భార్య కోసం 12 లక్షల సన్ ఫ్లవర్స్ బహుమతి

ఎంతోమంది ప్రేమికులు తమ ప్రేమకు గుర్తుగా తమ ప్రేమికులకు ఎన్నో రకాల బహుమతులు ఇవ్వడాన్ని చూసాం. షాజహాన్ తన ప్రియురాలు కోసం తాజ్ మహల్ ని కట్టించాడు. అదేవిధంగా రోమియో జూలియట్ ప్రేమ కథలు విన్నాము. కానీ, పెళ్లయిన 50 సంవత్సరాల తరువాత కూడా తన భార్యని ఎంతో ప్రేమగా చూసుకుంటూ, 50వ పెళ్లిరోజు సందర్భంగా ఒక అరుదైన బహుమతిని తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు భర్త.  పెళ్లిరోజుకి సరైన బహుమతి:  పెళ్లయిన భార్య భర్తలు ఒకరికొకరు […]

Share:

ఎంతోమంది ప్రేమికులు తమ ప్రేమకు గుర్తుగా తమ ప్రేమికులకు ఎన్నో రకాల బహుమతులు ఇవ్వడాన్ని చూసాం. షాజహాన్ తన ప్రియురాలు కోసం తాజ్ మహల్ ని కట్టించాడు. అదేవిధంగా రోమియో జూలియట్ ప్రేమ కథలు విన్నాము. కానీ, పెళ్లయిన 50 సంవత్సరాల తరువాత కూడా తన భార్యని ఎంతో ప్రేమగా చూసుకుంటూ, 50వ పెళ్లిరోజు సందర్భంగా ఒక అరుదైన బహుమతిని తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు భర్త. 

పెళ్లిరోజుకి సరైన బహుమతి: 

పెళ్లయిన భార్య భర్తలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. తమ ప్రేమకు గుర్తుగా, ప్రతి ఏటా పెళ్లిరోజు జరుపుకుంటూ ఒకరికి ఒకరు ఎన్నో బహుమతులు ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ 50 సంవత్సరాల కూడా మొదటి సంవత్సరం పెళ్లి రోజున గుర్తు చేసుకున్న దంపతులు తమ పెళ్లిరోజును ప్రత్యేకంగా మార్చుకున్నారు. తన భార్య కోసం, ఆమెకు ఎంతో ఇష్టమైన బహుమతిని ఇవ్వాలనుకున్నాడు భర్త. అయితే అమెరికాకు చెందిన భార్య భర్తలు ప్రస్తుతం వారు జరుపుకుంటున్న 50వ పెళ్లిరోజును ప్రపంచానికి వినూత్నంగా అందించారు. 

అమెరికాకు చెందిన ఒక రైతు విల్సన్అనే ఆయన తన భార్య రేణి కోసం ఒక చక్కని బహుమతిని ఎంచుకున్నాడు. వారు ప్రస్తుతం జరుపుకోబోతున్న వివాహ వార్షికోత్సవంలో తన భార్యకు విల్సన్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాడు. తన భార్యకు ఎంతో ఇష్టమైన సన్ ఫ్లవర్స్ తోట లోని 12 లక్షల పువ్వులను బహుమతిగా ఇచ్చాడు. 

అయితే అత్తమ్మ పెళ్లి వార్షికోత్సవం దగ్గర పడుతున్న తరుణంలో, విల్సన్ తన కొడుకుతో పాటు 80 ఎకరాల పొలంలో సన్ఫ్లవర్ మొక్కలను నాటాడు. అంతేకాకుండా వార్షికోత్సవం రోజు వరకు కూడా తన భార్యకు ఈ విషయాన్ని చెప్పకుండా, పెళ్లి రోజున సర్ప్రైజివాలనుకున్నాడు. అయితే పెళ్లి రోజున తన భార్యను 80 ఎకరాలలో పెంచిన సన్ఫ్లవర్ తోటలోకి తీసుకుని వెళ్ళాడు. ఇంకేముంది తన భార్యకు ఎంతో ఇష్టమైన కొన్ని లక్షల సన్ఫ్లవర్లను చూసి భార్య ముఖంలో సంతోషాన్ని చూసాడు. తన భార్య కోసం ప్రపంచంలో ఎవ్వరు ఊహించని విధంగా ఒక చక్కని బహుమతిని ఎంచుకున్నాడు విల్సన్. అంతే కాదు, ఈ బహుమతితో తన భార్య మీద ఉన్న ప్రేమను మరింత చాటాడు. 

కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు: 

అయితే చాలామంది 50వ పెళ్లిరోజు సందర్భంగా భార్య కోసం ఒక భర్తగా 80 ఎకరాలలో పండించిన, పన్నెండు లక్షలకు పైగా సన్ఫ్లవర్ పువ్వులను చూసి నేటిజన్లో తమ శైలిలో కామెంట్లు పెడుతున్నారు. అసలు సిసలు ప్రేమంటే ఇలా ఉండాలి అని, పెళ్లయిన వాళ్లు కలకాలం అన్యోన్యంగా ఉండాలంటే ఇలాంటి భార్యాభర్తల్ని చూసి నేర్చుకోవాలి అంటూ, నిజమైన ప్రేమికుడు అంటే ఈయనే అంటూ, ఒకరి విలువలను మరొకరు అర్థం చేసుకున్నప్పుడే పెళ్లి జీవితం బాగుంటుంది అంటూ, వీరిద్దరూ కలకాలం ఇలాగే ఉండాలి అంటూ భార్యాభర్తలను చూసి నేటిజెన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ బంధం కలకాలం ఉంటుంది అని మరికొందరు, ప్రేమగా భర్త ఏం చేసినా భార్య నవ్వుతూ యాక్సెప్ట్ చేస్తుంది అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరిగిన సంఘటనలో భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం గురించి అందరికీ చాలా బాగా అర్థమవుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అంటే ఇలా ఉండాలి అంటూ ప్రపంచానికి చాటి చెప్పారు ఈ భార్య భర్తలు.