మెటర్నిటీ లీవ్‌లో ఉండగా ఉద్యోగం నుంచి తొలగించారు..

కొన్ని నెలలుగా పలు టెక్ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులకు స్వస్తి పలుకుతున్నాయి. అలా ఉద్యోగాలు కోల్పోయిన వారు తమ బాధలు, ఆవేదనను సోషల్ మీడియా వేదికలపై షేర్ చేస్తున్నారు. గతంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు ఆ సంస్థ మాజీ ఉద్యోగులు వరుసగా లేఖలు రాసిన విషయం తెలిసిందే. కఠిన సమయాల్లో విధుల నుంచి తొలగించడంపై తమ ఆవేదనని సీఈవోకి వ్యక్తం చేశారు. షెడ్యూల్‌ ప్రకారం..కంపెనీ ముందే ఇచ్చిన లీవ్‌లను అలాగే […]

Share:

కొన్ని నెలలుగా పలు టెక్ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులకు స్వస్తి పలుకుతున్నాయి. అలా ఉద్యోగాలు కోల్పోయిన వారు తమ బాధలు, ఆవేదనను సోషల్ మీడియా వేదికలపై షేర్ చేస్తున్నారు. గతంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు ఆ సంస్థ మాజీ ఉద్యోగులు వరుసగా లేఖలు రాసిన విషయం తెలిసిందే. కఠిన సమయాల్లో విధుల నుంచి తొలగించడంపై తమ ఆవేదనని సీఈవోకి వ్యక్తం చేశారు. షెడ్యూల్‌ ప్రకారం..కంపెనీ ముందే ఇచ్చిన లీవ్‌లను అలాగే ఉంచి తమకు ఊరట కల్పించాలని కోరారు.  అయినప్పటికీ, గూగుల్‌ ఉద్యోగుల తొలగింపులను కొనసాగిస్తుంది.

ఇటీవల ఓ మహిళా ఉద్యోగి బిడ్డకు జన్మనిచ్చిన 10 వారాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోయింది. 12 ఏండ్లుగా పని చేస్తున్నా.. మెటర్నిటీ లీవ్ లో ఉన్న తనను జాబ్ నుంచి తొలగించారంటూ, గూగుల్‌ నిర్ణయంతో ‘గుండె పగిలినంతపనైంది’ అని లింక్డిన్‌ పోస్ట్‌తో ఎమోషనల్ అయ్యారు.

12 ఏళ్ల పాటు సేవలందించిన తర్వాత ప్రసూతి సెలవు సమయంలో తొలగించబడిన గూగుల్ ఉద్యోగి లింక్డ్‌ఇన్‌లో తన ఆవేదనను పంచుకున్నారు. గూగుల్‌లో మాజీ రిక్రూటింగ్ మేనేజర్ కంపెనీలో 12 సంవత్సరాలకు పైగా ఆమె పని చేశారు. ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే నికోల్ ఫోలే కథ చాలా మందికి బాధ కలిగించినందున ప్రస్తుతం ఈ పోస్ట్  వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ 9,000 లైక్‌లను సంపాదించింది. ఈ సమస్య తమ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పనికి తిరిగి వచ్చే తల్లులు ఎదుర్కొనే సవాళ్ల గురించి తెలుపుతుంది. నికోల్ తన జీవితంలో 12.5 సంవత్సరాలు గూగుల్ లో పనిచేసింది. ఆమె తన 10 వారాల శిశువు సంరక్షణలో బిజీగా ఉన్నప్పుడు తనను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మెసేజ్ వచ్చింది.

నికోల్ లింక్డ్‌ఇన్‌కి వెళ్లి తన మొత్తం కథనాన్ని పంచుకున్నారు. “గూగుల్‌లో 12.5 సంవత్సరాల తర్వాత, దురదృష్టవశాత్తూ గత బుధవారం జరిగిన గూగుల్ రిక్రూటింగ్ లేఆఫ్‌ల వల్ల ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు నేను తొలగించబడ్డాను. ముఖ్యంగా 10 వారాల బిడ్డతో ఉన్న సమయంలో ఈ వార్త నాకు చాలా బాధ కలిగించింది. గూగుల్‌ ఇలా చేస్తుందని అనుకోలేదు..నా గుండె పగిలినంత పనైంది. అయినప్పటికీ, గూగుల్ లో నేను గడిపిన సమయానికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను. గూగుల్‌లో పనిచేసే సమయంలో నా స్నేహితులకు, మరీ ముఖ్యంగా నా కుటుంబ సభ్యులుగా భావించే అద్భుతమైన కొలీగ్స్‌తో పనిచేసే అదృష్టం దక్కింది. వారికి నా కృతజ్ఞతలు’ అయితే కొత్త జాబ్‌ ఎక్కడ ఉంది. దానికి ఎలా గుర్తించాలి? ఇంటర్వ్యూలకు ఎలా హాజరవ్వాలో తెలుసుకోవడం ప్రస్తుతం కష్టమే. అయితే, పాజిటివ్ మైండ్‌సెట్‌ను కొనసాగిస్తూ, తర్వాత ఏం జరుగుతుందో చూసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు పోస్ట్‌లో రాశారు.

 మీకు తెలిసి ఏదైనా కంపెనీలో స్టాఫింగ్ మేనేజర్ లేదా ప్రోగ్రామ్ మేనేజర్ జాబ్స్‌ ఉంటే నన్ను గుర్తుంచుకోండి. అలాగే ఎవరైనా ఐసీ రిక్రూటర్‌ల కోసం చూస్తున్నట్లైతే చెప్పండి. నా కొలీగ్స్‌ ఎంతో మంది ఉద్యోగం కోల్పోయారు. వారికి సహాయం చేసిన వారవుతారని, అలాగే, తక్షణం ఉద్యోగం రాకపోయినా నిదానంగా అయినా మంచి అవకాశం అందిపుచ్చుకుంటానని ఆశాభావం వ్యక్తం చేస్తూ లింక్డిన్‌ పోస్ట్‌లో నెటిజన్లను కోరారు. అయితే, ఉద్యోగం పోయినప్పటికీ సంస్థపై తనకున్న మమకారాన్ని చాటి చెప్పడంతో చాలా మంది కామెంట్ సెక్షన్‌లోకి వెళ్లి ఆమెకు మద్దతుగా నిలిచారు. నికోల్.. మీరు చాలా అద్భుతమైన వ్యక్తి అని రాయగా.. మరికొందరు తామూ ఇటువంటి పరిస్థితులే ఎదుర్కొన్నామని వారి బాధలు షేర్ చేసుకున్నారు.