హమ్మస్ ఆయుధాల సరఫరా రహస్యం

ప్రపంచంలో ఏ మూల చూసిన సరే హింస చాయలు కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఒకపక్క ఇప్పటికే రష్యా యుక్రెన్ దేశాల మధ్య ఎన్నో నెలలుగా హోరాహోరీగా సాగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతున్న వేళ మరొక యుద్ధం మొదలైంది. ఇజ్రాయిల్ దేశం మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డ హమ్మస్, తన బాంబులతో దాడి చేసింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఉంటున్న వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని మరియు స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని కోరింది. ఇదిలా […]

Share:

ప్రపంచంలో ఏ మూల చూసిన సరే హింస చాయలు కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఒకపక్క ఇప్పటికే రష్యా యుక్రెన్ దేశాల మధ్య ఎన్నో నెలలుగా హోరాహోరీగా సాగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతున్న వేళ మరొక యుద్ధం మొదలైంది. ఇజ్రాయిల్ దేశం మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డ హమ్మస్, తన బాంబులతో దాడి చేసింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఉంటున్న వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని మరియు స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని కోరింది. ఇదిలా ఉండగా, కట్టుదిట్టమైన బోధర్ నిబంధనలు ఉన్నప్పటికీ హమ్మస్కు ఆయుధాలు సరఫరా ఆగలేదు. దీని వెనుక రహస్యం చాలా పకడ్బందీగా ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 

హమ్మస్ ఆయుధాల సరఫరా రహస్యం : 

గాజా స్ట్రిప్‌ను పూర్తిగా ముట్టడించాలని ఆదేశించింది. హమాస్‌ను పూర్తిగా నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేసింది ఇజ్రాయిల్. పాలస్తీనా సమూహం హమాస్ గాజా స్ట్రిప్‌ను కట్టుదిట్టమైన నిబంధనలతో నియంత్రిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి చాలా చిన్న భూభాగం ఇది, ఇక్కడ ఢిల్లీలో దాదాపు 1/4వ వంతు విస్తీర్ణంలో దాదాపు 2.3 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. 2005లో పూర్తిగా ఉపసంహరించుకున్నప్పటికీ, ఈ ప్రాంతంలోని హమాస్‌కు ఆయుధాల సరఫరాపై గట్టి నిఘా ఉంచేందుకు గాజా స్ట్రిప్‌లోని అన్ని సరిహద్దులను ఇజ్రాయెల్ నియంత్రిస్తుంది. ఈజిప్ట్, ఇజ్రాయెల్ 365 చదరపు కిలోమీటర్ల భూభాగంలో కేవలం రెండు సరిహద్దుతో, గాజాలో ప్రజల కదలికను కఠినంగా నియంత్రిస్తున్న క్రమం కనిపిస్తుంది. 

ఆయుధ స్మగ్లర్లు మధ్యధరా సముద్రం ఒడ్డున ఆయుధాలను పడేయడం జరుగుతుంది,. తరువాత ఒక ప్రణాళిక ప్రకారం ఈ ఆయుధాలు హమాస్‌కు సరఫరా చేయబడతాయి. ఇజ్రాయెల్ నౌకాదళం సముద్ర తీరంలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉన్నప్పటికీ, ఆయుధ సరఫరాదారులు, అమ్మ సమూహానికి ఆయుధాలను సరఫరా చేయడంలో విజయం సాధించారు. గాజా స్ట్రిప్ రెండు వైపుల నుండి ఇజ్రాయెల్ చుట్టూ ఉంది. ఇక్కడ ఇజ్రాయెల్ నావికాదళం ప్రజల కదలికను 12 నాటికల్ మైళ్ల వరకు మాత్రమే పరిమితం చేస్తుంది. ఆయుధాల స్మగ్లర్లు ఆయుధాలను సరఫరా చేసేందుకు సొరంగాలను ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగిస్తున్నారు. గాజా ఈజిప్ట్‌తో సరిహద్దును పంచుకుంటుంది మరియు ఈ ప్రాంతానికి ఆయుధాలను అందించడానికి సొరంగాలు తవ్వించారు కూడా. ఇరాన్, సిరియా నుండి ఫజ్ర్-3, ఫజర్-5, మరియు ఎమ్-302 రాకెట్లు వంటి ఆయుధాలను పంపడానికి సొరంగం నెట్‌వర్క్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. 

తాలిబాన్ కనెక్షన్: 

యుఎస్-నిర్మిత ఆయుధాలను హమాస్ ఉపయోగిస్తున్నాయని చాలా నివేదికలు పేర్కొన్నాయి. వాటిని ఆఫ్ఘనిస్తాన్ నుండి తాలిబాన్ సరఫరా చేస్తుంది. 2021లో, యుఎస్ ఆఫ్ఘనిస్తాన్‌లో తన కార్యకలాపాలను ముగించింది.. దేశంపై నియంత్రణను తీసుకున్న తర్వాత తాలిబాన్ తీసుకున్న ఆయుధాల నిల్వను అక్కడే వదిలేసినట్లు సమాచారం. 

US బ్యాటిల్ గ్రూప్: 

యుఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నేతృత్వంలోని ఈ బృందంలో గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్, నాలుగు గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్‌లు ఉన్నాయని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ జె ఆస్టిన్ తెలిపారు. యుఎస్ ఇజ్రాయెల్‌కు దగ్గరగా యుద్ధనౌకలు, విమానాలను తరలించాలని ఆదేశించింది, ఇది దాని మిత్రదేశానికి మద్దతునిచ్చే ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. USS గెరాల్డ్ R ఫోర్డ్ నేతృత్వంలోని క్యారియర్ బ్యాటిల్ గ్రూప్.. దానితో పాటు ఉన్న యుద్ధనౌకలు తూర్పు మెడిటేరియన్ సముద్రం వైపు కదులుతున్నాయి. ఆయుధాల సరఫరాను ఆపడానికి గాజా వెంట సముద్ర తీరాన్ని రక్షించడానికి ఇజ్రాయెల్‌కు US క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ సహాయం చేస్తుందని నివేదికలు ఇప్పటికే పేర్కొన్నాయి.