కాశ్మీర్ రోడ్డు మ్యాప్‌తో ఇమ్రాన్ ఖాన్‌ శాంతియుత ప్రణాళిక

పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదుల మద్దతులను నిలిపివేస్తూ, ఉగ్రవాద గ్రూపులపై సరైన చర్యలు తీసుకుంటున్నట్లు పాకిస్తాన్ చెప్పిన మాటలను పదే పదే భారత్ గుర్తు చేయడం జరిగింది. దీని గురించి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, పాకిస్తాన్ మరియు భారతదేశ మధ్య శాంతి ప్రతిపాదనపై పాకిస్తాన్ ఎప్పటికీ కృషి చేస్తుందని, దీనికి నిదర్శనం న్యూఢిల్లీ అనౌన్స్ చేసిన కాశ్మీర్’ రోడ్ మ్యాప్’ అంటూ వెల్లడించారు. ప్రముఖ అట్లాంటిక్ కౌన్సిల్‌ US- ఆధారిత థింక్ ట్యాంక్కు ఖాన్ […]

Share:

పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదుల మద్దతులను నిలిపివేస్తూ, ఉగ్రవాద గ్రూపులపై సరైన చర్యలు తీసుకుంటున్నట్లు పాకిస్తాన్ చెప్పిన మాటలను పదే పదే భారత్ గుర్తు చేయడం జరిగింది. దీని గురించి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, పాకిస్తాన్ మరియు భారతదేశ మధ్య శాంతి ప్రతిపాదనపై పాకిస్తాన్ ఎప్పటికీ కృషి చేస్తుందని, దీనికి నిదర్శనం న్యూఢిల్లీ అనౌన్స్ చేసిన కాశ్మీర్’ రోడ్ మ్యాప్’ అంటూ వెల్లడించారు.

ప్రముఖ అట్లాంటిక్ కౌన్సిల్‌ US- ఆధారిత థింక్ ట్యాంక్కు ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ ప్రతిపాదనకు అప్పటి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బజ్వా గారి మద్దతు ఉందని, 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్నప్పటికీ పాకిస్థాన్ ముందుకు సాగిందని ఆయన చెప్పుకొచ్చారు.

శాంతియుత ప్రణాళికపై ఇమ్రాన్ ఖాన్ మాటల్లో: 

LOC దగ్గర జరిగిన కాల్పులు, వాణిజ్య సంబంధిత చర్చలు గురించి భారత ప్రధానమంత్రి సందర్శన, వీటితో సహా మరెన్నో విషయాల్లో బాజ్వా రూపొందించిన శాంతి ప్రణాళిక ఎంతవరకు పని చేస్తుంది అని అడిగిన ప్రశ్నకు,’ మిలటరీ వారి ద్వారా సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టడంఫై ఆయనకు పెద్దగా నమ్మకం లేదని’ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.

” వాణిజ్య చర్చల గురించి నాకు గుర్తులేదు. కానీ నాకు తెలిసినంతవరకు భారతదేశం ద్వారా కొంత రాయితీ కల్పించాలి. అంతేకాకుండా, కాశ్మీర్కి రోడ్డు మ్యాప్ కూడా అందించాలి. తర్వాత కచ్చితంగా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కి రావాలి. కానీ ఇవన్నీ అనుకున్నప్పటికీ, ఇందులో ఒకటి కూడా ఇప్పటివరకు ముందుకు జరగలేదు” అంటూ ఇమ్రాన్ ఖాన్ మాటల్లో వెల్లడించారు.

ఖాన్ మాటలకు భారత్ ఎలా స్పందించింది: 

ఇటీవల పాకిస్తాన్ నివేదికల ప్రకారం, బజ్వా అటువంటి శాంతి ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చినట్లు వెల్లడించాయి. అందులో భారత ప్రధాన మంత్రి పాకిస్తాన్ పర్యటన కూడా నిలిచింది. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత్ నుండి ఎటువంటి స్పందన లేనట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదుల మద్దతులను నిలిపివేస్తూ, ఉగ్రవాద గ్రూపులపై సరైన చర్యలు తీసుకున్నట్లు పాకిస్తాన్ చెప్పిన మాటలను పదే పదే భారత్ గుర్తు చేయడం జరిగింది.

అంతేకాకుండా భారతదేశం మరియు పాకిస్తాన్ భద్రత అధికారుల మధ్య అనేక రహస్య ఛానల్ ద్వారా చర్చలు జరిగిన తర్వాత ఫిబ్రవరి 2021 లో ‘ఎల్ ఓ సి’ పై 2003 కాల్పులను ఇరువైపుల నుండి మళ్లీ పునరుద్దించబడింది. ఈ క్రమంలోనే కాశ్మీర్ హోదాలో మార్పుపై పాకిస్తాన్ మరియు భారత్ మధ్య దౌత్య సంబంధాలను పాకిస్తాన్ తగ్గించుకుంది. దీనికి సంబంధించి న్యూఢిల్లీలో హైకమిషనర్‌ను నియమించుకోకూడదని నిర్ణయించుకుంది.

దీనికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ,” ఇంక మేమేం చేయాలి చెప్పండి? విధికి తలవంచాలా? లేదంటే కాశ్మీర్ ప్రజలకు అన్యాయం చేయాలా? నిజానికి నేను చాలా ప్రయత్నించాను, భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య సంబంధం ఏర్పరుచుకోవాలని ఎంతగానో కోరుకున్నాను. మీరు ఒక్క అడుగు మా ముందుకు వేస్తే, మేము రెండు అడుగులు మీ ముందుకు వేస్తాం. ఇదే నేను చెప్పదలుచుకున్నాను” అంటూ ఆయన మనసులో మాట బయటపెట్టారు. 


అంతేకాకుండా ఆయన జనరల్ బజ్వా మాటలను ఇమ్రాన్ ఖాన్ కొట్టివేశారు. తమని తాము బలహీనులుగా పేర్కొనడం మంచి విషయం కాదని, అంతేకాకుండా, ఏదైనా సమస్యను పరిష్కరించుకోవడానికి చర్చలు సరైన మార్గం అని, ఒకవేళ చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకో లేకపోతే, మళ్లీ మరోసారి ప్రయత్నించి చూడాలి గానీ, యుద్ధం అనేది సరైన మార్గం కాదని పాకిస్తాన్ మాజీ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.