అమెరికా రాయబారితో అలా అన్న బైడెన్

ఇండియా, అమెరికాల మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ అయితే ఇండియాను ఒక ఆపన్న హస్తం అందిస్తున్నాడు. ఇక బైడెన్ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండియా అంటే అది అంటూ ఇది చూసిన అందరూ కామెంట్ చేస్తున్నారు. బైడెన్ కరెక్టుగా చెప్పాడని అంటున్నారు.  బైడెన్ నాకు అదే చెప్పారు… G20 సదస్సులో పాల్గొన్న అమెరికా దేశ రాయబారి ఎర్సిక్ గార్సెట్టి భారత్ గురించి సంచలన […]

Share:

ఇండియా, అమెరికాల మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ అయితే ఇండియాను ఒక ఆపన్న హస్తం అందిస్తున్నాడు. ఇక బైడెన్ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండియా అంటే అది అంటూ ఇది చూసిన అందరూ కామెంట్ చేస్తున్నారు. బైడెన్ కరెక్టుగా చెప్పాడని అంటున్నారు. 

బైడెన్ నాకు అదే చెప్పారు…

G20 సదస్సులో పాల్గొన్న అమెరికా దేశ రాయబారి ఎర్సిక్ గార్సెట్టి భారత్ గురించి సంచలన విషయాలను వెల్లడించారు. తనతో బైడెన్  ఒకానొక సమయంలో ఈ విధంగా చెప్పాడంటూ అతడు కుండ బద్దలు కొట్టాడు. నాకు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే భారత్ చాలా ముఖ్యమైనదని బైడెన్ తనతో చెప్పాడని గార్సెట్టి తెలిపారు. బైడెన్ భారత్ కు చాలా విలువ ఇస్తాడని ఆయన పేర్కొన్నారు. అందుకోసమే భారత దేశ వ్యవహారాల్లో తాను చాలా స్పష్టంగా ఉంటానని వెల్లడించారు. 

అక్కడ నివసించాలనుకున్నా…

G20 సమావేశాల సందర్బంగా అమెరికా రాయబారి గార్సెట్టి సంచలన విషయం బయటపెట్టారు. తాను స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో బౌద్ద మతాన్ని అధ్యయనం చేసేందుకు బోధ్ గయలో జీవించాలని అనుకున్నాని తెలిపాడు. కానీ అందుకు రాజకీయాలు అడ్డం పడ్డాయని విచారం వ్యక్తం చేశాడు. సరిగ్గా అప్పుడే నేనే స్టూడెంట్ కౌన్సిల్ కు ఎన్నిక కావడంతో తన కోరికను అనచుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. నేను సేవ చేసేందుకు ఎన్నికయ్యాను కాబట్టి తాను భారతదేశంలో నివసించాలనే కలను చంపుకోవాల్సి వచ్చిందని గార్సెట్టి తెలిపారు. లేకపోతే  తాను భారత్ లో నివసించలేకపోయానని వెల్లడించారు. ఇక అది మాత్రమే కాకుండా ప్రెసిడెంట్ బైడెన్ తనను సేవ చేయాలని కోరినపుడు తాను తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చానని ఆయన తెలిపాడు. 

అప్పుడు చాలా సంతోషించా.. 

అమెరికా అధ్యక్షుడు పిలిచి తనను ఇండియాలో అమెరికా రాయబారిగా విధులు నిర్వర్తించమని అడిగినపుడు తాను చాలా సంతోషించానని తెలిపాడు. అందుకోసం మరో విషయం గురించి ఆలోచించకుండా తాను ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపాడు. తనకు ప్రపంచం మొత్తం మీద భారత్ చాలా ముఖ్యమని అధ్యక్షుడు బైడెన్ చెప్పినట్లు గార్సెట్టి వివరించారు. 

భారత్ ఎన్నింటిలో అభివృద్ధి చెందుతోంది… 

ప్రస్తుతం భారత్ అన్ని రంగాల్లో విపరీతంగా డెవలప్ అవుతోందని గార్సెట్టి తెలిపారు. టెక్నాలజీ అనే విషయంలో మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతుందన్నారు. అంతరిక్షంలో కూడా తాము కలిసి పని చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో గార్సెట్టి మాట్లాడుతూ.. ఇండియన్ జనాభా కూడా అమెరికాలో స్థిర పడి అనేక మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారని గార్సెట్టి తెలిపారు. 

100 డేస్ కంప్లీట్.. 

గార్సెట్టి ఇండియాలో అమెరికా రాయబారిగా నియమితులై 100 రోజులు పూర్తైంది. ఈ వంద రోజుల్లో ఆయన ఇండయా – అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఎంతో కృషి చేశారు. కేవలం సంబంధాల కోసం మాత్రమే కాకుండా అనేక విషయాల్లో ఆయన తన మార్కును చూపెట్టారు. ఇందుకు చాలా సంతోషిస్తున్నట్లు గార్సెట్టి తెలిపారు. ఈ విషయం గురించి తాను ఎంతో గర్వంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. తనకు బైడెన్ ఒక్కటే విషయం చెప్పారని ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే తాను వర్క్ చేస్తానని గార్సెట్టి ప్రకటించారు. ఎలాగైనా సరే ఇండియా- అమెరికా సంబంధాలను మరింత మెరుగుపరచడమే తన లక్ష్యమని వివరించారు.  ఆయన ఇండియాలో అమెరికా రాయబారిగా 100 రోజుల పదవీ కాలం పూర్తి చేసుకోవడంతో అంతా అభినందిస్తున్నారు.