యుఎస్ తప్పకుండా భారతదేశాన్ని ఎంచుకుంటుంది

2023 సంవత్సరం మొదట్లో, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వైట్ హౌస్ సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా అదే విధంగా భారతదేశం మధ్య బంధం మరింత బలపడుతుందని, అమెరికా సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే కెనడాలో ఉగ్రవాది మరణానికి సంబంధించి భారత హస్తం ఉంది అంటూ ఆరోపిస్తున్న కెనడా విషయం మీద ఇటీవల స్పందించింది యూఎస్. అంతేకాకుండా ఎక్స్ పెంటగన్ అఫీషియల్, ఒకవేళ భారతదేశం అదేవిధంగా కెనడా మధ్య, యుఎస్ కేవలం ఒకే […]

Share:

2023 సంవత్సరం మొదట్లో, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వైట్ హౌస్ సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా అదే విధంగా భారతదేశం మధ్య బంధం మరింత బలపడుతుందని, అమెరికా సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే కెనడాలో ఉగ్రవాది మరణానికి సంబంధించి భారత హస్తం ఉంది అంటూ ఆరోపిస్తున్న కెనడా విషయం మీద ఇటీవల స్పందించింది యూఎస్. అంతేకాకుండా ఎక్స్ పెంటగన్ అఫీషియల్, ఒకవేళ భారతదేశం అదేవిధంగా కెనడా మధ్య, యుఎస్ కేవలం ఒకే దేశాన్ని సపోర్ట్ చేయాలనుకుంటే, అది భారతదేశమే అవుతుందని కచ్చితంగా చెప్పారు. 

ఎక్స్ పెంటగన్ అఫీషియల్ మాటల్లో: 

ఇటీవల కెనడా ప్రధానమంత్రి జస్టిన్ చేసిన ఆరోపణల కారణంగా ముఖ్యంగా కెనడాకు మాత్రమే నష్టం వాటిలే అవకాశం ఉంటుంది అని మునుప‌టి పెంటగాన్ అఫీషియల్ మైఖేల్ రూబెన్ మాట్లాడటం జరిగింది. అంటే ఒకవేళ యూఎస్ తన సపోర్ట్ ని కేవలం ఒకే దేశానికి ఇవ్వాలనుకుంటే అది కచ్చితంగా భారతదేశమే అవుతుందని గుర్తు చేశారు. వోటావా లేదంటే న్యూఢిల్లీ అని ప్రస్తావన వస్తే యూఎస్ ఖచ్చితంగా న్యూఢిల్లీ వైపే మక్కువ చూపిస్తుందని, బంధాలకు ఎక్కువ విలువిస్తుందని మరొకసారి చెప్పుకొచ్చారు. 

కెనడా తన దేశంలో చనిపోయిన ఒక టెర్రరిస్ట్ గురించి ఎందుకు ఇంతలా ఆరాటపడుతోందని అర్థం కావట్లేదని మాట్లాడారు ఎక్స్ పెంటగన్ అఫీషియల్. అంతేకాకుండా, హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడాలి అనుకుంటే ఒక సాదాసీదా మనిషి గురించి మాట్లాడితే బాగుంటుందని, కానీ ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న, ఒక కరుడు కట్టిన టెర్రరిస్ట్ గురించి కెనడా సపోర్ట్ చేస్తూ మాట్లాడటాన్ని తప్పు పట్టారు. అయితే చనిపోయిన ఉగ్రవాది నిజానికి కెనడాలోకి ఒక ఫ్రాడ్ పాస్పోర్ట్ ద్వారా వచ్చాడంటూ గుర్తు చేశారు. అదే విధంగా ఒక ఉగ్రవాది కోసం దేశాల మధ్య చిన్నపాటి యుద్ధం జరగడం సబబు కాదు అన్నారు. అంతేకాకుండా నిజానికి కెనడా ప్రధానమంత్రి చాలా దూరం ఆలోచించారని ఇప్పటికే చాలామంది అభిప్రాయపడుతున్నారని, ఎక్స్ పెంటగన్ అఫీషియల్ చెప్పుకొచ్చారు. ముందు ముందు జరిగే వాటి గురించి ఆలోచించకుండా, కెనడా ప్రధానమంత్రి భారతదేశం మీద ఒక ఉగ్రవాది మరణం గురించి ఆరోపణలు చేయడం చాలా మందికి నచ్చలేదని కూడా చెప్పుకొచ్చారు. 

కెనడ PM తన వాదనలకు ఆధారంగా ఉండే ఎటువంటి సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమయ్యారు. ఆరోపణలపై ట్రూడో పదే పదే ప్రశ్నల వర్షం కురిపించారు, అయితే నిజ్జర్ మరణంతో భారతదేశానికి సంబంధం ఉందని నమ్మడానికి “విశ్వసనీయమైన కారణాలు” ఉన్నాయని మాత్రమే కెనడా ప్రధానమంత్రి మాట్లాడడం జరిగింది.

భారత్ vs కెనడా: 

గత జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటుకు తెలియజేశారు. 

కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధాలు ఉన్నాయని ఒట్టావా చెప్పడంతో, అమెరికా భారతీయులతో సంప్రదింపులు జరుపుతోందని, ఈ విషయంలో వాషింగ్టన్ ఎలాంటి ‘ప్రత్యేక మినహాయింపు’ ఇవ్వడం లేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా గురువారం తెలిపారు. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందని..భారత ప్రధాని నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ ఏడాది ప్రారంభంలో వైట్‌హౌస్‌లో రాష్ట్ర పర్యటన కోసం ఆతిథ్యం ఇచ్చారని.. సుల్లివన్ మరోసారి గుర్తు చేశారు.