UN స్టాటిస్టికల్ బాడీకి ఎన్నికైన భారత్ – చైనాకు ఎదురుదెబ్బ

భారతదేశం UN కమిషన్ మరియు రెండు ఇతర సంస్థలకు ఎన్నికైంది.  అయితే UN స్టాటిస్టికల్ కమిషన్‌కు ఎన్నిక అవడానికి అవసరమైన ఓట్లను పొందడంలో చైనా విఫలమైంది. UN ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ECOSOC) ద్వారా నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్ మరియు HIV/AIDS జాయింట్ UN ప్రోగ్రామ్ యొక్క కోఆర్డినేటింగ్ బోర్డుకు బుధవారం జరిగిన రెండు ఎన్నికలలో భారతదేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి కేటాయించిన సీట్ల కోసం చైనా.. భారత్‌తో పోటీ పడుతున్న స్టాటిస్టికల్ […]

Share:

భారతదేశం UN కమిషన్ మరియు రెండు ఇతర సంస్థలకు ఎన్నికైంది.  అయితే UN స్టాటిస్టికల్ కమిషన్‌కు ఎన్నిక అవడానికి అవసరమైన ఓట్లను పొందడంలో చైనా విఫలమైంది.

UN ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ECOSOC) ద్వారా నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్ మరియు HIV/AIDS జాయింట్ UN ప్రోగ్రామ్ యొక్క కోఆర్డినేటింగ్ బోర్డుకు బుధవారం జరిగిన రెండు ఎన్నికలలో భారతదేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది.

ఆసియా పసిఫిక్ ప్రాంతానికి కేటాయించిన సీట్ల కోసం చైనా.. భారత్‌తో పోటీ పడుతున్న స్టాటిస్టికల్ కమిషన్‌కు జరిగిన ఎన్నికల్లో, స్టాటిస్టికల్ కమిషన్‌‌లోని 53 ఓట్లలో 46 ఓట్లను పొందింది. దీంతో మొదటి రౌండ్‌లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని రెండు సీట్లలో ఒకదానికి భారత్‌ ఎంపికయ్యింది. ఇక చైనా మాత్రం  కేవలం19 ఓట్లు మాత్రమే పొంది.. మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే దక్షిణ కొరియా 23 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలవగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 15 ఓట్లు నాలుగో స్థానం సరిపెట్టుకుంది. ఇక నిబంధనల ప్రకారం.. 2వ స్థానానికి అవసరమైన 27 ఓట్ల మెజారిటీని ఏ దేశం పొందకపోవడం వల్ల రెండవ రౌండ్ బ్యాలెట్ ఎన్నిక అవసరం కానుంది.

మరోవైపు..  చైనా మరియు దక్షిణ కొరియాల మధ్య జరిగిన రన్‌ఆఫ్‌లో.. ఒక్కొక్కరు 25 ఓట్లు సాధించి సమంగా ఉన్నారు. ఇక నిబంధనల ప్రకారం, ECOSOC ప్రెసిడెంట్ లాచెజారా స్టోవా టైని బ్రేక్ చేయడానికి డ్రా తీయగా.. అనూహ్యంగా సియోల్ ఎంపికైంది.

భారత విదేశాంగ మంత్రి S. జైశంకర్ ట్వీట్ చేస్తూ, “ గణాంకాలు, వైవిధ్యం మరియు డెమోగ్రఫీలో భారతదేశం యొక్క నైపుణ్యంతో UN స్టాటిస్టికల్ కమిషన్‌లో స్థానం సంపాదించింది” అని అన్నారు.

ఈ ఎన్నికల్లో బలమైన పనితీరు కనబరిచిన భారత UN మిషన్ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

చాలా UN సంస్థలలో ప్రాంతాల వారీగా సీట్లు కేటాయించబడతాయి, అయితే అన్ని దేశాలు ఈ ప్రాంతాలా నుండి అభ్యర్థులను ఎంచుకోవడానికి ఓటు వేస్తాయి.

2004లో తన చివరి పదవీకాలాన్ని పూర్తి చేసి, 20 సంవత్సరాల తర్వాత అంటే.. 2024లో స్టాటిస్టికల్ కమిషన్‌లో తన పదవీకాలం ప్రారంభంతో  మళ్ళీ తిరిగి వస్తుంది.

స్టాటిస్టికల్ కమిషన్ తనని తాను “ప్రపంచంలోని సభ్య దేశాల నుండి ప్రధాన గణాంక వేత్తలను ఒకచోట చేర్చే ప్రపంచ గణాంక వ్యవస్థ యొక్క అత్యున్నత సంస్థ”గా పేర్కొంది.

ఇది జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గణాంక ప్రమాణాలను నిర్దేశిస్తుంది మరియు భావనలు మరియు పద్ధతులను అభివృద్ధి చేస్తుంది.స్టాటిస్టికల్ కమిషన్ ఎన్నికలలో చైనా పేలవమైన ప్రదర్శన కనబర్చింది. కేవలం 19 ఓట్లను పొందడం, దక్షిణ కొరియా కూడా వెనుకబడి ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన దౌత్య మరియు ఆర్థిక ప్రచారాలను చేపట్టిన చైనా.. గణాంక కమిషన్ ఎన్నికలలో పేలవమైన పనితీరును ఆశ్చర్యపరిచింది.