యావజ్జీవ శిక్ష విధించిన ఆకలితో ఉన్న జడ్జ్ 

కోర్టు తీర్పులు కొన్ని కొన్ని చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి. నిందితులకు శిక్ష విధించే సమయంలో న్యాయమూర్తులు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. కానీ అనుకోకుండా ఒక జడ్జ్ బాగా ఆకలితో ఉండడం వల్ల తనకి తెలియకుండానే ఒక నిందితుడికి, పెరోల్ లేనటువంటి యావజీవ శిక్ష విధించాడట. ఈ విషయాన్ని తనే స్వయంగా భోజనం చేస్తూ తీసిన వీడియో ద్వారా వెల్లడించినట్లు, ఒక పోస్టు వైరల్ గా మారింది. కానీ ఎంతో కఠినమైన నేరస్తుడు అయితే తప్పిస్తే, […]

Share:

కోర్టు తీర్పులు కొన్ని కొన్ని చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి. నిందితులకు శిక్ష విధించే సమయంలో న్యాయమూర్తులు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. కానీ అనుకోకుండా ఒక జడ్జ్ బాగా ఆకలితో ఉండడం వల్ల తనకి తెలియకుండానే ఒక నిందితుడికి, పెరోల్ లేనటువంటి యావజీవ శిక్ష విధించాడట. ఈ విషయాన్ని తనే స్వయంగా భోజనం చేస్తూ తీసిన వీడియో ద్వారా వెల్లడించినట్లు, ఒక పోస్టు వైరల్ గా మారింది. కానీ ఎంతో కఠినమైన నేరస్తుడు అయితే తప్పిస్తే, నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరగదు.

ఆకలితో ఉన్న జడ్జి వేసిన శిక్ష: 

వైరల్ గా మారిన ఒక వీడియోలో, నల్లకోటు ధరించిన ఒక జడ్జ్ తన భోజనాన్ని తింటూ ఏదో గుర్తొచ్చినట్లు మొఖం పెడతాడు. నిజానికి ఆ సమయానికి తనకి చాలా ఆకలి వేసిందని, అనుకోకుండా లంచ్ బ్రేక్ ముందు జరిగిన వాదనలో ఒక నిందితుడికి తెలియకుండా, పెరోల్ లేనటువంటి యావజ్జీవ శిక్ష విధించాను అంటూ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ విషయాన్ని చూసిన నెటిజన్లు తమవైపు నుంచి వింతగా కామెంట్లు పెడుతున్నారు. చాలామంది ఈ విషయాన్ని హాస్యాస్పదంగా తీసుకున్నప్పటికీ, మరి కొంతమంది మాత్రం, మనం ఎక్కువగా ఆకలిగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేమని, అందుకే కొన్ని సందర్భాలలో నిర్ణయాలు తీసుకోకూడదని స్పందిస్తున్నారు. 

చాలామంది న్యాయమూర్తులు లంచ్ కి ముందు, లంచ్ తర్వాత తీసుకునే నిర్ణయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని కొంతమంది నేటిజన్లు తమ వాదనను వినిపిస్తున్నారు. మరికొంతమంది మాత్రం జడ్జి తీసుకున్న నిర్ణయం మీద మండిపడుతున్నారు. ఏది ఏమైనా వీడియో వైరల్ గా మారిన తర్వాత, వీడియో కి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోకి సంబంధించి చాలా మంది అభిప్రాయాలు చెబుతున్నప్పటికీ, వైరల్ గా మారిన వీడియోలో ఉన్న వ్యక్తి నిజమైన జడ్జ్ ఆ కాదా, అతను జోక్ చేస్తున్నాడా?నిజం చెప్తున్నాడా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. 

బేబీ సిట్ట‌ర్‌కు 690 ఏళ్ల యావజ్జీవ శిక్ష..!

34 ఏళ్ల ఒక కుర్రాడికి ఏకంగా 690 ఏళ్ల యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. ఆరెంజ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ అందించిన సమాచారం ప్రకారం, అతను 16 మంది అబ్బాయిలను లైంగికంగా వేధించినందుకు, అంతేకాకుండా మరొక అబ్బాయికి అశ్లీల చిత్రాలను చూపించినందుకుగాను, దోషిగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. 

కోస్టా మెసాకు చెందిన మాథ్యూ జక్ర్‌జెవ్‌స్కీ 34 నేరాలలోగాను దోషిగా నిర్ధారించడం జరిగింది, అయితే ఇందులో 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్‌లతో 27 అసభ్యకరమైన లైంగిక చర్యలకు పాల్పడినట్లు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల నోటితో అసభ్యకరమైన చర్యలకు పాల్పడినట్లు, చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా నిర్వహించిన క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా చిన్న పిల్లలను టార్గెట్ చేసి, వాళ్ళని పోర్నోగ్రఫీ చేసే విధంగా ప్రేరేపించినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు, మాథ్యూ జక్ర్‌జెవ్‌స్కీ నేరాల చిట్టి చూసి వళ్ళు గగరపురిచిందని చెప్పుకొచ్చారు. మొత్తం 34 నేరాలు నిర్ధారణ జరిగింది కాబట్టి ,ఇప్పుడు తనకి 690 ఏళ్ల యావజ్జీవ పడే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

తల్లితండ్రులు ఉద్యోగాల కోసం, ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తమ పిల్లలను సంరక్షించేందుకు బేబీ సిట్టర్ ఎంచుకున్న క్రమంలో అస్సలు పొరపాటు జరగకుండా చూసుకోవాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇప్పుడు జరిగిన విషయం తీసుకున్నట్లయితే, పిల్లలను ఒక రక్షకుడి చేతిలో ఉంచి ధైర్యంగా తమ పనులను చేసుకుంటున్నాం అనుకున్న తల్లిదండ్రులకు, నిజానికి తమ పిల్లలు ఒక రాక్షసుడు చేతిలో బలైపోతున్నారని తెలుసుకోలేకపోయారని, కేవలం కొంతమంది పిల్లలు ధైర్యం చేసి తమకు జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టిన నిజాలు కారణంగానే ఇప్పుడు చాలామంది పిల్లలను కాపాడగలిగామని, ఇటువంటి ధైర్య సాహసాలు ఉన్న పిల్లల తల్లితండ్రుల పెంపకాన్ని గురించి గర్వపడుతున్నామని మాట్లాడారు జిల్లా అటార్నీ టాడ్ స్పిట్జర్.