Gaza: యుద్ధ పరిస్థితి చూసి విలపిస్తోన్న గాజా

వారం రోజులుగా బాంబు దాడులు కారణంగా, ఇజ్రాయిల్ వణికిపోతున్న క్రమం కనిపిస్తోంది. గాజా(Gaza)లోని అనేక ప్రాంతాలు బాంబు(Bomb) దాడులకు గురైపోయాయి. ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోగా, చాలామంది తమ కుటుంబాలను సైతం విడిచిపెట్టి ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతున్న దీన పరిస్థితి నెలకొంది.  యుద్ధ పరిస్థితి చూసి విలపిస్తోన్న గాజా:  గాజా(Gaza) నగరం రిమాల్ పరిసరాలలో ఉన్న ప్రదేశం. దీనికి కాన్‌స్టాంటైన్ ది గ్రేట్.. రాజ శాసనం.. నగర హోదా ఇచ్చారు. వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన తరువాత, […]

Share:

వారం రోజులుగా బాంబు దాడులు కారణంగా, ఇజ్రాయిల్ వణికిపోతున్న క్రమం కనిపిస్తోంది. గాజా(Gaza)లోని అనేక ప్రాంతాలు బాంబు(Bomb) దాడులకు గురైపోయాయి. ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోగా, చాలామంది తమ కుటుంబాలను సైతం విడిచిపెట్టి ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతున్న దీన పరిస్థితి నెలకొంది. 

యుద్ధ పరిస్థితి చూసి విలపిస్తోన్న గాజా: 

గాజా(Gaza) నగరం రిమాల్ పరిసరాలలో ఉన్న ప్రదేశం. దీనికి కాన్‌స్టాంటైన్ ది గ్రేట్.. రాజ శాసనం.. నగర హోదా ఇచ్చారు. వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన తరువాత, నాలుగు రోజుల ఏకధాటిగా ఇజ్రాయెల్ పైన జరిగిన వైమానిక దాడు(attack)ల తర్వాత గురువారం, నిజంగా రిమాల్ కాంతం మొత్తం శిథిలావస్థకు చేరుకుంది అని చెప్పుకోవచ్చు. 

సుజాన్ బర్జాక్, 37 మరియు గాజా(Gaza)లోని ది అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మ్యాథమెటిక్స్ చెప్పే ఉపాధ్యాయురాలు. ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ గాజా(Gaza) పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ భవనంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఒక్కసారిగా దాడు(attack)లు మొదలైన క్రమంలో తమ కుటుంబ సభ్యులు అదేవిధంగా తమ చుట్టుపక్కల అపార్ట్మెంట్లలో ఉండే అందరూ కలిసి, ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోతే సురక్షితంగా ఉండొచ్చని అందరూ ఒకచోటే ఉండడం జరిగింది. నిజంగా ఆ రోజు ఒక పీడకలలా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా మొదట దాడు(attack)లు జరిగిన రెండు రోజులు తమకి తినడానికి, తాగడానికి ఉన్నప్పటికీ, తమ పిల్లలు(Children) వేసే ప్రశ్నలతో తమకు ఎంతో బాధ కలిగిందని చెప్పుకొచ్చింది ఉపాధ్యాయురాలు. 

అసలు మనం ఇక్కడ ఎందుకు పుట్టాము? మనం వేరే దేశం వెళ్లిపోవచ్చు కదా? అసలు మనల్ని ఎందుకు చంపాలని చూస్తున్నారు? ఈరోజు మనం చచ్చిపోతామా? నీకు నాన్నకు ఏదైనా జరిగితే మేము ఎక్కడ ఉండాలి? అంటూ పిల్లలు(Children) ఏడుస్తూ అడిగిన ప్రశ్నలు గుర్తుచేసుకొని మరొకసారి బాధపడింది ఉపాధ్యాయురాలు. 

పక్క బిల్డింగ్ కుప్పకూలింది: 

ఉపాధ్యాయురాలు బర్జాక్, మీడియా వాళ్లతో మాట్లాడుతూ, తమకు జరిగిన ప్రతి సంఘటన గురించి చెప్పడం జరిగింది. తాము ఎంతగానో భయపడిపోయామని, అంతేకాకుండా హఠాత్తుగా ఆదివారం నాడు తమ అపార్ట్మెంట్ పక్కనే ఉండే చారిటీ ఆర్గనైజేషన్ బాంబు(Bomb) దాడికి కుప్పకూలడంతో, తమ బిల్డింగ్ కూడా ఒక పక్కకు ఒరిగిందని మాట్లాడింది. అయితే అదే రోజు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఆర్మీ నుంచి తమకి ఫోన్ కాల్స్ వచ్చాయని, వెంటనే తమ బిల్డింగ్ ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోమని వాళ్ళు సలహా ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది బర్జాక్. తన భర్త తన కొడుకు తమ చుట్టుపక్కల కొంతమందితో కలిసి గాజా(Gaza) సిటీ సెంటర్లో ఉండే తన అంకుల్ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పుకొచ్చింది. అయితే అక్కడికి వెళ్లినప్పటికీ కూడా బాంబు(Bomb)దాడులు ఆగలేదని, మా కుటుంబ సభ్యులు మా ఆత్మీయలతో కలిసి ఒక రూములో బిక్కుబిక్కుమంటూ బాంబు(Bomb)ల సౌండ్ వింటూ భయభ్రాంతులకు గురయ్యామని తనకి జరిగిన పీడకలను గుర్తు చేసిందే బర్జాక్. అయితే తమని మరింత భయపెట్టకూడదని తమ కుటుంబ సభ్యులలో కొంతమంది గాజా(Gaza)లోని కొన్ని ప్రదేశాలలో భూకంపం సంభవించిందని తమని ఓదార్చడానికి చెప్పుకొచ్చినట్లు వెల్లడించింది. 

అయితే ఇప్పటివరకు తమకి సహాయం చేయడానికి ఒక ఎన్జీవో లేదంటే యునైటెడ్ నేషన్స్ తరఫునుంచి ఎవరు రాలేదని, అసలు లోకల్ సర్వీస్ నెంబర్లు కూడా తమకే తెలియదని, నిజంగా చుట్టుపక్కలంతా కూడా స్మశానంలా మారిందని ఆమె మాట్లాడింది. పిల్లల(Children) ఆర్తనాదాలు వినైనా ఇప్పటికైనా తమ ప్రాణాలను కాపాడి, తమకు సహాయం చేయాలని వేడుకుంటుంది బర్జాక్.