కెనడాలో నమోదైన కొత్త వేరియంట్ BA.2.86 మొదటి కేసు 

కరోనా సమయంలో ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురయ్యారు తెలిసిన విషయమే. సుమారు మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ, కరోనా మరెన్నో రూపాలు దాల్చి విస్తృతంగా వ్యాపిస్తూనే ఉంటుంది. ప్రపంచ దేశాల ప్రజలు టీకాలు వేసుకొని అప్రమత్తంగా ఉంటూనే ఉన్నారు. ఇటీవల కాలంలో కరోనా వైరస్ మరో వేరియంట్ రూపంలో మెల్లమెల్లగా చాప కింద నీరులా వ్యాపిస్తుందని కొన్ని దేశాల నుంచి వినిపిస్తోంది.  కెనడాలో నమోదైన కొత్త వేరియంట్ మొదటి కేసు:  ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రస్తుతం టీకాలుగా వేసుకుంటున్నా కరోనా […]

Share:

కరోనా సమయంలో ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురయ్యారు తెలిసిన విషయమే. సుమారు మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ, కరోనా మరెన్నో రూపాలు దాల్చి విస్తృతంగా వ్యాపిస్తూనే ఉంటుంది. ప్రపంచ దేశాల ప్రజలు టీకాలు వేసుకొని అప్రమత్తంగా ఉంటూనే ఉన్నారు. ఇటీవల కాలంలో కరోనా వైరస్ మరో వేరియంట్ రూపంలో మెల్లమెల్లగా చాప కింద నీరులా వ్యాపిస్తుందని కొన్ని దేశాల నుంచి వినిపిస్తోంది. 

కెనడాలో నమోదైన కొత్త వేరియంట్ మొదటి కేసు: 

ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రస్తుతం టీకాలుగా వేసుకుంటున్నా కరోనా వైరస్ కు సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుంది అంటున్నారు నిపుణులు. ఈ కరోనా వైరస్ వేరియంట్ ఇజ్రాయిల్, డన్మార్క్, అమెరికా, యుకెలతో పాటుగా ఇప్పుడు స్విజర్లాండ్, సౌత్ ఆఫ్రికాలో కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. అమెరికాలో కొన్ని ప్రాంతాలలో కొత్త వేరియంట్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ, ప్రస్తుతం కెనడాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ మొదటి కేసు నమోదవ్వడమే కాకుండా ఇప్పుడు అక్కడ ప్రాంతాలలో ఉన్న నివాసితులకు భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ వేరియంట్ ఒకరికి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడానికి తక్కువ సమయం పడుతున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నప్పటికీ, ప్రతి ఒక్కరు కూడా కరోనా సమయంలో పాటించిన అన్ని జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోవడం చాలా అవసరమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవడం, బయటికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది WHO.

కొత్త వేరియంట్: 

BA.2.86 అనే కోవిడ్ కొత్త వేరియంట్ ప్రస్తుతం విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎమర్జింగ్ వేరియంట్ వేగవంతమైనది కానప్పటికీ మెల్లమెల్లగా చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. దీనికన్నా ముందు వచ్చిన BA.2 సబ్‌వేరియంట్ ఒమిక్రాన్‌ వేరియంట్ కన్నా డిఫరెంట్. డాక్టర్ జెస్సీ బ్లూమ్, ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ సెంటర్‌లో వైరల్ ఎవల్యూషన్‌లో స్పెషలిస్ట్ అయిన ఒక సైంటిస్ట్, వ్యాప్తి చెందుతున్న వేరియంట్ గురించి వివరంగా తెలపడం జరిగింది. 

USతో సహా నాలుగు దేశాలలో BA.2.86 వేరియంట్‌కు సంబంధించిన కేవలం ఆరు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఇప్పుడు ఆ ఆరు కేసుల ద్వారా ఎంతమందికి వ్యాప్తి చెందింది అనే దాని గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO BA.2.86ని “పర్యవేక్షణలో ఉన్న వేరియంట్”గా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కరోనా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ కూడా దేశాలు పాటించాలని మరోసారి గుర్తు చేయడం జరిగింది. మూడు సంవత్సరాల అవుతున్నప్పటికీ కరోనా కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ, ఎంతోమందితో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు హడలు పుట్టిస్తున్న ఈ కరోనా వైరస్ వేరియంట్ ఇజ్రాయిల్, డన్మార్క్, అమెరికా, యుకెలతో పాటుగా ఇప్పుడు స్విజర్లాండ్, సౌత్ ఆఫ్రికాలో కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా, మునుపు తీసుకున్నా కరోనా వైరస్ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, టీకాలు ముందుగానే తీసుకోవడం మంచిది అంటుంది వర్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రతి దేశంలో ఏవైతే కరోనా వైరస్ నిరోధించడానికి టీకాలు వేసుకుంటున్నామో, ఇప్పుడు వచ్చిన కొత్త కరోనా వేరియంట్ బారి నుండి బయటపడేందుకు అవి సరిపోతాయి అంటున్నారు నిపుణులు.

చైనా దేశాలలో ప్రస్తుతం చూసుకుంటే కరోనా టెస్టులు తగ్గినట్లే తెలుస్తోంది. చైనా కి సంబంధించిన ప్రతినిధి మాట్లాడుతూ, చైనా దేశంలో ప్రస్తుతం కరుణ టెస్ట్ల నిర్వహణ తగ్గించినట్లు చెప్పారు. 2020లో చైనా నుంచి ప్రారంభమైన కరోనా వ్యాప్తి.. ఇప్పటికీ తగ్గ ముఖం పట్టలేదని చెప్పుకోవచ్చు.