ఈ కాలిఫోర్నియా న‌గ‌రంలో ప్ర‌తి ఒక్క‌రి వ‌ద్ద విమానం

విమానం గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే అవుతుంది. విమానం అనేది ఒక లగ్జరీ వస్తువు. అటువంటి విమాన ప్రయాణం చేయడం కూడా చాలా మందికి కలలా ఉంటుంది. కానీ చాలా మంది తమ కలను నెరవేర్చుకోలేకపోతుంటారు. అందుకోసమే విమానం కనిపించగానే చాలా మంది ఫొటోలకు పోజులిస్తూ ఉంటారు. కనీసం ఇలాగైనా సరే తమ విమాన ప్రయాణ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. విమాన ప్రయాణం గురించి ఆలోచించడానికే చాలా మంది జంకుతుంటారు. కానీ కొంత మంది మాత్రం […]

Share:

విమానం గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే అవుతుంది. విమానం అనేది ఒక లగ్జరీ వస్తువు. అటువంటి విమాన ప్రయాణం చేయడం కూడా చాలా మందికి కలలా ఉంటుంది. కానీ చాలా మంది తమ కలను నెరవేర్చుకోలేకపోతుంటారు. అందుకోసమే విమానం కనిపించగానే చాలా మంది ఫొటోలకు పోజులిస్తూ ఉంటారు. కనీసం ఇలాగైనా సరే తమ విమాన ప్రయాణ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. విమాన ప్రయాణం గురించి ఆలోచించడానికే చాలా మంది జంకుతుంటారు. కానీ కొంత మంది మాత్రం అవలీలగా విమాన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంతే కాదు స్పెషల్ ఫ్లైట్లను కూడా తమ ప్రయాణాలకు వాడుతూ ఉంటారు. అటువంటి వారు పెట్టి పుట్టి ఉంటారని అనేక మంది చెబుతుంటారు. అందుకోసం చాలా లక్ ఉండాలని అంటుంటారు. జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని చాలా మంది తహతహలాడుతుంటారు. తమ కలను, కోరికను నెరవేర్చుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతూ ఉంటారు. 

ఆ ఊర్లో ఇంటికో ఎయిరో ప్లేన్ (విమానం) 

ఇలా మనలో చాలా మంది ఒక్క సారి విమాన ప్రయాణం చేసేందుకే నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఓ చోట మాత్రం ఇంటికో విమానం ఉంది. అదేంటి ఇంటికో బైకో, కారో, లేక ట్రాక్టరో అనుకుంటే ఓకే కానీ ఇంటికో విమానం అదెలా కుదురుతుందని అనుకుంటున్నారా… నిజ్జంగా ఇది నిజమండీ బాబు అమెరికాలోని కాలిఫోర్నియాలో కామెరాన్ ఎయిర్ పార్క్ అనే పేరు గల ఓ పట్టణం ఉంది. ఆ నగరంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ ఓ సొంత విమానం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. నివేదికలు చెప్పిన దాని ప్రకారం వారి వ్యక్తిగతత పనులు మరియు వ్యాపారం కోసం ప్రజలు తమ విలాసవంతమైన వ్యక్తిగత విమానాలను ఉపయోగిస్తారని వెల్లడైంది. ఈ నివాస పట్టణాలను ఫ్లై-ఇన్ కమ్యూనిటీలు అని కూడా పిలుస్తుంటారు. పలు రికార్డుల డేటా ప్రకారం.. ఈ నివాస ఎయిర్‌ పార్క్ లు లేదా కామెరాన్ ఎయిర్‌ పార్క్ లు లేదా ఫ్లై-ఇన్ కమ్యూనిటీలు అనేవి ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి. ఆ ప్రైవేట్ వ్యక్తుల అనుమతి అనుమతి లేకుండా ఆస్తిని ఉపయోగించుకోవడానికి బయటి వ్యక్తులకు అనుమతి ఉండదు. ఎవరైనా సరే వారి ఆస్తిని ఉపయోగించుకోవాలని అనుకుంటే మొదట వారి అనుమతి తీసుకుని ఉపయోగించుకోవాలి. లేదా కొంత మందిని అక్కడి యజమానులు ఆహ్వానిస్తుంటారు. ఇలా ఆహ్వానిస్తే బయటి వ్యక్తులు ఆస్తులను ఉపయోగించుకోవచ్చు. 

యూ ట్యూబర్ చొరవతో వెలుగులోకి…. 

ఇక్కడి సిటీలో ఇంటికో సెపరేట్ విమానం ఉందనే విషయం బయటకు వచ్చింది మాత్రం డెన్నిస్ నిక్సన్ అనే యూ ట్యూబర్ వల్లే. ఇతడు కామెరాన్ ఎయిర్ పార్క్ సిటీకి సంబంధించి ఒక వీడియోను అప్ లోడ్ చేశాడు. దీంతో అందరికీ ఆ సిటీలో విమానాలు ఉన్నాయనే విషయం తెలిసి వచ్చింది. ఇక విమానం అంటే అదేదో బండిని పార్క్ చేసినట్లు సింపుల్ గా పార్క్ చేసేందుకు కుదరదు. దానికో స్పెషల్ సెటప్ ఉంటుంది. అక్కడి సిటీలో కూడా విమానాల పార్కింగ్ కోసం కామెరాన్ ఎయిర్‌ పార్క్‌ లో ఎయిర్‌ క్రాఫ్ట్ హ్యాంగర్‌ లు నిర్మించారు. ఎయిర్‌ క్రాఫ్ట్ హ్యాంగర్ యొక్క ముఖ్య ఉద్దేశం విమానాలను పార్క్ చేసేందుకు స్థలాన్ని అందించడం. పైలట్ లైసెన్స్ మరియు విమానాన్ని నడపడానికి పూర్తి అవగాహన ఉంటే తప్ప ఎవరికీ విమానం నడిపే అధికారం లేదు. కామెరాన్ ఎయిర్‌ పార్క్‌లో నివసిస్తున్న మరియు విమానాలను నడుపుతున్న వ్యక్తులు వృత్తి రీత్యా రిటైర్డ్ మిలటరీ పైలట్‌ లట. ఈ విషయం పలు నివేదికల్లో వెల్లడైంది. కావున వారికి విమానం నడపడం తప్పనిసరిగా వస్తుంది. అందుకోసమే వారు చాలా అలవోకగా విమానాలను నడుపుతూ ఉంటారు. పలు రికార్డుల చెప్పిన వివరాల ప్రకారం కామెరాన్ ఎయిర్‌ పార్క్ అనే సిటీ 1963లో నిర్మించబడింది. ఈ సిటీలో మొత్తం 124 గృహాలు ఉన్నాయి. కామెరాన్ ఎయిర్‌ పార్క్ లాగా, ఫ్లోరిడాలో స్ప్రూస్ క్రీక్ అని పిలువబడే మరొక ఎయిర్‌ పార్క్ ఉంది. ఈ పార్క్‌ లో ప్రైవేట్ జెట్‌ ల నుంచి చారిత్రాత్మక విమానాల వరకు 650 విమానాలు ఉన్నాయి. స్ప్రూస్ క్రీక్‌ లో దాదాపు 5,000 మంది నివాసితులు, 1,300 గృహాలు మరియు 700 హాంగర్లు ఉన్నాయి. USలో మొత్తం 426 నివాస ఎయిర్‌ పార్క్‌లు ఉన్నట్లు పలు నివేదికల ద్వారా వెల్లడైంది.