ఇండియా – చైనా మధ్య త‌గ్గిన వాణిజ్యం

సరిహద్దులో గొడవలు గత ఏడాది ఏమాత్రం ప్రభావం చూపలేదు :  గత కొన్నేళ్ల  నుండి సరిహద్దుల విషయం లో భారత్ మరియు చైనా కి మధ్య గొడవలు తీవ్రవంతమైన సంగతి అందరికీ తెలిసిందే. సరిహద్దుల వద్ద ఇరు దేశాలకు సంబంధించిన సైన్యాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్ప్పటికీ కూడా ఇరుదేశాల నడుమ ఎగుమతులు దిగుమతులు అనేది ఆగిపోలేదు. ఇప్పటికీ ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది. గత ఏడాది ఇరు దేశాల మధ్య […]

Share:

సరిహద్దులో గొడవలు గత ఏడాది ఏమాత్రం ప్రభావం చూపలేదు : 

గత కొన్నేళ్ల  నుండి సరిహద్దుల విషయం లో భారత్ మరియు చైనా కి మధ్య గొడవలు తీవ్రవంతమైన సంగతి అందరికీ తెలిసిందే. సరిహద్దుల వద్ద ఇరు దేశాలకు సంబంధించిన సైన్యాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్ప్పటికీ కూడా ఇరుదేశాల నడుమ ఎగుమతులు దిగుమతులు అనేది ఆగిపోలేదు. ఇప్పటికీ ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది. గత ఏడాది ఇరు దేశాల మధ్య మంచి బిజినెస్ జరిగింది , కానీ ఈ ఏడాది మాత్రం గత ఏడాది తో ఇదే టైం పీరియడ్ తో  పోలిస్తే చైనా నుండి ఇండియా కి ఎగుమతులు  0.9 శాతం తగ్గిందని చెప్తున్నారు. ఇలా చైనా – ఇండియా మధ్య ఎగుమతుల శాతం తగ్గడం ఇదే మొట్టమొదటి సారి. కేవలం ఇండియా కి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నీ దేశాలకు చైనా నుండి ఎగుమతులు 5 శాతం వరకు తగ్గిందట, చరిత్ర లో చైనా కి ఇలా జరగడం ఇదే తొలిసారి.

0.9 ఎగుమతులు తగ్గుదల :

గత ఏడాది చైనా నుండి ఇండియా కి ఎగుమతులు 57.51 బిలియన్  డాలర్ల వరకు బిజినెస్ జరిగింది. కానీ ఈ ఏడాది మాత్రం 56.53 బిలియన్ డాలర్లకు మాత్రమే జరిగింది. అంటే గత సంవత్సరం తో పోలిస్తే 0.9 శాతం తగ్గింది అన్నమాట. ఈ విషయాన్నీ స్వయంగా చైనా కస్టమ్స్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలిపింది. మరోపక్క ఇండియా నుండి చైనా కి ఎగుమతులు కూడా గత ఏడాది తో పోలిస్తే తగ్గింది. గత ఏడాది ఇండియా నుండి చైనా కి ఎగుమతుల ద్వారా జరిగిన బిజినెస్ 9.57 బిలియన్ డాలర్స్. కానీ ఈ ఏడాది మాత్రం 9.49 బిలియన్ డాలర్స్ కి పడిపోయింది. మరో విశేషం ఏమిటంటే గత ఏడాది మొదటి ఆరు నెలలు తో పోలిస్తే, ఈ ఏడాది మొదటి ఆరు నెలలు  ఇరు దేశాల మధ్య ట్రేడ్ ఊహించని స్థాయిలో పడిపోయింది. గత ఏడాది మొదటి ఆరు నెలల్లో 67 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరగగా, ఈ ఏడాది కేవలం 47 బిలియన్ డాలర్ల ట్రేడ్ మాత్రమే జరిగింది.

సరిహద్దులో ఇండియా – చైనా మధ్య జరిగిన గొడవలు ట్రేడ్ మీద గత ఏడాది ఇసుమంత కూడా చూపించకపోవడం విశేషం. ఎన్నడూ లేని విధంగా గత ఏడాది ఈ ఇరు దేశాల మధ్య 135 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరిగింది. ఇది ఆల్ టైం రికార్డు గా చెప్తున్నారు. అంతకు ముందు ఏడాది తో పోలిస్తే 8 శాతం బిజినెస్ గత ఏడాది పెరిగిందట. అలాంటిది మొట్టమొదటిసారి ఇండియా – చైనా మధ్య ట్రేడ్ తగ్గడం అనేది ఇప్పుడు పెద్ద చర్చలకు దారి తీసింది. అంతే కాకుండా చైనా దేశ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్‌కు షిప్‌లు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 16.86 శాతం తగ్గాయి. ఇక యూరోపియన్ యూనియన్‌కు ఎగుమతులు కూడా గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం 12.92 శాతం క్షీణించాయి, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కి కూడా   అంతకు ముందు సంవత్సరం తో పోలిస్తే  23.7 శాతం కి  పడిపోయి 42.7 బిలియన్లకు చేరుకుంది. కరోనా తర్వాత చైనా వాణిజ్య పరంగా ఈ స్థాయి పతనం చూడడం ఇదే తొలిసారి, మరి దీనిని ఎలా అధిగమిస్తుందో చూడాలి.