Journalist: గాజా జర్నలిస్ట్ విషాద గాధ

యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హమ్మస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ (Israel) తనని తాను రక్షించుకోవడానికి […]

Share:

యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హమ్మస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ (Israel) తనని తాను రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ చేస్తూ లెబనాన్ (Lebanon)‌లోని హిజ్బుల్లా(Hezbollah) లక్ష్యాలపై ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు చేసింది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి ఇజ్రాయిలీలు, తమ సొంత గడ్డకు దారి వెతుకుతున్నారు. తాము స్వయంగా హమాస్ (Hamas) అంతు చూసేందుకు ప్రయాణం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక జర్నలిస్ట్ (journalist) తమ కుటుంబాన్ని (Family) కోల్పోయినప్పటికీ యుద్ధ సమాచారాన్ని అందించడం ఆపలేదు. 

గాజా జర్నలిస్ట్ విషాద గాధ: 

అల్ జజీరా  గాజా (Gaza) బ్యూరో చీఫ్ వేల్ దహదౌహ్,  ఇజ్రాయెల్ (Israel) దాడులలో మరణించిన తన కుటుంబ (Family) సభ్యుల అంత్యక్రియలు నిర్వహించిన ఒక రోజు తర్వాత,  ఇజ్రాయెల్ (Israel)-హమాస్ యుద్ధానికి సంబంధించిన సమాచారం అందించడానికి జర్నలిస్ట్ (journalist) తన విధులను నిర్వహించడానికి తిరిగి వచ్చాడు.

Also Read: Hamas: హ‌మాస్ టెర్రరిస్టులకు గురిపెట్టిన ఇజ్రాయిల్

నెట్‌వర్క్ ప్రకారం,  గాజా (Gaza) మధ్యలో ఉన్న నుసిరత్ శిబిరంపై దాడి (Attack)లో దహ్దౌహ్ తన భార్య, కుమార్తె, మనవడు మరియు కొడుకును కోల్పోయారు. అయితే ఇంతకుముందు  గాజా (Gaza) స్ట్రిప్ ఉత్తర భాగాలలో పరిసరాల్లోని జరిగిన బాంబు దాడి (Attack) కారణంగా ఇతర ప్రాంతాలకు జర్నలిస్ట్ (journalist) కుటుంబ (Family) సభ్యులు వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే కుటుంబాన్ని (Family) కోల్పోయి ఉండి.. అంత బాధలో కూడా.. ప్రెస్ గేర్ ధరించి, భవనంపై నిలబడి, తమ మనసుల్లో నొప్పి, గాయం ఉన్నప్పటికీ, కెమెరా ముందుకు తిరిగి రావడం, సోషల్ మీడియాలో కమ్యూనికేట్ చేయడం తన కర్తవ్యంగా భావించినట్లు.. తన వంతు సాధ్యమయ్యేంతవరకు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చెప్పుకొచ్చాడు జర్నలిస్ట్ (journalist).

అక్టోబరు 7న హమాస్ ఆకస్మిక దాడి (Attack)ని ప్రారంభించిన తర్వాత..  ఇజ్రాయెల్ (Israel) మొదలుపెట్టిన దాడుల్లో  గాజా (Gaza)లో మరణించిన 7,000 మందిలో జర్నలిస్టు కుటుంబ (Family) సభ్యులు ఉన్నారు, అక్కడ 1,400 మంది మరణించారు మరియు 200 మందికి పైగా బందీలుగా మారారు. 

యుద్ధభేరి: 

ఈ నెలలో దాడి (Attack)ని ప్రారంభించిన హమాస్ (Hamas) వందల మందిని బందీలుగా మార్చడమే కాకుండా, 1,400 మందిని పొట్టన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 2007 నుంచి గాజా (Gaza)ను పాలిస్తున్న ఈ మిలిటెంట్ గ్రూపును అమెరికా, ఈయూ తదితర దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.

హమాస్ (Hamas) చేసిన దాడి (Attack) తర్వాత, ఇజ్రాయిల్ (Israel) గాజా (Gaza) అంతటా వైమానిక దాడులను ప్రారంభించింది. మిడిల్ ఈస్ట్, యూరప్, యుఎస్ అంతటా నిరసనలకు ఆజ్యం పోసిన శత్రుత్వాలు ప్రారంభమైనప్పటి నుండి, 4,500 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని హమాస్ (Hamas) ఆరోగ్య అధికారులు ఆదివారం తెలిపారు. 2 మిలియన్ల మంది ప్రజలు నివసించే గాజా (Gaza)లోకి మరింత సహాయం అందించడానికి, అదేవిధంగా ఇజ్రాయిల్ (Israel)‌పై ఒత్తిడి తీసుకువస్తూ యుద్ధాన్ని అరికట్టడానికి ప్రపంచ నాయకులు ప్రయత్నిస్తున్నారు.

Also Read: Israel: గాజాలో ఇజ్రాయెల్ యొక్క వ్యూహాత్మక అడుగులు..!

పసిఫిక్ సౌత్‌వెస్ట్‌కు ఇజ్రాయిల్ (Israel) కాన్సుల్ జనరల్ ఇజ్రాయిల్ (Israel) బచార్ ప్రకారం, US నుండి వాణిజ్య మరియు చార్టర్ విమానాలలో ఇప్పటికే 10,000 మందికి పైగా ఇజ్రాయిలీలు, ఇజ్రాయిల్ (Israel) కు ప్రయాణించారు. చాలా మంది ఇజ్రాయిల్ (Israel) సైన్యం (Army) ప్రపంచవ్యాప్తంగా ఉన్న3,60,000 మంది ఇజ్రాయిలీలకు తమతో పాటు యుద్ధం (War)లో పాల్గొనమని పిలుపునిచ్చారు. అందులో కొంతమంది సామాన్య పౌరులు, వాలంటీర్లు ఉన్నారు.