పాకిస్తాన్‌లో డిప్లొమ్యాట్‌గా భార‌తీయ మ‌హిళ‌

ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఒక్క రంగం అని గిరి గీసుకుని పెట్టుకోకుండా ఉన్న ప్రతి రంగంలో సత్తా చాటుతున్నారు. మహిళల స్పీడుకు పురుషులు ఎక్కడికో వెళ్లిపోయారు. దేశంలో ఏ పోటీ పరీక్ష జరిగినా కానీ ఎటువంటి ఇంటర్వ్యూలు జరిగినా కానీ మహిళలే సత్తా చాటుతున్నారు. మహిళలు ఏకంగా అంతరిక్షంలోకి కూడా పయనిస్తున్నారు. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితం అయి ఉండే వారు. కానీ ప్రస్తుతం మాత్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వారికి సాధ్యం కావనే […]

Share:

ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఒక్క రంగం అని గిరి గీసుకుని పెట్టుకోకుండా ఉన్న ప్రతి రంగంలో సత్తా చాటుతున్నారు. మహిళల స్పీడుకు పురుషులు ఎక్కడికో వెళ్లిపోయారు. దేశంలో ఏ పోటీ పరీక్ష జరిగినా కానీ ఎటువంటి ఇంటర్వ్యూలు జరిగినా కానీ మహిళలే సత్తా చాటుతున్నారు. మహిళలు ఏకంగా అంతరిక్షంలోకి కూడా పయనిస్తున్నారు. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితం అయి ఉండే వారు. కానీ ప్రస్తుతం మాత్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వారికి సాధ్యం కావనే పనులే ప్రస్తుతం లేకుండా పోయాయి. మహిళలు సాధిస్తున్న విజయాలను చూసి అంతా మెచ్చుకుంటున్నారు. వారిని ఎంతో కీర్తిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఎక్కువగా పురుషులే పని చేస్తుంటారు. వేరే దేశాల్లో మన దేశాలకు రాయబారిగా ఉండేందుకు ఎక్కువగా పురుషులను సెలెక్ట్ చేస్తారు. అదీ పాకిస్తాన్‌లో లాంటి దేశంలో అయితే చాన్సే లేదని తప్పకుండా పురుషులకే ఆ పోస్టు ఇస్తారు. అందులో ఉండే రిస్క్ అటువంటిది. కానీ మొదటి సారి పాకిస్తాన్‌లో రాయబారిగా కేంద్ర ప్రభుత్వం ఓ మహిళను నియమించింది. పాకిస్తాన్‌లో భార‌తీయ డిప్లొమ్యాట్‌గా మ‌న భార‌తీయ మ‌హిళ ప‌నిచేస్తోంది. త్వరలోనే పాకిస్తాన్‌లో కొత్త పోస్టులోకి ఆమె మారనుంది.

మొదటి మహిళగా రికార్డు

మనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నాకానా పాక్ లో ఓ రాయబారిగా ప్రభుత్వం మహిళను నియమించలేదు. పాక్ లో పనంటే అంత రిస్క్ తో కూడుకుని ఉంటుందని ప్రభుత్వం కూడా భావిస్తుంది. కానీ మొట్టమొదటి సారిగా కేంద్రం ఓ మహిళను ఇందుకోసం ఎంపిక చేసింది. పాక్ లోని ఇస్లామాబాద్ లో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమె 2005వ బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. గీతిక స్థానంలో ప్రస్తుతం అక్కడ సురేష్ కుమార్ అనే వ్యక్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సురేష్ కుమార్ ఢిల్లీకి తిరిగి రాగానే గీతిక అక్కడికి వెళ్లి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదాను తొలగించిన తర్వాత భారత్ పాక్ మధ్య దౌత్య సంబంధాలు బాగా క్షీణించాయి. గీతిక శ్రీ వాస్తవకు ఇంతకు ముందు కూడా రాయబారిగా చేసిన అనుభవం ఉంది. ఆమె 2007 నుంచి 2009 వరకు చైనాలో భారత రాయబారిగా సేవలందించారు. చైనా రాజధాని బీజింగ్ లోని రాయబార కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తించారు. అంతే కాకుండా ఆమె కోల్ కతా లోని పాస్ పోర్ట్ కార్యాలయ డైరెక్టర్ గా కూడా పని చేశారు.

గీతిక ముందు పెద్ద బాధ్యతలే

2005వ బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గీతిక శ్రీ వాస్తవ ముందు కేంద్రం పెద్ద బాధ్యతలే ఉంచింది. ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదాను తీసేస్తూ నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి పాక్ తో మనకు పెద్దగా సంబంధాలు లేవు. అంతే కాకుండా ఆ దేశం సరిహద్దుల్లో మనల్ని ఎప్పుడూ కవ్విస్తూనే ఉంటుంది. తరచూ మన దేశ సైనికులు పాక్ కు సంబంధించిన ఏదో ఒక కుట్రను బయటపెడుతుంటారు. ఇవ్వన్ని ప్రతికూలతల మధ్య తొలి పాక్ మహిళా రాయబారిగా నియమితురాలైన గీతిక శ్రీ వాస్తవ ఎలా తన మార్క్ చూపిస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆమె ఈ దేశ రాయబారిగా కొత్త కానీ రాయబారిగా మాత్రం కొత్త కాదని ఆమె గురించి తెలిసిన కొంత మంది ప్రముఖులు కామెంట్ చేస్తున్నారు. ఏ దేశానికి వెళ్లిన గీతిక తనదైన ముద్ర చూపించడం తప్పని సరి అని అంటున్నారు. కావున పాకిస్తాన్ లో కూడా గీతిక పెద్ద ఇబ్బందులను ఎదుర్కోదని చెబుతున్నారు. గీతికకు తనకంటూ ఓ ప్లాన్ ఉంటుందని ఆ ప్లాన్ తో ప్రతి పనిని చాలా సులువు చేసుకుంటుందని అంటున్నారు. ఏదేమైనా గీతిక శ్రీ వాస్తవ భుజాల మీద కేంద్రం పెద్ద బాధ్యతనే మోపింది. మరి ఈ బాధ్యతలను గీతిక ఎలా నెరవేరుస్తుందో.