తీయ భద్రతా చట్టం అమలులోకి వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత నిరసనలను అనుమతించిన హాంకాంగ్

ప్రజలు నిరసన తెలిపేందుకు హాంకాంగ్ పోలీసులు ఆ దేశంలో అనుమతించారు. జాతీయ భద్రతా చట్టం అమలులోకి వచ్చిన తరువాత.. మూడేళ్లకు ఈ నిరసన చేపట్టారు ప్రజలు.  హాంకాంగ్ పోలీసులు ఆదివారం నాడు గట్టి ఆంక్షల మధ్య నిరసన ప్రదర్శన చేయడానికి కార్యకర్తలను అనుమతించారు. కాగా.. 2020లో జాతీయ భద్రతా చట్టం అమలులోకి వచ్చిన తర్వాత నిరసనకు అనుమతించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే.. నిరసనకారులు నంబర్‌లు ఉన్న లాన్యార్డ్‌లను ధరించాలని, అదే విధంగా మాస్క్‌లు పెట్టుకోకుండా […]

Share:

ప్రజలు నిరసన తెలిపేందుకు హాంకాంగ్ పోలీసులు ఆ దేశంలో అనుమతించారు. జాతీయ భద్రతా చట్టం అమలులోకి వచ్చిన తరువాత.. మూడేళ్లకు ఈ నిరసన చేపట్టారు ప్రజలు. 

హాంకాంగ్ పోలీసులు ఆదివారం నాడు గట్టి ఆంక్షల మధ్య నిరసన ప్రదర్శన చేయడానికి కార్యకర్తలను అనుమతించారు. కాగా.. 2020లో జాతీయ భద్రతా చట్టం అమలులోకి వచ్చిన తర్వాత నిరసనకు అనుమతించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అయితే.. నిరసనకారులు నంబర్‌లు ఉన్న లాన్యార్డ్‌లను ధరించాలని, అదే విధంగా మాస్క్‌లు పెట్టుకోకుండా నిరసన తెలపాలని పోలీసులు వారికీ సూచించారు. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ప్రకారం.. పోలీసులు వారికి అవసరమైన వాటిని ఉటంకిస్తూ ఏడు లేఖలతో కూడిన నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చారని తమనిరసనను కూడా పర్యవేక్షించారని నిరసనకారులు తెలిపారు.

ప్రతిపాదిత భూసేకరణ మరియు చెత్త ప్రాసెసింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనకారులు ర్యాలీ చేస్తున్నారని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.

ప్రాజెక్టు నిర్మిస్తున్న తూర్పు జిల్లా త్సుంగ్ క్వాన్ లోని ఓ ప్రాంతంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. వారు బ్యానర్లతో ర్యాలీగా వెళ్లి పునరుద్ధరిస్తున్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరోవైపు నిరసనలో కేవలం 100 మంది మాత్రమే పాల్గొనవచ్చని నో అబ్జెక్షన్  లేఖలో పేర్కొన్నారు హాంకాంగ్ పోలీసులు. “మనం మరింత స్వేచ్ఛాయుతంగా నిరసన తెలిపే సంస్కృతిని కలిగి ఉండాలి” అని తన ముగ్గురు పిల్లలతో నిరసన చేస్తున్న 49 ఏళ్ల జేమ్స్ ఒకెండెన్‌ పేర్కొన్నారని వార్తా సంస్థ రాయిటర్స్  కధనం రాసింది.

“కానీ ఇదంతా  పోలీసుల ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. అందుకే కేవలం 100 మందిని మాత్రమే అనుమతించారు. ఇలా నిరసన తేలపకుండా చేయడం అంటే సంస్కృతిని నాశనం చేయడమే. అదే విధంగా ప్రజలు నిరసన చేపట్టకుండా చేయడమే” అని ఓకెండెన్ అన్నారు.

కాగా.. హాంగ్‌కాంగ్ డెవలప్‌మెంట్ బ్యూరోకి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి, తమ భూ పునరుద్ధరణ ప్రాజెక్ట్ “సమాజం యొక్క రోజువారీ అవసరాలకు” మద్దతునిచ్చే లక్ష్యంతో ఉందని  హాంగ్‌కాంగ్ డెవలప్‌మెంట్ బ్యూరో వారు  చెప్పారు.

“భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు” అనేది తమ సంస్థచే గౌరవించబడుతుందని, భూసేకరణ స్థాయిని తగ్గించే అవకాశాల కోసం అధ్యయనాలు చేస్తున్నామని కూడా హాంగ్‌కాంగ్ డెవలప్‌మెంట్ బ్యూరో పేర్కొంది.

మరోవైపు దేశ ద్రోహ ప్రదర్శనలు లేదా దేశ ద్రోహ ప్రసంగాలతో సహా జాతీయ భద్రతా చట్టాలను ఉల్లంఘించడం మానుకోవాలని లేఖలో నిరసనకారులను పోలీసులు హెచ్చరించారు.

చట్టాన్ని ఉల్లంఘించే వారు నిరసనకారులతో కలసి “ప్రజాస్వామ్యానికి భంగం కలిగించడం లేదా చట్టవిరుద్ధమైన హింసకు పాల్పడటం వంటి వాటికి దూరంగా ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. 

కాగా ఆదివారం నాటి నిరసనలో సుమారు 80 మంది చేరినట్లు నిరసనకారులు తెలిపారు.

1989లో చైనాలోని తియానన్‌మెన్ స్క్వేర్ అణిచివేత బాధితుల జ్ఞాపకార్థం జూన్ 4న కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడానికి అధికారులు అనుమతి నిరాకరించారు. ఇతరత్ర నిరసనల కోసం చేసిన దరఖాస్తులను కూడా పోలీసు అధికారులు తిరస్కరించారు.

జూన్ 2020లో చైనాచే రూపొందించబడిన జాతీయ భద్రతా చట్టాన్ని అమలు పరిచిన అధికారులు.. ప్రజల, నిరసనకారుల స్వేచ్ఛలను అణచివేసారు. అనేక మంది రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులూ మరియు కార్యకర్తలను అరెస్టు చేశారు.

హాంకాంగ్ యొక్క చిన్న రాజ్యాంగం.. ప్రాథమిక చట్టం, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కుకు హామీ ఇస్తున్నప్పటికీ.. 2019లో సుదీర్ఘ ప్రజాస్వామ్య అనుకూల నిరసనలను అణిచివేసేందుకు ఈ జాతీయ భద్రతా చట్టం రూపొందించబడింది.