Terrorist: ఎయిరిండియా విమానాన్ని పేల్చేస్తామంటూ ఖలిస్తానీ టెర్ర‌రిస్ట్ బెదిరింపులు

Terrorist: గత జూన్‌లో ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా (Canada) ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్‌దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా (Canada) ప్రధాని […]

Share:

Terrorist: గత జూన్‌లో ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా (Canada) ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్‌దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) పార్లమెంటుకు తెలియజేశారు. కానీ ఇప్పటివరకు ఈ హత్య (Murder) కేసు (Case)లో, భారత దేశ హస్తం ఉందని ఎటువంటి ఆధారాలు లేవంటూ భారత్ (India) తేల్చి చెబుతోంది. ఇదిలా ఉండగా మరోవైపు నవంబర్ 19న విమానాన్ని (Plane) పేల్చి వేస్తామంటూ ఖలిస్తానీ (Khalistani) టెర్రరిస్ట్ (terrorist) బెదిరించడం జరిగింది. 

ఖలిస్తానీ టెర్రరిస్టర్ బెదిరింపులు: 

నిషేధిత సిక్కుల ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు, నియమించబడిన ఖలిస్తానీ (Khalistani) ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun), నవంబర్ 19 తర్వాత సిక్కులు తమ ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఎయిర్ ఇండియా విమానంలో(Plane) ప్రయాణించవద్దని కోరుతూ కొత్త వీడియో (Video)ను విడుదల చేశారు. నవంబర్ 19న ఎయిరిండియా సర్వీసులు నడపడానికి వీల్లేదంటూ, తాము అనుమతించబోమని ఆయన పేర్కొన్నారు. నిజానికి పరోక్షంగా ఎయిర్ ఇండియా విమానాన్ని (Plane) పేల్చి వేస్తామంటూ బెదిరించాడు ఖలిస్తానీ (Khalistani) టెర్రరిస్ట్ (terrorist).

నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయం (Plane) మూసివేయబడుతుందని, దాని పేరు మార్చబడుతుందని ఖలిస్తానీ (Khalistani) టెర్రరిస్ట్ (terrorist) పన్నూన్ (Gurpatwant Singh Pannun) పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్‌లో, ఫైనల్ మ్యాచ్ జరిగేది అదే రోజు అని గుర్తుంచుకోమని సవాల్ విసిరాడు ఖలిస్తానీ (Khalistani) టెర్రరిస్ట్ (terrorist). అయితే నిజానికి, SFJ చీఫ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) బెదిరింపులు జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబరులో, ఖలిస్తానీ (Khalistani) ఉగ్రవాది (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారతదేశం – కెనడా మధ్య వివాదం జరుగుతున్న కారణంగా హిందూ-కెనడియన్లు కెనడాను విడిచిపెట్టాలని ఆయన కోరారు.

గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) చేసిన వీడియో (Video) ఇప్పుడు పలు సోషల్ మీడియా మాధ్యమల్లో స్ప్రెడ్ అవ్వడంతో, హిందూ ఫోరమ్ కెనడా లాయర్లు, కెనడాలోకి పన్నూన్ (Gurpatwant Singh Pannun) ప్రవేశాన్ని నిషేధించాలని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రిని కోరారు. 

ఆధారాలు ఎక్కడ అంటున్న భారత్: 

జూన్‌లో జరిగిన నిజ్జర్‌ (Hardeep Nijjar) హత్య (Murder)లో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందన్న ఆరోపణకు మద్దతుగా కెనడా (Canada), తన మిత్రదేశాల నుంచి భారత్ (India)‌కు ఎలాంటి విశ్వసనీయమైన ఆధారాలు అందలేదని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ (Sanjay Kumar Verma) ది గ్లోబ్ అండ్ మెయిల్‌కి తెలిపారు. కెనడా (Canada) తన వైపు నుంచి చేస్తున్న దర్యాప్తులో భాగంగా తమకు ఇప్పటివరకు, హత్య (Murder) కేసు (Case)లో భారత్ (India) ప్రమేయం ఉంది అంటూ నిరూపితమయ్యే ఎటువంటి ఆధారాలు అందలేదని వర్మ (Sanjay Kumar Verma) అన్నారు. అసలు ఇప్పటివరకు దర్యాప్తులో పురోగతి ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు వర్మ (Sanjay Kumar Verma). అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా, భారతదేశ మీద ఇటువంటి నిందలు ఎలా వేస్తారు అంటూ కెనడా (Canada)ను మరొకసారి ప్రశ్నించడం జరిగింది. 

కెనడా (Canada) సెప్టెంబర్‌లో భారత్ (India)‌తో వాణిజ్య చర్చలను నిలిపివేసింది. వాణిజ్య మిషన్‌ను వాయిదా వేసింది, అయితే వాణిజ్య చర్చలను పునఃప్రారంభించేందుకు భారతదేశం ఆసక్తిగా ఉందని హైకమిషనర్ తెలిపారు. ఈ విషయాలను చర్చించడానికి..కెనడియన్ వ్యాపారవేత్తల ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి న్యూఢిల్లీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దౌత్య సంబంధాలను సరిదిద్దుకోవడానికి, వృత్తిపరమైన కమ్యూనికేషన్, సంభాషణలలో ఇరుపక్షాలు పాల్గొనవలసిన అవసరాన్ని వర్మ (Sanjay Kumar Verma) నొక్కిచెప్పారు. ఏదిఏమైనాప్పటికీ, ఎటువంటి ఆధారాలు లేకుండా నిందలు మోపడం, ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తెంపాలని ప్రయత్నిస్తున్న ఎవరైనా సరే పట్టుబడక తప్పదు అంటూ, కెనడా (Canada)లో మరణించిన హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Nijjar) కేసు (Case) విషయం గురించి మాట్లాడారు వర్మ (Sanjay Kumar Verma).