మాయన్ అగ్నిపర్వతంపై విమానం కూలి నలుగురి మృతి

ఫిలిప్పీన్స్‌లో ఓ చిన్న విమానం కుప్పకూలింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో ఈ విమానం కూలిపోయిన ప్రదేశంలో చురుకైన అగ్నిపర్వతం కూడా ఉంది. ఈ విమానంలో నలుగురు వ్యక్తులు ఉండగా.. అగ్నిపర్వతం సమీపంలోని ఏటవాలు ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వారి మృతదేహాల కోసం వెతుకుతున్నారు. నలుగురితో ప్రయాణిస్తున్న సెస్నా 340 విమానం అల్బే ప్రావిన్స్‌లోని బికోల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మనీలాకు బయలుదేరిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. మనీలాకు చెందిన ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారు.. తప్పిపోయిన విమానం […]

Share:

ఫిలిప్పీన్స్‌లో ఓ చిన్న విమానం కుప్పకూలింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో ఈ విమానం కూలిపోయిన ప్రదేశంలో చురుకైన అగ్నిపర్వతం కూడా ఉంది. ఈ విమానంలో నలుగురు వ్యక్తులు ఉండగా.. అగ్నిపర్వతం సమీపంలోని ఏటవాలు ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వారి మృతదేహాల కోసం వెతుకుతున్నారు. నలుగురితో ప్రయాణిస్తున్న సెస్నా 340 విమానం అల్బే ప్రావిన్స్‌లోని బికోల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మనీలాకు బయలుదేరిన కొద్దిసేపటికే అదృశ్యమైంది.

మనీలాకు చెందిన ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారు.. తప్పిపోయిన విమానం తమ కంపెనీకి చెందినదని, “సుమారు 6,000 అడుగుల ఎత్తులో” కనిపించిన శకలాలు దానివేనా అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఆ చిన్న  విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికుల్లో ఇద్దరు ఆస్ట్రేలియా పౌరులని బికోల్ పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్‌తో పాటు రెస్క్యూ టీమ్‌లను రంగంలోకి దించారు.

ఫిలిప్పీన్స్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి ఎరిక్ అపోలోనియో ఇలా అన్నారు: “సమస్య ఏమిటంటే వాతావరణం చెడుగా ఉండడంతో మరియు దాని వల్ల రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహించడం కష్టమవుతుంది”.

అగ్నిపర్వతం ఎప్పుడైనా పేలవచ్చు

అల్బే విపత్తు అధికారి సెడ్రిక్ డెప్ మాట్లాడుతూ.. సెస్నా విమానం బిలం నుండి 300-350 మీటర్లు (984 అడుగుల నుండి 1,148 అడుగుల వరకు) కనిపించిందని తెలిపారు. అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉందని, దీనివల్ల రక్షించడం కష్టమవుతుందని డెప్ హెచ్చరించాడు.

ఫిలిప్పీన్స్‌లో వారాంతంలో కూలిపోయిన ఆరు సీట్ల విమానంలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు సీఎన్ఎన్ నివేదించింది. నిద్రాణమైన అగ్నిపర్వతంపై సెర్చ్ ఆపరేషన్ తర్వాత నలుగురు వ్యక్తులు మరణించినట్లు ఫిలిప్పీన్స్ అధికారులు కంఫర్మ్ చేసారు. 

బాధితుల్లో పైలట్ రూఫినో జేమ్స్, క్రిసోస్టోమో జూనియర్, క్రూ మెంబర్ జోయెల్ మార్టిన్, ఆస్ట్రేలియా సాంకేతిక సలహాదారులు సైమన్ చిప్పర్‌ఫీల్డ్ మరియు కార్తీ సంతానం ఉన్నారు. వారి మృతదేహాలు మౌంట్ మయోన్ అగ్నిపర్వతంపై కనుగొనబడ్డాయి. వారాంతంలో ఫిలిప్పీన్స్‌లో విమానం కూలిపోయిన తర్వాత వ్యక్తులను కనుగొనడానికి ఒక బృందం పని చేస్తోందని సీఎన్ఎన్ నివేదించింది. 

నలుగురు వ్యక్తులు మనీలాకు చెందిన జియోథర్మల్ సంస్థ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఉద్యోగులుగా ఉన్నారు. కంపెనీ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రిచర్డ్ టాంటోకోను ఉటంకిస్తూ సీఎన్ఎన్ నివేదించింది.

ఆరు సీట్ల సెస్నా 340 విమానం మనీలాకు వెళుతుండగా.. అల్బే ప్రావిన్స్‌లోని బికోల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాన్ని కోల్పోయిందని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ (సీఏఏపీ) ను ఉటంకిస్తూ సీఎన్ఎన్ నివేదించింది.

మరునాడు దాదాపు 6000 అడుగుల ఎత్తులో శిథిలాలు కనిపించాయి. అయినప్పటికీ, CAAP ప్రకారం.. వర్షపు పరిస్థితులు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం మరియు అగ్నిపర్వత అశాంతి యొక్క “మితమైన” స్థాయిలు శోధన ప్రయత్నాలకు ఆటంకం కలిగించాయి. విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించినట్లు సీఏఏపీ తెలిపింది.

ఒక ప్రత్యేక సంఘటనలో.. ఫిలిప్పీన్స్ వైమానిక దళానికి చెందిన ఇద్దరు ఏవియేటర్లు గత నెలలో శిక్షణా వ్యాయామంలో మరణించారు. వారి SF260 మార్చెట్టి విమానం మనీలా సమీపంలోని బటాన్ ప్రావిన్స్‌లో వరి పంటలో కూలిపోయింది. గత నెల జనవరి 24న ఉత్తర ప్రావిన్స్ ఇసాబెలాలో మరో ససేనా విమానం తప్పిపోయింది. ఆ విమాన శకలాలు ఇంకా లభ్యం కాలేదని అపోలోనియో తెలిపారు.