Mass Shooting In US: అమెరికాలో కాల్పుల కలకలం..!

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి మాస్ షూటింగ్ (US Mass Shooting) ఘటన చోటు చేసుకుంది.  ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏకంగా 22 మంది చనిపోయారు. ఈ దారుణం మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ (Lewiston) నగరంలో బుధవారం రాత్రి జరిగింది. బౌలింగ్ యాలీ, మరో బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు(Firing) జరిపాడు. ఈ కాల్పుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. […]

Share:

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి మాస్ షూటింగ్ (US Mass Shooting) ఘటన చోటు చేసుకుంది.  ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏకంగా 22 మంది చనిపోయారు. ఈ దారుణం మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ (Lewiston) నగరంలో బుధవారం రాత్రి జరిగింది. బౌలింగ్ యాలీ, మరో బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు(Firing) జరిపాడు. ఈ కాల్పుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

అమెరికాలోని లెవిస్టన్ (Lewiston) నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విచక్షణారహితంగా ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని 40 ఏళ్ల వయస్సున్న రాబర్ట్ కార్డ్ (Robert Card) గా పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన అనంతరం పారిపోయిన ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 40 ఏండ్ల వ‌య‌సున్న రాబ‌ర్ట్ కార్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌(Military Officer)గా ప‌ని చేసి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. గ‌తంలో గృహ హింస కేసులో అరెస్టు అయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతూ చికిత్స తీసుకున్నాడు. వినికిడి స‌మ‌స్య‌తో కూడా ఇబ్బంది ప‌డుతున్నట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. సాకోలోని మిల‌ట‌రీ ట్రైనింగ్ బేస్‌పై దాడి చేస్తాన‌ని హెచ్చ‌రించాడు. మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న రాబ‌ర్ట్ కార్డ్‌(Robert Card)ను రెండు వారాల పాటు ఆస్ప‌త్రిలో ఉంచి చికిత్స అందించారు. ఇక బుధ‌వారం రాత్రి లెవిస్ట‌న్‌లోని బౌలింగ్ ఆల్లేతో పాటు రెస్టారెంట్ బార్ వ‌ద్ద రాబ‌ర్ట్ కార్డ్ కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

కారణం తెలియలేదు..

అమెరికాలోని ఈశాన్య రాష్ట్రం మెనేలో ఈ లెవిస్టన్ నగరం ఉంది. ఈ నగరంలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో ఉన్న బౌలింగ్ అలీలో రాబర్ట్ కార్ట్ ఈ కాల్పులకు (US mass shooting) తెగబడ్డారు. అనంతరం, పక్కనే ఉన్న వాల్ మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. రాబర్ట్ కార్డ్ ఈ కాల్పులు జరపడానికి కారణం తెలియరాలేదు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సంఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా, రాబర్ట్ కార్డ్ (Robert Card) తో ప్రమాదం పొంచి ఉందని, అతడి వద్ద ఆయుధం ఉందని, అందువల్ల పౌరులు ఇళ్లల్లోనే ఉండాలని పోలీసులు సూచించారు. వ్యాపారులు తమ వ్యాపారాలను నిలిపివేసి, షట్టర్స్ క్లోజ్ చేసుకోవాలని సూచించారు. 

ఆ కాల్పులకు పాల్పడిన రాబర్ట్ కార్డ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతడి వద్ద సెమీ ఆటోమేటిక్ గన్ ఉన్నట్లు తెలిపారు. అతని ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు. పోలీసులు షేర్ చేసిన ఫోటోలో పొడవాటి స్లీవ్ షర్ట్, జీన్స్ ధరించి, గడ్డం కలిగిన వ్యక్తి ఫైరింగ్ రైఫిల్ పట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ కాల్పుల్లో జనం గాయపడ్డారని లెవిస్టన్‌లోని సెంట్రల్ మైనే మెడికల్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చేసింది. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. లెవిస్టన్.. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీలో పోర్ట్‌ల్యాండ్‌కు ఉత్తరాన 35 మైళ్ల దూరంలో ఉంది.

అధ్యక్షుడి స్పందన

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మెనే రాష్ట్ర గవర్నర్ జానెట్ మిల్స్(Janet Mills) తో, ఇద్దరు సెనేటర్లతో మాట్లాడారు. ఫెడరల్ నుంచి అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. గత సంవత్సరం మే 22 న కూడా అమెరికాలో మాస్ షూటింగ్ (US mass shooting) ఘటన చోటు చేసుకుంది. అప్పుడు టెక్సస్ లోని ఉవాల్డేలో ఉన్న ఒక ఎలమెంటరీ పాఠశాలలో ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపి 19 మంది ప్రాణాలు తీశాడు. కొరోనా అనంతరం అమెరికాలో మాస్ షూటింగ్ ఘటనలు పెరిగాయి.