Shani Louk: జర్మన్ అమ్మాయిని పొట్టనబెట్టుకున్న హమాస్ ఉగ్రవాదులు..

గాజా(Gaza)లో హమాస్(Hamas) ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. జర్మన్ టాటూ ఆర్టిస్ట్ షానీ లౌక్( German tattoo artist Shani Louk) ను అత్యంత దారుణంగా తల నరికి చంపిన ఘటన తాజాగా వెలుగుచూసింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌(Israel)పై దాడి సందర్భంగా హమాస్ ఉగ్రవాదులు(Hamas terrorists) ఆమెను అపహరించారు. షానీ లౌక్ ధరించిన బట్టలు ఆధారంగా ఆమె తల్లి గుర్తించారు. ఇప్పుడు షానీ లౌక్ మరణాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది. హమాస్ ఉగ్రవాదులు షానీలౌక్ ను గాజా వీధుల్లో […]

Share:

గాజా(Gaza)లో హమాస్(Hamas) ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. జర్మన్ టాటూ ఆర్టిస్ట్ షానీ లౌక్( German tattoo artist Shani Louk) ను అత్యంత దారుణంగా తల నరికి చంపిన ఘటన తాజాగా వెలుగుచూసింది.

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌(Israel)పై దాడి సందర్భంగా హమాస్ ఉగ్రవాదులు(Hamas terrorists) ఆమెను అపహరించారు. షానీ లౌక్ ధరించిన బట్టలు ఆధారంగా ఆమె తల్లి గుర్తించారు. ఇప్పుడు షానీ లౌక్ మరణాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది. హమాస్ ఉగ్రవాదులు షానీలౌక్ ను గాజా వీధుల్లో ఊరేగించి తల నరికి చంపారని ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు యిట్జాక్ హెర్జోగ్(Yitzhak Herzog) వెల్లడించారు. జర్మన్ టాటూ ఆర్టిస్ట్ మరణంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్ చేసింది. ఆమెను ముందుగా ఉగ్రవాదులు చిత్రహింసలు పెట్టి గాజా చుట్టూ ఊరేగించారని ఈ సంఘటన చాలా భయానకంగా ఉంది అది చూసి తమ హృదయం బాధతో నిండిపోయిందని పేర్కొంది. ఇది భయంకరమైన సంఘటన అని పేర్కొంది.

Read More: Israel: గాజాలో కాల్పుల విరమణ పిలుపుపై ఇజ్రాయెల్‌ స్పందన..

‘‘షాని నికోల్ లౌక్ (Shani Nicole Louck)హత్యకు గురయ్యారని మాకు ఇప్పుడు వార్తలు అందినందుకు చింతిస్తున్నాను. ఇది అనాగరిక, క్రూరంగా జంతువుల్లా ఆమె తలను నరికివేశారు’’ అని జర్మన్ అధ్యక్షుడు చెప్పారు.  ఇజ్రాయెల్‌లో జరిగిన ట్రైబ్ ఆఫ్ సూపర్‌నోవా(Tribe of Supernova) కచేరీలో జర్మన్ టాటూ ఆర్టిస్ట్ షానీ లౌక్ పాల్గొన్నారు. ఈ సమయంలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లో దాడి చేశారు. ఈ దాడిలో ఉగ్రవాదులు షానీ లౌక్‌ను కిడ్నాప్ చేశారు. అనంతరం గాజాలో సాయుధ ఉగ్రవాదులతో నిండిన వీడియోలు వైరల్(Viral) కాగా.. అందులో ఒక వీడియోలో ఒక యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆ యువతి తల్లి రికార్డా తన కూతురు శరీరంపై ఉన్న పచ్చబొట్లు, రంగు వేసిన జుట్టు ఆధారంగా గుర్తించింది.

గాజా-ఇజ్రాయెల్(Gaza-Israel) సరిహద్దుల్లోని కబేళా వీధిలో రక్తం ప్రవహించడాన్ని తాము చూశామని ఇజ్రాయెల్ పేర్కొంది. హమాస్ ఉగ్రవాదులు బందీల్లో కొందరిని క్రూరంగా కాల్చివేసి ఛిద్రం చేయడంతో వారి గుర్తింపు ప్రక్రియకు సమయం పట్టిందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు చెప్పారు. 23 ఏళ్ల టాటూ ఆర్టిస్ట్ కుటుంబం కూడా ఆమె మరణాన్ని అంతకుముందు రోజు ధృవీకరించింది. హమాస్ ఉగ్రవాదులు చిరిగిన బట్టలతో ఉన్న మహిళపై ఉమ్మివేసి కొట్టినట్లు వీడియోలో చూపించారని ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీస్(Israel Rescue Service) తెలిపింది.  ట్రైబ్ ఆఫ్ నోవా డ్యాన్స్ రేవ్ జరిగిన ప్రదేశంలో 260 మందికి పైగా మరణించారు. హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్ దేశంలో 1400మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైనిక దళాలు గాజా స్ట్రిప్ పై జరిపిన దాడుల్లో 8వేలమందికి పైగా మరణించారు.

కూతురు మరణంపై స్పందించిన తల్లి

షానీ లౌక్ తల్లి రికార్డా జర్మన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ తన కూతురు బతికి లేదనే వార్త ఆదివారం తమకు అందిందని తెలిపింది. ఇప్పుడు లౌక్ చనిపోయినట్లు ప్రకటించారని తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌ నివేదిక ప్రకారం ఈ జర్మన్ అమ్మాయి మృతదేహం ఇంకా గాజాకు తిరిగి రాలేదని పేర్కొంది.  అంతకుముందు జర్మన్ అమ్మాయి బంధువు తోమసినా బెంట్రాబ్ లౌక్ షానీ లౌక్ సజీవంగా తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

షానీ క్రెడిట్ కార్డ్

జర్మన్ టాటూ ఆర్టిస్ట్ కిడ్నాప్ చేయబడిన ఇజ్రాయెల్ కచేరీ హమాస్ ఉగ్రవాదుల దాడి చేసిన మొదటి ప్రదేశాలలో ఒకటి. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు తాము చేసిన బందీలను ఊరేగించిన వీడియో  వైరల్‌ చేశారు. షాని తల్లి బ్యాంక్ నుండి అందిన సమాచారం ప్రకారం..  షాని క్రెడిట్ కార్డ్ చివరిగా గాజాలో ఉపయోగించారని పేర్కొంది. తన కూతురుని దోచుకున్న ఉగ్రవాదులు క్రెడిట్ కార్డు(Credit card)ను ఉపయోగించారని వెల్లడించింది.