అరుణాచల్ ప్రదేశ్ లోని 11 పేర్లు మార్చడానికి చైనా చేసిన ప్రయత్నాన్ని తిప్పి కొట్టిన భారత్..

మూడోసారి మన భూభాగంలోని మన ప్రాంతాలకు కొత్తపేర్లు పెట్టి చైనా క్రూర దృష్టి, కుయుక్తులు అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాల పేర్లు మార్చడానికి భారతదేశం తిరస్కరించింది.. తమవి కాని ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటున్న చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది.. అయితే చైనా కుయుక్తులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ తమ అంతర్భాగమేనని క్లారిటీ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ పై తమవాదనను పునరుద్ఘాటించే ప్రయత్నాలలో భాగంగా .. […]

Share:

మూడోసారి మన భూభాగంలోని మన ప్రాంతాలకు కొత్తపేర్లు పెట్టి చైనా క్రూర దృష్టి, కుయుక్తులు

అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాల పేర్లు మార్చడానికి భారతదేశం తిరస్కరించింది.. తమవి కాని ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటున్న చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది.. అయితే చైనా కుయుక్తులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ తమ అంతర్భాగమేనని క్లారిటీ ఇచ్చింది.

అరుణాచల్ ప్రదేశ్ పై తమవాదనను పునరుద్ఘాటించే ప్రయత్నాలలో భాగంగా .. చైనా 11 ప్రాంతాలకు కొత్త పేర్లు విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ జంగ్నావ్‌గా పిలుస్తున్న చైనా టిబెట్ యొక్క దక్షిణ భాగం అని పేరు పెట్టింది.  అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది మూడోసారి.. చైనా విడుదల చేసిన పేర్ల జాబితాలో ఐదు పర్వత శిఖరాలు, రెండు భూభాగాలు, రెండు నివాస ప్రాంతాలు, రెండు నదులు ఉన్నాయి.. 

రెండుసార్లు అయింది.. మూడో సారి.. 

ఇప్పటికే అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాలకు రెండుసార్లు పేర్లు పెట్టింది.. 2017లో 6 పేర్లతో కూడిన జాబితాను చైనా విడుదల చేయగా.. ఆ దేశం 2021లో అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు పేర్లు మార్చింది. ఇప్పుడు మళ్లీ 11 ప్రాంతాలకు పేర్లు పెట్టింది చైనా ఇలా పేర్లు మార్చడం మొదటిసారి కాదు.. ఇలాంటి చర్యలను తిరస్కరిస్తున్న అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం. మా దేశంలో అరుణాచల్ ప్రదేశ్‌కు విడదీయరాన్ని బంధం ఉంది. తమ భూభాగంలోని ప్రాంతాలకు పేర్లు పెట్టినంత మాత్రాన క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమి మారవు అని విదేశాంగ ప్రతినిధి అరిందం బాగ్బి తెలిపారు.  

చైనాలోని పాలక కమ్యూనిస్టు పార్టీ మౌత్  పీస్ పీపుల్స్ డైలీ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్ లో భాగమైన.. ది గ్లోబల్ టైమ్స్ ప్రకారం.. చైనా అధికారులు ఈ చర్య ప్రామాణిక భౌగోళిక పేర్లను బట్టి చేసినదని అంటున్నారు.  దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన చేసిన తర్వాత 2017 లో చైనా మొదటిసారి ఇలా పేర్లను ప్రకటించింది. ఈ టిబెట్ ఆధ్యాత్మిక గురువు యొక్క పర్యటనపై చైనా తీవ్ర విమర్శలు చేసింది.  దలైలామా టిబెట్ నుండి అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ గుండా పారిపోయి 1950లో హిమాలయ ప్రాంతాన్ని చైనా సైనిక ఆధీనంలోకి తీసుకున్న తరువాత 1959లో భారతదేశంలో ఆశ్రయం పొందారు.  తూర్పు లడక్‌లో నెలల తరబడి సరిహద్దు ప్రతిష్ట వచ్చినా ముఖాముఖిలో గత డిసెంబర్‌లో రాష్ట్రంలోని తవాంగ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంట భారత్ చైనా దళాలు గొడవపడిన సంగతి తెలుస్తుంది.

 అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్‌లో కూడా వాస్తవ నియంత్రణ రేఖ వెంట భారతదేశం తన మొత్తం సైనిక సంస్థలు పెంచుకుంది. ఏకపక్షంగా చైనా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని రాజ్ నాథ్ సింగ్ అప్పుడు ఆరోపించారు. ఇప్పుడు కూడా మరోసారి అరుణాచల్ ప్రదేశ్‌లో 11 రాష్ట్రాలకు పేర్లు పెట్టి తనలో భాగంగా చేసుకోవాలని ప్రయత్నిస్తోంది చైనా. ఈ చర్యలపైన భారతదేశం కూడా కఠినంగా స్పందించింది..