు ఆచరణీయ రాజ్యాన్ని స్థాపించే దిశగా ఎల్లప్పుడూ... ప్రత్యక్ష చర్చలను సమర్ధించిందని పేర్కొంది. ఇలా ఇండియా తన వైఖరిని ఓటింగ్ ద్వారా వెల్లడించింది. ఇజ్రాయెల్ (Israel) మాత్రం తాము యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తీర్మానించుకుని కూర్చుంది. అవసరం అయితే గాజాలో ఉన్న ఆసుపత్రుల నుంచి చిన్న పిల్లలను వేరే చోటుకి తరలించేందుకు సహాయం చేస్తామని వెల్లడించింది.