మస్క్‌తో ఎఫైర్.. భార్యకు విడాకులిచ్చిన గూగుల్ కో-ఫౌండర్

విడాకులు తీసుకుంటున్న సంపన్న జంటల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్-మిలిందా, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్-మెకంజీ స్కాట్‌ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు అదే బాటలో గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ (49)-నికోల్ షనాహన్‌ (37)జంట విడాకులకు సిద్ధమైంది. ఈ మేరకు సెర్రీ బ్రిన్ కోర్టులో విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేశారు. పరస్పర విరుద్ధ అభిప్రాయాల కారణంగానే విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు ఈ జంట పేర్కొంది. టెస్లా చీఫ్, బిలీనియర్ ఎలాన్ […]

Share:

విడాకులు తీసుకుంటున్న సంపన్న జంటల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్-మిలిందా, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్-మెకంజీ స్కాట్‌ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు అదే బాటలో గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ (49)-నికోల్ షనాహన్‌ (37)జంట విడాకులకు సిద్ధమైంది. ఈ మేరకు సెర్రీ బ్రిన్ కోర్టులో విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేశారు. పరస్పర విరుద్ధ అభిప్రాయాల కారణంగానే విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు ఈ జంట పేర్కొంది.

టెస్లా చీఫ్, బిలీనియర్ ఎలాన్ మస్క్‌తో తన భార్య నికోల్ షానహాన్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో గూగుల్ సహ- వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ విడాకులు తీసుకున్నారని పేజ్ సిక్కస్ నివేదించింది. కోర్టు పత్రాల ప్రకారం ఈ జంటకు మే 26నే విడాకులు మంజూరయ్యాయి. ఇప్పుడు తమ నాలుగేళ్ల కుమార్తె విషయంలో కోర్టు నిర్ణయం వెలువరించనుంది. షానహన్ విడాకులు కోరకపోయినా.. తన జీవిత భాగస్వామికి మద్దతు ఇవ్వాలని కోర్టును కోరినట్లు న్యాయస్థానం పత్రాలు వెల్లడిస్తున్నాయి. లాయర్ ఫీజులు, ఆస్తుల విభజనతో సహా ఇతర సమస్యలను రహస్యంగా మధ్యవర్తిత్వంలో పరిష్కరించుకున్నారు.

సెర్గీ బ్రిన్.. షానహాన్‌లు 2015లో డేటింగ్ ప్రారంభించారు. అదే ఏడాది బ్రిన్ తన మొదటి భార్య అన్నే వోజ్‌కికీ విడాకులు ఇచ్చారు. 2018లో నికోల్ షానహన్‌ను వివాహం చేసుకున్నారు. కానీ, వీరి వైవాహిక జీవితం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మస్క్‌తో సంబంధం విషయం తెలియడంతో 2021 డిసెంబరు నుంచి ఇరువురు వేరుగా ఉంటున్నారు. గతేడాది ఏడాది జనవరిలో షాన్‌తో విడాకులకు బ్రిన్ దరఖాస్తు చేశారు. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని అందులో పేర్కొన్నారు.

తాము 2021 డిసెంబర్ 15 నుంచి వేరుగానే ఉంటున్నట్లు చెప్పిన బ్రిన్.. తన కుమార్తె బాధ్యతలను ఇద్దరం చూసుకుంటామని చెప్పారు. నికోల్ నుంచి తనకు ఎలాంటి మద్దతు అవసరం లేదని తెలిపారు. ఇక, చాలా ఏళ్లు మస్క్, బ్రిన్ మంచి స్నేహితులుగా ఉన్నారు. అయితే తన భార్య నికోల్తో మస్క్ కు అఫైర్ ఉందని తెలుసుకున్నప్పటి నుంచి ఇరువురి మధ్య వైరం ఏర్పడినట్టు గతంలో కథనాలు వెలువడ్డాయి. 2022 తొలినాళ్లలో బ్రిన్ను ఓ పార్టీలో కలిసిన మస్క్.. క్షమాపణలు కోరినట్లు వార్తలు కూడా వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో ‘పీపుల్స్‌ మ్యాగజైన్‌’తో జరిపిన ఇంటర్వ్యూలో ఎలాన్‌ మస్క్‌తో తనకున్న బంధాన్ని నికోల్‌ షనన్‌ ఖండించారు. మస్క్‌కు తనకు మధ్య ఉన్న బంధంపై వచ్చిన నివేదికలతో తానెంత మనోవేధనకు గురైనట్లు ఇంటర్వ్యూలో చెప్పారు. ఎలాన్‌ మస్క్‌ను ఓ స్నేహితుడుగానే భావించానని, తన కుమార్తె ఆటిజం చికిత్స గురించి చర్చించానని అన్నారు. ఆ ఆటిజం సమస్యను తీర్చేందుకు ఎలాన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ను ఆశ్రయించించినట్లు తెలిపారు. అంతే తప్పా వేరే కారణాలు లేవని స్పష్టం చేశారు.

అంతేకాదు, షానహాన్‌తో సంబంధం ఉన్నట్టు జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.. గతేడాది జులై 25న ట్విట్టర్‌లో దీనిపై మస్క్ స్పందిస్తూ.. ‘సెర్గీ, నేను స్నేహితులం.. గత రాత్రి కలిసి పార్టీలో ఉన్నాం.. నేను నికోల్‌ని మూడు సంవత్సరాలలో రెండుసార్లు మాత్రమే చూశాను.. ఆ సందర్భంలో చుట్టుపక్కల చాలా మంది వ్యక్తులు ఉన్నారు.. మా మధ్య ఎటుంంటి శారీరక సంబంధం లేదు’ అని ఆయన ట్వీట్ చేశారు.

టెస్లా కార్లను తొలుత పొందిన వ్యక్తుల జాబితాలోనూ బ్రిన్ ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎలాన్‌ మస్క్‌కు సెర్గీ బ్రిన్‌కు మధ్య ఉన్న స‍్నేహాన్ని నికోల్‌ షనన్‌ గుర్తు చేశారు. ఇంకా.. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో టెస్లా సంస్థకు బ్రిన్ 5 లక్షల యూఎస్ డాలర్ల సాయం అందించి ఆదుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో 118 బిలియన్ డాలర్లతో సెర్గీ బ్రిన్ 9వ స్థానంలో ఉన్నారు.