Gaza: గాజాకు మానవతా సాయం పంపిన ఇండియా

ప్రస్తుతం ప్రపంచం మొత్తం గాజా (Gaza) గురించి ప్రార్థిస్తోంది. ఎలాగైనా సరే గాజా  (Gaza)స్ట్రిప్ లో ఉన్న ప్రజలు యుద్ధం నుంచి విముక్తులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే పాలస్తీనా దేశం వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. కొంత మంది స్వార్థం వల్ల ఇజ్రాయెల్ (Israel) మీద దాడి చేయడంతో తేరుకున్న ఇజ్రాయెల్ తన దాడులను కూడా పెంచింది. దీంతో పాలస్తీనా (Palastina) దేశంలో ఉన్న గాజా (Gaza) సిటీ అతలాకుతలం అవుతోంది. తమ […]

Share:

ప్రస్తుతం ప్రపంచం మొత్తం గాజా (Gaza) గురించి ప్రార్థిస్తోంది. ఎలాగైనా సరే గాజా  (Gaza)స్ట్రిప్ లో ఉన్న ప్రజలు యుద్ధం నుంచి విముక్తులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే పాలస్తీనా దేశం వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. కొంత మంది స్వార్థం వల్ల ఇజ్రాయెల్ (Israel) మీద దాడి చేయడంతో తేరుకున్న ఇజ్రాయెల్ తన దాడులను కూడా పెంచింది. దీంతో పాలస్తీనా (Palastina) దేశంలో ఉన్న గాజా (Gaza) సిటీ అతలాకుతలం అవుతోంది. తమ టార్గెట్ సాధారణ పౌరులు కాదని భయంకరమైన ఉగ్రవాదులని ఇజ్రాయెల్ (Israel)  ప్రభుత్వం చెబుతోంది.

ఉక్కిరి బిక్కిరి అవుతున్న గాజా

ఇజ్రాయెల్ (Israel) వరుస దాడులతో గాజా (Gaza) సిటీ అతలాకుతలం అవుతోంది. మొదట సైలెంట్ గా ఉన్న ఇజ్రాయెల్ (Israel) మీద హమాస్ ఉగ్రవాదులు దాడులు చేయడంతో తర్వాత ఇజ్రాయెల్ కూడా తన దాడులను ముమ్మరం చేసింది. దీంతో గాజా  (Gaza)సిటీలో ఉంటున్న సాధారణ పౌరులు అతలాకుతలం అవుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ గాజా (Gaza) సిటీని అష్ట దిగ్బందనం చేసింది. దీంతో గాజా (Gaza)లో ఉంటున్న పౌరులు తినేందుకు తిండిలేక తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నారు. అక్కడి పౌరులు పడుతున్న కష్టాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అనేక మంది చలించిపోయి.. గాజా (Gaza)కు మానవతా సాయం పంపిస్తున్నారు. 

మేమున్నామంటూ భరోసా

ఇలా ఇజ్రాయెల్ (Israel) దాడులతో అతలాకుతలం అవుతున్న గాజా (Gaza) సిటీలోని పౌరులను ఆదుకునేందుకు వివిధ దేశాలు మానవతా సాయంతో ముందుకు వస్తున్నాయి. దీంతో ఆ దేశానికి మానవతా సాయం  (Relief material) అందించేందుకు దేశాలు పోటీ పడుతున్నాయి. ఇక ఇండియా కూడా గాజా (Gaza)కు తన మానవతా సాయాన్ని పంపింది. దాదాపు 6.5 టన్నుల వైద్య సహాయం మరియు 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రిని పాలస్తీనాకు పంపారు. ఇవి ఈజిప్టు మీదుగా పాలస్తీనా దేశానికి చేరుకుంటాయి.

ప్రకటించిన అరిందమ్ బాగ్చి

ఇండియా తరఫున మానవతా సాయాన్ని గాజా (Gaza)కు పంపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విటర్ (ఎక్స్) వేదికగా ప్రకటించారు. పాలస్తీనా ప్రజల కోసం దాదాపు 6.5 టన్నుల వైద్య సహాయం మరియు 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రిని తీసుకుని ఐఏఎఫ్  సీ-17 (C-17) విమానం ఈజిప్ట్‌ లోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరిందని అతడు ట్వీట్ (Tweet) చేశాడు. ఈజిప్ట్ మరియు గాజా (Gaza) మధ్య రాఫా సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఈ వస్తువులు పాలస్తీనాకు పంపబడతాయని వెల్లడించారు. మానవతా సహాయంలో అవసరమైన ప్రాణాలను రక్షించే మందులు,  శస్త్రచికిత్స వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్‌లు, టార్పాలిన్‌లు, శానిటరీ యుటిలిటీలు, నీటి శుద్దీకరణ మాత్రలు, ఇతర అవసరమైన వస్తువులు  ఉన్నాయని బాగ్చి తెలియజేశారు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తో ఇప్పటికే ఇండియా ప్రధాని మోదీ (Modi) మాట్లాడారు. ఆయన పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన కొద్ది రోజుల తర్వాత మన దేశం నుంచి పాలస్తీనాకు మానవతా సాయం పంపించబడింది. ఆసుపత్రిలో బాంబు దాడి కారణంగా గాజా (Gaza) స్ట్రిప్‌ లో పౌరుల ప్రాణాలు కోల్పోవడం పట్ల మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు. గాజా (Gaza)కు వీలైనంత సాయం చేస్తామని మోదీ వెల్లడించారు. 

ఉగ్రవాదుల కోసం సామాన్య పౌరులు బలి

గాజా (Gaza) స్ట్రిప్ లో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారు. వారు సైలెంట్ గా ఉన్న ఇజ్రాయెల్ మీద దాడి చేసి నరమేదం సృష్టించారు. దీంతో ఇజ్రాయెల్ తిరిగి దాడులను ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో కేవలం హమాస్ ఉగ్రవాదులు మాత్రమే కాదు.. సామాన్య పౌరులు కూడా అసువులు బాస్తున్నారు. దీంతో గాజా (Gaza) సిటీ అల్లాడిపోతుంది. అయినా కానీ తమ లక్ష్యం ఉగ్రవాదులను తుద ముట్టించడమే కానీ సామాన్య పౌరులను ఇబ్బంది పెట్టడం కాదని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. తమ దాడులు ఇలాగే కొనసాగుతాయని ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)  కూడా ఇదే ప్రకటించారు. హమాస్ మిలిటెంట్లను తుద ముట్టించే వరకు ఈ యుద్ధం కొనసాగుతోందని ఆయన ప్రకటించారు.