మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుపై వేధింపులు.. ఖండించిన వైట్ హౌస్

భారతదేశంలో మైనారిటీ హక్కులపై భారతదేశ ప్రధానమంత్రి మోడీని ఒక విలేఖరి ప్రశ్నించిన కారణంగా ఆన్లైన్లో వేధింపులకు గురి చేశారు. అయితే ఈ విషయాన్ని తాజాగా వైట్ హౌస్ ఖండించింది.  విలేకరులపై ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ రకంగా దాడి చేయడం అమెరికాకు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు అని వైట్ హౌస్ వెల్లడించింది. అసలు విషయంలోకి వెళితే భారత ప్రధాన నరేంద్ర మోడీ తాజాగా అమెరికాలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా వాషింగ్టన్ లోని అమెరికా […]

Share:

భారతదేశంలో మైనారిటీ హక్కులపై భారతదేశ ప్రధానమంత్రి మోడీని ఒక విలేఖరి ప్రశ్నించిన కారణంగా ఆన్లైన్లో వేధింపులకు గురి చేశారు. అయితే ఈ విషయాన్ని తాజాగా వైట్ హౌస్ ఖండించింది.  విలేకరులపై ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ రకంగా దాడి చేయడం అమెరికాకు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు అని వైట్ హౌస్ వెల్లడించింది. అసలు విషయంలోకి వెళితే భారత ప్రధాన నరేంద్ర మోడీ తాజాగా అమెరికాలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా వాషింగ్టన్ లోని అమెరికా ప్రెసిడెంట్ తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందే జో బిడెన్ భార్య కి  ఆయన భారత్ తరపున గ్రీన్ డైమండ్ ను కూడా బహుమతిగా అందించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న మోదిని ప్రశ్నించిన తమ విలేకరి వేధింపులకు గురి అవుతుంది అంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపించింది.

ముఖ్యంగా భారతదేశంలో ముస్లింలతో సహా ఇతర మైనారిటీల హక్కుల విషయాన్ని తమ జర్నలిస్టు ప్రశ్నించినందుకు గాను వారిని ఆన్లైన్లో వేధిస్తున్నారని ఈ విషయంపై తప్పకుండా స్పందించాలి అని వాల్ స్ట్రీట్ జర్నల్ వైట్ హౌస్ ను కోరింది. ప్రముఖ జర్నలిస్టు సబ్రినా సిద్ధికి ఇలా మోదీని ప్రశ్నించినందుకు సైబర్ వేధింపులకు గురి అవుతున్నానని తమ దృష్టికి వచ్చిందని జాతీయ భద్రతామండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ల సమన్వయకర్త జాన్ కిర్బీ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు తమ జర్నలిస్టుపై జరుగుతున్న దాడులను వారు తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు.

జర్నలిస్టులపై ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఎలాంటి రకమైన దాడి అయినా ఖండించాల్సిందేనని అదే అమెరికా ఉద్దేశం అని కూడా వారు గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి పనికిరాదు అని ఒక విషయంపై ఒక వ్యక్తి తన నోటిని విప్పి ప్రశ్నిస్తున్నాడు అంటే ఆ సమస్యకు పరిష్కారం చూపించాలి కానీ ఇలా ఆ వ్యక్తిని మాటలతో దూషించకూడదు అని వ్యాఖ్యానించారు. భారతదేశంలో ముస్లింలు ఇతర మైనారిటీల పట్ల పక్షపాత వైఖరి గురించి మీరేమంటారు? ఇండియాలో మైనారిటీల హక్కులను కాపాడడానికి మీ భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి ?అంటూ ప్రధాని మోదీని ప్రముఖ జర్నలిస్టు సబ్రీనా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇక దీనికి జవాబు ఇస్తూ నరేంద్ర మోడీ ఈ ప్రశ్న తనను చాలా ఆశ్చర్యపరిచింది అని తెలిపారు.

 మనమంతా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని ప్రజాస్వామ్యమే మన ఆత్మ అని ఇక్కడ పక్షపాతానికి ప్రజాస్వామ్యంలో ఏమాత్రం చోటు లేదు అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఇకపోతే సోమవారం కిర్బీ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికి ప్రతిస్పందనను వైట్ హౌస్ ప్రెష్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ పునరుద్ఘాటించారు. ఆయన మాట్లాడుతూ మేము పత్రిక స్వేచ్ఛకు ఎప్పుడు కట్టుబడి ఉంటాము. అందుకే గతవారం విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాము జర్నలిస్టులు తమ పని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారిని బెదిరించడం లేదా వేధించే ప్రయత్నాలను చేసిన వారిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని ఆయన వెల్లడించారు.  ఇకపోతే ఈ విషయంపై ప్రధాన మోడీ సమాధానాన్ని అధ్యక్షుడు బిడన్ అంగీకరించారా అని అడగ్గా .. దానికి పియర్ సమాధానం చెబుతూ.. ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని మీరందరూ కోరుతున్నారు ఒకవేళ దాని గురించి చెప్పిన తర్వాత విమర్శించడం మొదలుపెడితే అది పద్ధతి కాదు అందుకే ఇలాంటివి ఇక్కడ చర్చించము అంటూ ఆయన వెల్లడించారు మొత్తానికైతే నరేంద్ర మోడీ దీనిపై ఏ విధంగా స్పందించారు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.