H1B వీసా దారులకు శుభవార్త.. అడ్డంకులు తొలగినట్టే..

హెచ్ వన్ బి వీసాలపై తాజాగా అమెరికాకు వెళ్లిన భారతీయులకు అక్కడి స్థానిక కోర్టు శుభవార్త తెలిపింది. ముఖ్యంగా హెచ్ వన్ బి వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేయకుండా అడ్డుకోవాలన్న వాదనను అక్కడి కోర్టు తిరస్కరించింది. హెచ్ వన్ బి వీసా దారుల భార్య లేదా భర్త అమెరికాలో నిరభ్యరంతంగా పనిచేసుకోవచ్చని కోర్ట్ తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా హెచ్ వన్ బి వీసాలపై చాలామంది భారతీయులు అమెరికాకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయులకు ప్రయోజనం […]

Share:

హెచ్ వన్ బి వీసాలపై తాజాగా అమెరికాకు వెళ్లిన భారతీయులకు అక్కడి స్థానిక కోర్టు శుభవార్త తెలిపింది. ముఖ్యంగా హెచ్ వన్ బి వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేయకుండా అడ్డుకోవాలన్న వాదనను అక్కడి కోర్టు తిరస్కరించింది.

హెచ్ వన్ బి వీసా దారుల భార్య లేదా భర్త అమెరికాలో నిరభ్యరంతంగా పనిచేసుకోవచ్చని కోర్ట్ తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా హెచ్ వన్ బి వీసాలపై చాలామంది భారతీయులు అమెరికాకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయులకు ప్రయోజనం కలిగించే విధంగా తాజా తీర్పు వెళ్లడించడం నిజంగా హర్షదాయకమని చెప్పాలి. హెచ్ వన్ బి వీసా అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. ముఖ్యంగా విదేశీయులను తమ కంపెనీలలో చేర్చుకోవడానికి ఈ వీసా అనుమతి ఇస్తుంది.

హెచ్ ఫోర్ వీసా దారులు పనిచేయడానికి..?

వివిధ దేశాల నుండి నిపుణులైన ఉద్యోగులను ఆకర్షించడానికి ఈ వీసాలను అక్కడి కంపెనీలు చాలా బాగా ఉపయోగించుకుంటాయి.  సాధారణంగా ఈ వీసాలను ఉపయోగించేది భారత్, చైనా ఉద్యోగులే అని చెప్పాలి.  ఈ వీసాలపై అమెరికా వెళ్లే ఉద్యోగుల భాగస్వాములు హెచ్ 4 వీసాదారులు సైతం అక్కడ పనిచేసుకునేలా ఒబామా హయాంలో ఆదేశాలు జారీ అయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు దానిని వ్యతిరేకిస్తూ ” సేవ్ జాబ్స్ యూఎస్ఏ “అనే సంస్థ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీన్ని అమెరికా న్యాయవేత్త తాన్య చుట్ కాన్ కొట్టివేశారు. హెచ్ ఫోర్ వీసా దారులు పనిచేయడానికి అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వానికి అనుమతులు ఉన్నాయని ఆమె తన తీర్పులో స్పష్టం చేశారు.

డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ..

అమెరికాలో విదేశీయులకు పని చేసుకునే అవకాశం కల్పించేలా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కి కాంగ్రెస్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని పిటిషనర్లు వాదిస్తున్నారు. కానీ ఈ వాదన గత దశాబ్దాలుగా కాంగ్రెస్ అనుమతులతో కార్యనిర్వహక శాఖ చేస్తున్న పనికి విరుద్ధంగా ఉంది. హెచ్ ఫోర్ వీసా దారులకు పనిచేసుకునే అవకాశం కల్పించాలని అమెరికా ప్రభుత్వానికి కాంగ్రెస్ స్పష్టమైన అధికారం ఇచ్చింది అని జడ్జ్ తీర్మానంలో వెల్లడించారు. ఇక ఈ తీర్పును భారతీయ అమెరికన్లు స్వాగతిస్తున్నారు. వలసదారుల హక్కుల కోసం పోరాడే స్థానిక నేత అజయ్ భుటోరియా కోర్టు తీర్పు పై హర్షం వ్యక్తం చేశారు.

హెచ్ వన్ బి వీసా దారులు తమ కుటుంబంతో కలిసి ఉండేలా ఈ నిర్ణయం వీలు కల్పిస్తుందని వేలాదిమందికి ఈ తీర్పు ఉపశమనం కలిగించింది అని ఆయన తెలిపారు.  అంతే కాదు కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఇది ఊరట కలిగించే తీర్పు అని కొనియాడారు. అయితే ఇప్పుడు సేవ్ జాబ్స్ యూఎస్ఏ వాదన వ్యతిరేకంగా వినిపిస్తోంది అమెరికాలోని ఐటీ వర్కర్లు కలసి సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థను ప్రత్యేకంగా తమకోసం ఏర్పాటు చేసుకున్నారు.

ఈ హెచ్ వన్ బి వీసా దారుల కారణంగా తమ ఉద్యోగాలు కోల్పోయామని పేర్కొంటూ వీరు వాదిస్తూ ఉంటారు. న్యాయస్థానంలో వీరు దాఖలు చేసిన పిటిషన్ను అమెజాన్, యాపిల్, గూగుల్ , మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా పూర్తిగా వ్యతిరేకించాయి. ఈ పిటిషన్ పై ప్రతికూల తీర్పువచ్చే నేపథ్యంలో పై కోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సేవ్ జాబ్స్ యూ ఎస్ ఏ వెల్లడించింది. వాస్తవానికి ప్రతిభావంతులు ఎప్పుడు ఎక్కడైనా ఉద్యోగం చేసే వీలు ఉంటుంది. కానీ కేవలం అక్కడి వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి అంటే అది సాధ్యం కాదు.. అందుకే అన్నింటిని దృష్టిలో పెట్టుకొని జడ్జ్ ఈ నిర్ణయం తీసుకోవడం హర్షదాయకమని చెప్పాలి.