లాహోర్ కోర్టులో హాజరయిన ఇమ్రాన్ ఖాన్

ఇటీవలే సీనియర్ ఆర్మీ అధికారులపై “అనుచితమైన పదజాలం” ఉపయోగించిన కేసులో పాకిస్థాన్ బహిష్కృత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం లాహోర్ హైకోర్టు (ఎల్‌హెచ్‌సి) ముందు హాజరై ఏప్రిల్ 26 వరకు ప్రొటెక్టివ్ బెయిల్ పొందారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్, తన ప్రసంగంలో “సీనియర్ మిలిటరీ (ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్) అధికారులపై అనుచిత పదజాలం ఉపయోగించి, వారి కుటుంబాలను ప్రమాదంలోకి నెట్టారని పోలీసులు ఆరోపించారు. దీంతో ఏప్రిల్ 6న ఇస్లామాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.  […]

Share:

ఇటీవలే సీనియర్ ఆర్మీ అధికారులపై “అనుచితమైన పదజాలం” ఉపయోగించిన కేసులో పాకిస్థాన్ బహిష్కృత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం లాహోర్ హైకోర్టు (ఎల్‌హెచ్‌సి) ముందు హాజరై ఏప్రిల్ 26 వరకు ప్రొటెక్టివ్ బెయిల్ పొందారు.

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్, తన ప్రసంగంలో “సీనియర్ మిలిటరీ (ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్) అధికారులపై అనుచిత పదజాలం ఉపయోగించి, వారి కుటుంబాలను ప్రమాదంలోకి నెట్టారని పోలీసులు ఆరోపించారు. దీంతో ఏప్రిల్ 6న ఇస్లామాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇమ్రాన్ ఖాన్‌ను ఏప్రిల్ 26 వరకు అరెస్ట్ చెయ్యకుండా  ప్రొటెక్టివ్ బెయిల్ మంజూరు చేసిన లాహోర్ హైకోర్టు..  బెయిల్ పొడిగింపు కోసం ఇస్లామాబాద్‌లోని సంబంధిత కోర్టుకు వెళ్లాలని అతనికి సూచించింది.

భారీ సెక్యూరిటీ మధ్య లాహోర్ హై కోర్టు ఎదుట హాజరయ్యారు పాక్ మాజీ ప్రధాని

ఇస్లామాబాద్ పోలీసులు తనపై అనవసర కేసు నమోదు చేశారని జస్టిస్ అలీ బాకీర్ నజ్ఫీ కి తెలిపిన ఇమ్రాన్.. తనకు న్యాయం చేయాలనీ జడ్జిని కోరారు.  దీంతో ఇమ్రాన్ ఖాన్  అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ ప్రొటెక్టివ్  బెయిల్ మంజూరు చేశారు” అని కోర్టు అధికారి ఒకరు తెలిపారు.

“న్యాయమూర్తి అతనికి ఏప్రిల్ 26 వరకు ప్రొటెక్టివ్ బెయిల్ మంజూరు చేశారు, అదే విధంగా బెయిల్ పొడిగింపు కోసం ఇస్లామాబాద్‌లోని సంబంధిత కోర్టుకు వెళ్లాలని ఆదేశించారు” అని ఆ అధికారి తెలిపారు.

ఇక  కోర్టు  ప్రాంగణంలో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం..  సుప్రీంకోర్టు ఆదేశాలను బహిరంగంగా ధిక్కరించడం, ముఖ్యంగా పంజాబ్‌లో ఎన్నికలు నిర్వహించకపోవడం వంటివి చేసి దేశానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టిందని ఆరోపించారు.

“ఇటువంటి చర్యల ద్వారా, ప్రపంచంలో.. పాకిస్తాన్ ప్రతిష్టకు భంగం కలుగుతోంది అని మాజీ ప్రధాని అన్నారు.

ఈ సంకీర్ణ ప్రభుతం ఎక్కువ కాలం కొనసాగాలని ఎన్నికలకు వెళ్లడం లేదని, రాజ్యాంగం ప్రకారం, అసెంబ్లీని రద్దు చేసి 90 లోపు ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. పాక్ చరిత్రలోనే చరిత్రలో ఇది ఒక “ఫాసిస్ట్ ప్రభుత్వం” అని కూడా విమర్శించారు. ఇది సైనిక నియంత్రణలో ఉన్న వ్యక్తులచే స్థాపించబడిందని ఆరోపించారు.

ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం..  పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్) కార్యకర్తలకు హక్కులకు భంగం కలిగిస్తోందని, ఇప్పటివరకు, 3000 మందికి పైగా PTI కార్యకర్తలను అరెస్ట్ చేసి బంధించారని ఆరోపించారు.

కాగా.. గురువారం, లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు (ATC) మూడు ఉగ్రవాద కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు ముందస్తు బెయిల్‌ను మే 4 వరకు పొడిగించింది.

మార్చి 18న, తోషాఖానా అవినీతి కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఖాన్ వచ్చినప్పుడు ఇస్లామాబాద్ జ్యుడీషియల్ కాంప్లెక్స్ వెలుపల తీవ్ర ఘర్షణలు జరిగాయి.

PTI కార్యకర్తలు మరియు పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో సుమారు 25 మందికి పైగా భద్రతా సిబ్బంది గాయపడ్డారు. దీనితో ఆగ్రహించిన  లాహోర్ పోలీసులు.. ఇమ్రాన్ మరియు అతని వందల మంది పార్టీ కార్యకర్తలపై మూడు తీవ్రవాద కేసులు నమోదు చేశారు.