HALతో టై అప్ అయిన GE ఏరోస్పేస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  అమెరికాను సందర్శించిన కొద్ది నిమిషాల తర్వాత, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం ఫైటర్ జెట్ ఇంజన్స్ ప్రొడక్షన్ కలిసికట్టుగా హాల్ మరియు GE ఎరోస్పేస్ మొదలుపెట్టనున్నాయని అనౌన్స్మెంట్ జరిగింది. దీనికి సంబంధించి యుఎస్ సంబంధిత సంస్థ ఏమన్నారంటే,” ఒప్పందం ప్రకారం, GE ఎరోస్పేస్ F414 ఇంజన్స్ తయారీ విషయంలో GE ఏరోస్పేస్ యూఎస్ గవర్నమెంట్తో పనిచేయడం కొనసాగుతూనే ఉంటుంది, దీనికి సంబంధించిన మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయడం […]

Share:

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  అమెరికాను సందర్శించిన కొద్ది నిమిషాల తర్వాత, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం ఫైటర్ జెట్ ఇంజన్స్ ప్రొడక్షన్ కలిసికట్టుగా హాల్ మరియు GE ఎరోస్పేస్ మొదలుపెట్టనున్నాయని అనౌన్స్మెంట్ జరిగింది.

దీనికి సంబంధించి యుఎస్ సంబంధిత సంస్థ ఏమన్నారంటే,” ఒప్పందం ప్రకారం, GE ఎరోస్పేస్ F414 ఇంజన్స్ తయారీ విషయంలో GE ఏరోస్పేస్ యూఎస్ గవర్నమెంట్తో పనిచేయడం కొనసాగుతూనే ఉంటుంది, దీనికి సంబంధించిన మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది” అని వెల్లడించారు.

అంతేకాకుండా, భారత్ మరియు అమెరికా మధ్య డిఫెన్స్ పరంగా ఉన్న సంబంధం HAL రాకతో మరింత బలపడుతుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అగ్రిమెంట్ ప్రకారం HAL తో సంబంధం చిరకాలం కూడా ఉంటుంది అనే ఉద్దేశం, GE ఎయిరో స్పేస్ సీఈఓ అలాగే చైర్మన్ లారెన్స్ బయటపెట్టారు.

LCA-MK-II ప్రోగ్రాంలో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం, ముందుగా GE ఏరోస్పేస్ IAF కోసం 99 మోడల్ ఇంజన్స్ తయారీ ప్రక్రియలో సహాయపడుతుందని వెల్లడించింది. అంతేకాకుండా, ఈ ప్రోగ్రాం కచ్చితంగా ఇండియాలో మరిన్ని ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయడానికి ఎంతో బాగా సహాయపడుతుందని. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న F404 మోడల్ ఇంజన్ ప్రోటోకాల్ అనేది, AMCA ప్రోగ్రాం లో భాగంగా F414-INS6 ఇంజన్ టెస్టింగ్ అలాగే సర్టిఫికేషన్లో తప్పకుండా సహాయపడుతుందని స్టేట్మెంట్ వెల్లడించింది.

అంతేకాకుండా GE ఎయిరో  స్పేస్ అనేది ఎల్లప్పుడు AMCA ప్రోగ్రాంలో తప్పకుండా కోలాబరేట్ అవుతూనే ఉంటుందని వెల్లడించింది. దీని గురించి యూఎస్ సంస్థ మాట్లాడుతూ,” ఇది నిజంగా చాలా గొప్ప విషయం, బిడెన్ మరియు మోదీ విజన్ లో రెండు దేశాల మధ్య ఒప్పందాలు ఇంకా బలపడతాయి . F414 ఇంజన్స్ తయారీ విషయాలతో, ఇరుదేశాల మధ్య ఉండే స్నేహపూర్వకమైన బంధం ఇంకా బల్పడుతుంది. అంతేకాకుండా, ఆర్థిక పరంగా కూడా ఎన్నో లాభాలు చేకూర్తాయి. తప్పకుండా, ఉత్పత్తి జరిగే హై క్వాలిటీ ఇంజన్స్, మిలట్రీ వాళ్లకి ఎంతగానో ఉపయోగపడతాయి” అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం వాడుతున్న ఇంజన్స్: 

ప్రస్తుతం HAL, 83 లైట్ కం బ్యాట్ ఎయిరో క్రాఫ్ట్  తయారీ విషయంలో GE 404 వాడుతున్నారు. అంతేకాకుండా భారత దేశంలో GE ఎయిరో స్పేస్ అనేది నాలుగు దశాబ్దాలుగా ఎంతో విస్తరించింది. ఇంజన్స్ తయారీ విషయంలోనే కాకుండా, సర్వీసెస్, అవాయినిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, లోకల్ సోర్సింగ్ విషయాలలో కూడా ఎంతో సహాయపడింది.

LCA MK1 మరియు LCA MK2 ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్లో, GE ఏరోస్పేస్ ద్వారా F404 మరియు F414 కూడా పాలుపంచుకున్నాయి. మొత్తం చూసుకున్నట్లయితే, 75 F404 ఇంజన్స్ ప్రస్తుతానికి డెలివరీ కాగా, మరో 99 LCA MK1A ద్వారా ఆర్డర్ చేయబడ్డాయి. ప్రస్తుతం నడుస్తున్న LCA MK2 ప్రోగ్రాంలో భాగంగా ప్రస్తుతానికి F414 డెలివరీ చేయడం జరిగింది. చూడ‌బోతే మోదీ ప‌ర్య‌ట‌న భార‌త్‌కు బాగా క‌లిసి వ‌చ్చేలా ఉంది. అప్ప‌టివ‌ర‌కు రాని ఆలోచ‌న‌లు మోదీ చూసాక ఒక్కొక్క‌టి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనిని బ‌ట్టి అమెరికా, భార‌త్ ద్వైపాక్షిక సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డే విధంగా ఉన్నాయ‌న్న విష‌యం క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంది. ఇదంతా మోదీ నాయ‌క‌త్వంలోనే జ‌రుగుతోంద‌ని బీజేపీ కూడా అంటోంది.