బందీల‌ను చంపేస్తామ‌ని హెచ్చ‌రించిన హ‌మాస్ ఉగ్ర‌వాదులు

ఇజ్రాయెల్- పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య యుద్ధం ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇజ్రాయెల్ మీద దండెత్తిన క్రూరులైన హ‌మాస్ మిలిటెంట్లు ఊహకందని నష్టాన్ని మిగులుస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా ఈ దాడులకు ధీటుగా బదులిస్తోంది. తాము కూడా ఏం తక్కువ కాదని చూపిస్తూ విరుచుకుపడుతోంది. ఈ రెండు దేశాల పోటాపోటీ యుద్ధంతో ప్రపంచం మీద ఎంతో ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని వస్తువుల రేట్లు పెరిగాయి. మరిన్ని వస్తువుల […]

Share:

ఇజ్రాయెల్- పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య యుద్ధం ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇజ్రాయెల్ మీద దండెత్తిన క్రూరులైన హ‌మాస్ మిలిటెంట్లు ఊహకందని నష్టాన్ని మిగులుస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా ఈ దాడులకు ధీటుగా బదులిస్తోంది. తాము కూడా ఏం తక్కువ కాదని చూపిస్తూ విరుచుకుపడుతోంది. ఈ రెండు దేశాల పోటాపోటీ యుద్ధంతో ప్రపంచం మీద ఎంతో ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని వస్తువుల రేట్లు పెరిగాయి. మరిన్ని వస్తువుల ధరలు కూడా ఆకాశానికి అంటే అవకాశం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అమాయకులు పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

హెచ్చరించిన ఇజ్రాయెల్.. ధీటుగా బదులిచ్చిన హ‌మాస్

ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తుతున్న హ‌మాస్ మిలిటెంట్లకు ఆ దేశం స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. మీరు చేసిన దాడులకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. సరిహద్దును ఉల్లంఘించినప్పుడు తమ వైపు ఉన్న బంధీలను చంపేస్తామని హమాస్ గ్రూప్ బెదిరించింది. ఈ యుద్ధంలో కనీసం 1,600 మంది ప్రాణాలు కోల్పోయారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ లో మరో 1,500 మంది హ‌మాస్ కార్యకర్తల మృతదేహాలను సరిహద్దు సమీపంలో కనుగొన్నట్లు తెలుస్తోంది. గాజా సరిహద్దుకు సమీపంలోని ఇజ్రాయెల్ ప్రాంతంలో 1,500 మంది హమాస్ కార్యకర్తల మృతదేహాలు లభ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం కనుక నిజం అయితే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్‌ కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం 3,00,000 మంది సైనికులను సమీకరించినట్లు పలు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధంలో ఉందని, మేము ఈ యుద్ధాన్ని కోరుకోలేదు కానీ తప్పడం లేదని నెతన్యాహు తెలిపారు. అంతే కాకుండా ఇది అత్యంత క్రూరమైన రీతిలో మాపై బలవంతంగా రుద్దబడిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ప్రారంభించనప్పటికీ.. దానిని పూర్తి చేసే బాధ్యతను తప్పకుండా తీసుకుంటామన్నారు. తామే యుద్ధాన్ని ఫినిష్ చేస్తామని హమాస్ గ్రూప్ కు కీలక హెచ్చరికలు పంపారు. మాపై దాడి చేయడం ద్వారా… వారు చారిత్రాత్మక తప్పిదం చేశారని త్వరలోనే హమాస్ గ్రూప్ అర్థం చేసుకుంటుందని నెతన్యాహు అన్నారు. అంతే కాకుండా అతడు హమాస్ గ్రూప్ ను ఐసిస్ గ్రూప్ తో పోల్చాడు. 

పరిస్థితులు చూసి భయపడుతున్న యూఎన్

ప్రపంచ శాంతిని కోరుకునే యూఎన్ ఈ పరిస్థితులను చూసి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో అమాయకులు మరణించారని.. వీలైనంత త్వరగా ఈ రెండు దేశాలు యుద్ధానికి ముగింపు పలకాలని యూఎన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. సైనిక కార్యకలాపాలు అంతర్జాతీయ మానవతా చట్టాలకు అనుగుణంగా నిర్వహించబడాలని ఇజ్రాయెల్‌ కు గుర్తు చేస్తున్నట్లు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. గాజా నుంచి ఇజ్రాయెల్ వైపు రాకెట్లతో శనివారం రోజు దాడిలో దాదాపు 1,600 మంది పౌరులు, సైనికులు ఇరువైపులకు చెందిన వారు మరణించినట్లు తెలుస్తోంది. 

11 మంది అమెరికన్లు మృతి

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కేవలం ఆ రెండు దేశాల వారిని మాత్రమే కాకుండా అమాయకులైన విదేశాల వారిని కూడా పొట్టన పెట్టుకుంటుంది. ప్రస్తుతం జరిగిన ప్రపంచీకరణ ఫలితంగా అనేక దేశాల వారు అనేక దేశాల్లో స్థిరపడ్డారు. వారందరూ వివిధ పనులు చేసుకుంటూ వివిధ దేశాలలో స్థిరపడుతున్నారు. ఈ విధంగా ఇజ్రాయెల్ లో కూడా అనేక మంది స్థిరపడ్డారు. కానీ ప్రస్తుతం యుద్ధం కారణంగా వారంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికే 11 మంది అమెరికన్లు మరణించినట్లు అగ్రరాజ్యం అమెరికా ధృవీకరించింది. అంతే కాకుండా మరికొంత మందిని హమాస్ బంధీలుగా ఉంచుతోందని భయాన్ని వ్యక్తం చేసింది. అయితే యుద్ధంలో సైనికంగా పాల్గొనే ఉద్దేశం తమకు లేదని వైట్‌హౌస్ తెలిపింది. అంతే కాకుండా ఇరాన్ కానీ ఇతర దేశాల వారు కానీ ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా హెచ్చరించింది.